విద్యార్థులపై కాల్పులు జరపాల్సిందే.. మహిళలు అత్యాచారాల్నిఇష్టపడతారు.. అని మాట్లాడిన టి.జి. మోహన్‌దాస్‌పైచర్య తీసుకోవాలి
శ్రీ మోహన్ భగవత్ గారికి, శ్రీ దత్తాత్రేయ హోసబలే గారికి, ఈ ఆగస్టు 9న, ఎన్‌ఏపీఎంకు చెందినఆల్ ఇండియా ఫెమినిస్ట్ అలయన్స్ (ఏఎల్ఐఎఫ్ఏ)సభ్యులమైన మేము చారిత్రాత్మకక్విట్ ఇండియా ఉద్యమాన్నిస్మరించుకుంటున్నాము. లక్షలాది సామాన్య భారతీయులు నియంతృత్వ పాలనను సమష్టిగా తిరస్కరించి, తమభిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కునుచాటిచెప్పిన చారిత్రాత్మక సందర్భమది.ఇదే రోజున మేము ఈ లేఖను రాస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే కేవలం వలస పాలన నుంచి విముక్తి మాత్రమే కాదు; తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే పౌరులను—అందులో యువతను కూడా—నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నించేద్వేషపూరిత, హింసాత్మక భాష నుంచి కూడా విముక్తిఉండాలి. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య ఉద్యమాల్లో భాగస్వాములైన మహిళలు, ట్రాన్స్‌జెండర్










