పరిచయం

కొత్త తరానికి లెనిన్ పరిచయం

 “ఈనాటి జీవితాన్ని సామ్రాజ్యవాద సంస్కృతి స్పృశించని పార్శ్వము, కోణామూ లేదు. అది మన అలవాట్లనూ, ఆచారాలనూ, ప్రవర్తననూ, సంస్కారాలనూ, కుటుంబాలను, సామాజిక సంబంధాలనూ, మన కోర్కెలను, ఆశలను, రాజ్యాన్ని, రాజకీయాలను వ్యక్తులనూ, సంస్థలనూ, కలల్ని, కళల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూవుంది. క్షీణ విలువలకు ముఖ్య ఆధారంగా సాంస్కృతిక సామ్రాజ్యవాదం నిలిచివున్నది.”     - లెనిన్ Lenin for children పేరుతో సోవియట్ రష్యా బొమ్మల పుస్తకం ప్రచురించింది. దీన్ని అమెరికన్ పిల్లల కోసం రూత్ షా ఇంగ్లీషు లోకి అనువదించగా 1934 లో ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, న్యూయార్క్ వాళ్ళు ‘our lenin. For boys and girls’ అంటే ‘మన
సమీక్షలు

మట్టి మాటల కవి

Truly to sing, that is a different breath. Rainer Maria Rilke. (Austria poet) ఇప్పుడు రాస్తున్న యువకులు అంతా తమ కొత్త గొంతుతో‌ ధిక్కార స్వరంతో‌ తమదైన నుడికారంతో రాస్తున్నారు. ఇటీవలి‌ విరసం సభలలో ఆవిష్కరించిన "నేల నుడికారం" కవిత్వం ఉదయ్ కిరణ్‌ రాసింది చదువుతుంటే మనల్ని మనంగా నిలవనీయని ఒక కుదుపు ఆ పదాల‌ పొందికలో చూసిన‌ అనుభూతికి లోనవుతాం. తీరికగా కూచుని కవిత్వం రాసే తరం కాదిది. పొట్టకూటి కోసం నిరంతరం శ్రమిస్తూనే తమ‌ రోజువారీ పనులు చేస్తున్నట్లుగానే ప్రజల పట్ల ఒక బాధ్యతగా రాస్తున్న యువతరమిది. చెప్పాలనుకున్నది సూటిగా గుండెల్లోకి
సమీక్షలు

అంతర్జాతీయ రియలిస్టిక్ సినిమా

 “విభిన్న భాషల, జాతుల ప్రజలను చైతన్య పరచడానికి సినిమాను మించిన కళారూపం మరొకటి లేదు “ అన్న లెనిన్ అభిప్రాయానికి అనువుగా వివిధ  ప్రాంతాలకు చెందిన 29 సమాంతర, ప్రత్యామ్నాయ సినిమాల గురించి ఎంతో ప్రేమతో, గొప్ప అవగాహనతో, ఒక మంచి అభిరుచితో, ఒక ప్రత్యేకమైన లోచూపుతో, రచయిత్రి శివలక్ష్మి గారు  పంచుతున్నసినీ  విజ్ఞాన చంద్రికలు  ఈ అంతర్జాతీయ సినిమాల గురించిన వ్యాసాలు. మాతృక, మహిళా మార్గం, అరుణ తార పత్రికలు; విహంగ, సారంగ, కొలిమి, వసంత మేఘం వంటి  అంతర్జాల పత్రికలలో  ప్రచురించిన సినీ సమీక్షల సంకలనం ఈ పుస్తకం. విఖ్యాత రచయిత  వరవరరావు గారు సినిమాలలో
సమీక్షలు

రెప్పవాల్చని చూపు          

 'అట్టడుగున అందరమూ మానవులమే' అన్న కవి మాటల్లో జీవశాస్త్రపరమైన అర్ధానికి మించిన సామాజిక మానవసారం ఇమిడి ఉంది. అటువంటి ప్రాకృతిక మానవసారంతో తొణికి సలాడే మనిషి కేంద్రంగా రాసిన కవిత్వమే మిత్రుడు ఎన్. వేణుగోపాల్ 'రెప్పవాల్చని కాపలా'.  మరి కవి వేణుగోపాల్ పావురపడే మనిషి ఎవరు? ఆ మనిషి అతడు కావచ్చు. ఆమె కావచ్చు. మరి అతడు/ ఆమె కేవలం ఒక్క వ్యక్తేనా? కానే కాదు. మనిషి అస్తిత్వానికి ఏకరూపం లేదు. బహు రూపాలు ఉన్నాయి. అనంతమైన భిన్నత్వం ఉంది. కనుక సహజంగానే మనిషి ఆలోచనలోను, ఆచరణలోనూ అటువంటి విభిన్నత్వమే ఉంటుందని ఈ కవి భావిస్తాడు. అయితే ఆయనకు
సమీక్షలు

లోపలి, బైటి ఘర్షణల్లో ‘శికారి’

‘శికారి’నవలలోని కథ జీవితానికి సంబంధించిన ఒక ప్రవాహం. ఆ ప్రవాహం కెసి కెనాల్‌ అనే జల ప్రవాహం ఒడ్డున పెనవేసుకున్న  శికారీల జీవితం.  ఈ జీవన ప్రవాహం ఒక భార్యాభర్తల గొడవతో మొదలౌతుంది..అక్కడ నుండి  శికారిల లోపలి, బైటి వైరుధ్యాల మీదుగా  అలా కొనసాగుతుంది.  చివరికి ఒక ఉత్సవంతో ముగుస్తుంది. ఈ ఆశ నిరాశల జీవన గమ్యం-గమనం ఏమిటి? నిత్యం మారే రాజకీయార్థిక పరిస్థితులు జీవితాన్ని స్థిమితంగా ఒక చోట ఉండనిస్తాయా?  ఆ కదలిక ఈ కథలో ఉంది. చుట్టూ మారుతున్న రాజకీయార్థిక పరిస్థితులు శికారీలను కూడా ప్రభావితం చేస్తాయి. కథనంలో శికారీ పాత్రలు వస్తూ ఉంటాయి. జీవన
సమీక్షలు

ప్రజా దృక్పథం లేని ‘భిన్న దృక్పథాలు’

పర్స్ పెక్టివ్స్ సంస్థ ప్రచురించిన అనువాద వ్యాసాల సంకలనం ‘భిన్న దృక్పథాలు’ భారత విప్లవోద్యమం   చేస్తున్న ప్రజాయుద్ధం గురించి అసమగ్రమైన, స్వీయాత్మకమైన, ప్రజా వ్యతిరేకమైన, వర్గ సామరస్యపూరితమైన వ్యాఖ్యలు చేసింది. కొన్ని వ్యాసాలు, కొన్ని అంశాలు మినహాయిస్తే, ప్రధానంగా, దేశ విశాల పీడిత ప్రజల దృష్టికోణంతో విప్లవోద్యమం కార్యాచరణను చూడలేకపోయింది. ప్రజల విముక్తి కోసం తప్పనిసరి అయిన విప్లవ దృక్పథం నుంచి అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు. సామాజిక మార్పు కోసం జరుగుతున్న లోతైన విప్లవ క్రమం గురించి చర్చించేందుకు అవసరమయిన వర్గ దృష్టితో విషయాలను విశ్లేషించలేదు. ఇది వర్గాల మధ్య సాగుతున్న యుద్ధంగా కాకుండా, మనుషుల మధ్య
సమీక్షలు కొత్త పుస్తకం

చదవాల్సిన కవిత్వం

నీలం సర్వేశ్వర రావు  సంపాదకత్వంలో వెలువడిన "మల్లయోధ" కవితా సంకలనంలో మల్ల యోధురాళ్ళ పై లైంగిక వేధింపుపై  రాజ్యం మను ధర్మ  పాలన పై కవులు కవయిత్రులు వివిధ కోణాల్లో తమ కలాలను నిశితంగా నిర్భయంగా ఝుళిపించిన తీరును పరిశీలిస్తే ఆయా భావాల్లో పిడికిళ్లు బిగించగలిగే  శక్తి గలదని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. కొన్ని కవితలు చప్పగా వున్ననూ తిరుగుబాటు స్పష్టంగా కనిపించింది. రేపటి స్ఫూర్తి పొద్దులు కవితలో "వారు స్త్రీలు  ఒంటికి మట్టిపొరల వస్త్రం కప్పుకున్న పాలపిట్టలు అని కుస్తీ లోని ప్రాథమిక సత్యాన్ని వివరిస్తూ" క్రీస్తు పూర్వం 2023 దేశభక్తి కొత్త నిర్వచనం జాతి గీతం అయింది
సమీక్షలు కొత్త పుస్తకం పరిచయం

మహిళలు నిర్మిస్తున్న కొత్త ప్రపంచపు పోరాట  కథలు

46 ఏళ్లుగా చదువుకొంటున్న విప్లవోద్యమ సాహిత్యం మరీ ముఖ్యంగా కథ నవల ఉత్తర తెలంగాణా జిల్లాల  భూమి పుత్రుల, భూగర్భ ఖనిజాలు తవ్వి తీసే సింగరేణి కార్మికుల, ఆదిలాబాద్ అడవి బిడ్డల అక్కడి నుండి సరిహద్దులు చెరిపివేసి మొత్తంగా ఆదివాసుల  జీవన సంఘర్షణలను, బతుకు పోరాటాలను నావిగా చేసుకొనే సంస్కారాన్ని ఇచ్చాయి.  సకల సామాజిక ఆర్ధిక రాజకీయ మానవ సంబంధాల సారం భూసంబంధాల తో ముడిపడి ఉన్నదని, దానిని ఉత్పత్తి శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే మహత్తర యుద్ధం జరుగుతున్నదని అర్ధం అయింది. ఆ యుద్ధంలో భాగమైన మహిళల అనుభవ కథనాలు కథలుగా ఇన్నాళ్లుగా  చదువుతున్నవే. .వాటిని ఇప్పుడు
సమీక్షలు

కొత్త ఒరవడి

(ఇది 2015 జనవరిలో విరసం ప్రచురించిన *సామాన్యుల సాహసం * అనే కథా సంకలనానికి రాసిన ముందు మాట.  మైనా , నిత్య, సుజాత రాసిన కథల సంకలనం ఇది. వీళ్ళు భారత  విప్లవోద్యమంలో సీనియర్ నాయకులు.  అజ్ఞాత కథలో కొత్త ఒరవడి తీసుకొచ్చిన తొలి వరుస రచయిత్రులు.  సామాన్య ప్రజలే  చరిత్రను నిర్మించగల సాహసికులుగా, సృజనశీలురుగా, మహాద్భుత శక్తిగా  వర్గపోరాటం లో  తయారవుతారని విప్లవోద్యమమం నిరూపించింది. ఆ మానవ పరిణామాన్ని ఈ కథలు చిత్రిక పట్టాయి. నలభై ఏళ్ళ అజ్ఞాత రచయిత్రుల కథలు *వియ్యుక్క* గా వెలువడుతున్న ఈ సాహిత్య సాంస్కృతిక వర్గపోరాట చారిత్రిక సందర్భాన్ని అర్థం
సమీక్షలు కొత్త పుస్తకం పరిచయం

విప్లవోద్యమ కథాసమయం

(*వియ్యుక్క*  పేరుతొ  అజ్ఞాత రచయిత్రుల కథలు ఆరు భాగాలుగా విరసం తీసుకొస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఇందులో మూడు  పుస్తకాలు విడుదల అయ్యాయి. వీటి ఆవిష్కరణ ఈ నెల 24 న హైదరాబాదులో ఉంది. ఈ సందర్భంగా తొలి మూడు భాగాలకు వియ్యుక్క ఎడిటర్ బి. అనురాధ రాసిన ముందుమాట పాఠకుల కోసం ...వసంత మేఘం టీం ) పెన్నూ గన్నూ పట్టిన రచయిత అనగానే మనకి మొట్టమొదట గుర్తుకొచ్చేది సుబ్బారావు పాణిగ్రాహి. కానీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అందులోనూ ఒక చేత్తో గన్ను పట్టి పోరాటం చేస్తూ