మావోయిస్టులపై నిషేధం ఎత్తివేతే ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సానుకూలత
పదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలన ముగిసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సాధనలో చోదకశక్తి అని , తెలంగాణ తెచ్చింది తామేనని టిఆర్ఎస్ నాయకత్వం తెలంగాణ సమాజాన్ని వంచన చేసింది. అనేక బలిదానాలు, త్యాగాలు , వర్గాల సమీకరణలో భాగంగా దశాబ్దం క్రితం తెలంగాణ సాకారమైంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణగా తమ వనరులు తమకు దక్కడమేగాక నూతన రాష్ట్రంలో తమ ఆకాంక్షలన్నీ నెరవేరాలని, ప్రజాస్వామిక భావనలు మరింత విస్తృతం కావాలని ప్రజలు ఆశించారు. తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి వాక్కు నిజం కావాలని