సమీక్షలు

విప్లవోద్యమ కవితా పతాక 

ఇది ముప్పై ఆరు పేజీల లహర్ సాహిత్యం.ఇందులో తొమ్మిది  కవితలు ఒక కథ ఉంది. ఈ తొమ్మిది కవితల్లో, కథలో ఒక్కటి మినహా మిగతావి అన్నీ .. తనతో పాటు నడిచిన తనకు ప్రేరణనిచ్చిన తనకు జ్ఞానాన్ని ఆచరణను అలవర్చిన ....అమరుల జ్ఞాపకాల సద్దిమూట. స ద్దిమూటే కాదు. దండకారణ్య విప్లవోద్యమ వర్తమాన చరిత్రకు సాక్ష్యం ఈ సాహిత్యం. 2007 నుండి 2020 వరకు రాసిన ఈ కవితలు మరీ పిరికెడు కూడా లేవు కదా అని అనిపిస్తుండొచ్చు మనకు. నిజమే అనిపిస్తుంది కూడా. ఐతే, ఫాసిస్టు దోపిడీ పాలక వర్గాలు సల్వాజుడుం గ్రీన్ హంట్ సమాధాన్ ప్రహార్
కవిత్వం

నాక్కొన్ని మాటలు కావాలిప్పుడు

నాక్కొన్ని మాటలు కావాలిప్పుడు నిజాం పోలిక సరిపోదు హిట్లర్ ముస్సోలిని అస్సలు అతకదు ఇంతకన్నా గొప్పగా చెప్పడానికి నాక్కొన్ని మాటలు కావాలిప్పుడు మనిషి కాదు పశువు మద మగ మృగం ఊ...హు! కీచకుడు దుశ్శాసనుడు ఐనా అసంపూర్ణమే "మో- షా"ల మొఖం గుమ్మాలమీద ఉమ్మేయడానికి జనం ముక్కోపం పదకోశంలో లేని మాటలు కావాలి తిట్ల దండకాల గ్రంథాలలో దొరకని మాటలు కావాలి అందుకే, నాక్కొన్ని మాటలు కావాలి గుజరాత్ నుండి కాశ్మీర్ మీదుగా ఇప్పుడు మణిపూర్ దాకా మంటలతో వచ్చాడు వాడు కొండకీ మైదానానికీ మధ్య చిచ్చు పచ్చగడ్డేసి రాజేసి మతం మంటల్తో చలిమంటలు కాగుతాడు వాడు నెట్
కవిత్వం

ఒకే పాదంతో నడుద్దాం రండి

నా ప్రశ్నల బాణం నీ మనోభావాన్ని గాయపరిస్తే నీ జవాబు ఈటెను నా మెదట్లో దించిపారేయ్ ఆలోచన అరుగు మీద ఇద్దరం పొట్లాడుకుందాం చర్చల బీళ్ళను సంఘర్షణల నాగళ్ళతో దున్నిపారేద్దాం కొత్తగా మొలకెత్తిన దారులగుండా ఒకే పాదంతో నడుద్దాం రండి మెట్ల కుల కట్టడాల్లో పై మెట్టు మినహా కింది మెట్లన్నీ మనవే మనువు నిన్నూ నన్నూ వైరి గుర్రాలను చేసి తన రథానికి కట్టుకొని రథయాత్ర చేస్తున్నాడు మిత్రమా రాయి రాయి రాజుకొని రగిలి వెలిగినప్పటినుండే కదా చరిత్ర ప్రారంభమైంది రండి మన మెదళ్ళను జ్ఞానం ఆకురాయి మీద సానపెడుదాం నువ్వు, చీకటి గర్భగుడిలో ఆలోచనలని శిలావిగ్రహాన్ని
సాహిత్యం కవిత్వం

నూతన మానవుడు

అస్తమించడమంటే రేపటి సూర్యోదయమే కదా అతడు అస్తమించాడు తుమృకోట తూర్పు గుమ్మంలో పొడిచి చిన ఆరుట్ల చిగురు కొమ్మల్లోంచి జాలువారి గుత్తికొండ నెత్తిమీద మొలిచిన సూర్యుడతడు శాంతి పావురంకు  ప్రజలంటే ఎంత పావురం విద్రోహ పొగమబ్బుల మధ్యనే శాంతి కపోత పతాకమెగిరేశాడు మంజీర సర్కారు జాగీరు మీద నిలబడి జన ఎజెండా జెండా నాటి ప్రజా ఆకాంక్ష వెల్లువల సద్దిమూట పట్టుకెళ్లాడు పంతులు కదాప్రపంచ గమనాన్ని తన వేకువ వెలుగు దారుల్లో చూపించి జనతన సర్కార్ రాస్తా మీదుగా జనాన్ని నడిపించాడు అతని కిరణాలు అరికాళ్ళు నాటిన అడుగుల నిండుగా జగిత్యాల జైత్రయాత్రలు...జంగల్ మహల్ రెపరెపలు... కన్నతల్లుల కడుపుకోత
కాలమ్స్

అతడు వెలిగించిన దారిలో…

“పూలు రాలిన చోట పుప్పొడి వెదజల్లబడే ఉంటుంది పుప్పొడి నెత్తురులోంచి పిడికిలి తేటగా తేరుకునే ఉంటుంది”             2016లో రామడుగు అమరత్వం నేపథ్యంలో రాసిన ఈ కవిత “పూలు రాలిన చోట” అనే నా రెండవ కవితా సంకలనం లోనిది.             కలం పిడికిలి పట్టుకొని కవిత్వం దారి గుండా ఇవాల్టి వరకు నడిసొచ్చాను. నడిచానా? నన్నెవరైనా నడిపించారా? అని నన్ను నేను ప్రశ్నిచుకొని కాస్త వెనుదిరిగి జ్ఞాపకాల రుచి చూస్తూ పోతే కొన్ని తీపిగా ఇంకొన్ని చేదుగా మరికొన్ని వగరుగా ఇలా ...             మాది వరంగల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. పేదకుటుంబం. ముగ్గురు అన్నదమ్ముల్లో