సంపాదకీయం

మార్చి 31 తర్వాత..

... కూడా లోకం ఉంటుంది. దాని చరిత్ర ఉంటుంది. దాన్ని నిర్మించుకుంటూ మోసుకపోతున్న మహా మానవాళి చిరస్థాయిగా ఉంటుంది. మనుషులంటే పోటెత్తే భావోద్వేగాలు కదా.. అవీ ఉంటాయి. మనుషులంటే తీవ్రమైన ధిక్కార ప్రతిఘటనలు కదా.. అవీ పదిలంగా ఉంటాయి. మనుషులంటే స్వేచ్ఛాగానాలూ, విముక్తి ఆకాంక్షలూ, సుందర లోకాల స్వప్న రాగాలూ. అవీ వినిపిస్తూనే ఉంటాయి. కన్నీరూ, కఠినమైన ఆచరణా కలిసి రూపొందిన ఒక నిర్మాణం విధ్వంసమైందేగాని, దాని రక్తమాంస సంలీన చైతన్యం తుడిచిపెట్టుకపోయేది కాదు. మార్చి 31 తర్వాత కూడా మానవ సృజన కలాపమైన విప్లవం తిరిగి ఏదో ఒక మారుమూల లేచి నిలబడుతుంది. మరింత నాణ్యంగా, గంభీరంగా,
వ్యాసాలు

వనరుల కోసమేనా యుద్దం?

‘పెద్ద దేశాలు చిన్న దేశాల వనరులను దోచుకోవడానికి యుద్ధాలు చేస్తాయి అన్నాడు’ లెనిన్. ప్రస్తుతం జరిగే యుద్దానికి మూల కారణం వనరులేనా! అమెరికా ఇరాన్ దేశం మీద అనేక అపోహలు పెట్టి తమ ఆదేశాన్ని కాదనడం వల్ల ఆ దేశం ప్రపంచ దేశాలకు ముప్పు తెచ్చిపెడుతుందని ప్రపంచానికి చెప్పి యుద్దం పరోక్షంగా  మొదలుపెట్టింది. నిజానికి యుద్దం బహిరంగంగా ప్రకటించలేదు పిల్లి ఎలుక కోసం మాటు వేసినట్టు ఎప్పటి నుంచో ఖమేనిని మాటు పెట్టింది సిఐఏ. బాహ్య రూపంగా చర్చలు జరిపినట్టు నటించి ఇరాన్ ప్రభుత్వం అంగీకరించని విదంగా తమ ఉద్దేశలను తెలిపింది. ఫిబ్రవరి 28 న ఖమేని ఇతర
వ్యాసాలు

యుద్ధాగ్ని ప్రపంచ సంక్షోభం

ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న ప్రధాన యుద్ధాలు మరియు సంఘర్షణలు దేశాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్రంగా కుంగదీస్తున్నాయి. ఈ సంఘర్షణలు గ్లోబల్ ఎకానమీని, ఎనర్జీ మార్కెట్‌లను, ఫుడ్ సప్లై చైన్‌లను, షిప్పింగ్ రూట్‌లను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (2022 నుంచి కొనసాగుతోంది), ఇజ్రాయెల్-అమెరికా vs ఇరాన్ యుద్ధం (2026 ఫిబ్రవరి 28 నుంచి పూర్తి స్థాయి యుద్ధంగా మారింది), సూడాన్ అంతర్యుద్ధం, మయన్మార్ సివిల్ వార్, ఇతర చిన్న సంఘర్షణలు (యెమెన్, సొమాలియా, హైతీ, సాహెల్ రీజన్, ఇతర ఆఫ్రికా ఇన్‌సర్జెన్సీలు) కొనసాగుతున్నాయి. ఈ యుద్ధాలు మిడిల్ ఈస్ట్‌లో మల్టీ-ఫ్రంట్ వార్‌గా విస్తరించాయి, గ్లోబల్ ఆయిల్ సప్లై
కవిత్వం

పిల్లల ప్రాణాలే – యుద్ధం ఖరీదు

పాఠశాల గడియారం మోగాల్సిన వేళఆకాశం ఎందుకు అగ్నిగుండాల్ని కురిపించింది?పుస్తకాల మధ్య కూర్చున్న పిల్లలుఏ యుద్ధానికి శత్రువులయ్యారు?చిన్న చేతుల్లో పెన్సిల్ ఉండటంఎవరికి అంత ప్రమాదమైందీ?మీ యుద్ధాలకు సరిహద్దులు ఉంటాయంటారు,మ్యాప్‌ల మీద గీతలు గీస్తారు.అయితే చెప్పండిపిల్లల ఛాతీల మీద పడిన బాంబులుఏ సరిహద్దు దాటాయి?ఏ గెలుపు కోసం ఈ చిన్న ప్రాణాలు చెల్లించాయి?ఇప్పుడు ఆ నేల మీదబ్యాగులు పడి ఉన్నాయి, పుస్తకాలు పడి ఉన్నాయికానీ వాటిని మోసే చేతులు లేవుఅమ్మల అరుపులు మాత్రమే ఉన్నాయిమీ యుద్ధాల అసలు శబ్దం అదే కదా?దేశాలు గెలిచామని గొప్పలు చెప్పుకోండి,జెండాలు ఎగరేయండి, ప్రసంగాలు చేయండి.కానీ చరిత్ర మాత్రం ఇలా రాస్తుందిమీ విజయాల పునాదిపిల్లల సమాధుల మీదే
కవిత్వం

పాలకులు

పాలకులు శాంతికాముకులు యుద్ధంలో సంధి కోసం స్కూల్ పిల్లల శవాలకు చుట్టిన తెల్లటి వస్త్రాన్నిశాంతి కేతనంలా ఎగరేస్తారు పాలకులు మానవతావాదులుప్రపంచ ప్రజల మనసుల్లో మానవత్వాన్ని వెలిగించటం కోసం మనుషుల శవాలకు నిప్పంటిస్తారు పాలకులు నిర్మాతలు వందేళ్ల నిర్మాణాలన్నీటినిపునాదుల నుండి కూల్చేసి అందమైన శూన్యాన్ని నిర్మిస్తారు పాలకులు దయార్ద్ర హృదయులు పాల కోసం ఏడుస్తున్న పిల్లాడి నోటికి తండ్రి గుండె తెగి కారుతున్న రక్తాన్ని తాగమని డబ్బాలో నింపిస్తారు ఆకలని అరుస్తున్న చిన్నారి చేతికి అమ్మ శరీరం నుండి తెగిపడిన మాంసాన్ని తినమని అన్నం ముద్దలా అందిస్తారు రెండు నిమిషాలు మౌనం పాటించి స్కూల్ అసెంబ్లీలో ప్రార్ధన గీతంలాపిల్లల చావు
కవిత్వం

నా నేల నిమ్మలంగుంటే బాగుండు…

నా నేలమీద చావుల సాగు చేస్తున్నరు...కత్తులతో దున్ని శవాల విత్తులేస్తున్నరు...వేళకి నెత్తుటి వాన మస్తు కురుస్తుంది...పైరుకి బాంబుల ఎరువులు చల్లుతున్నరు...అయినా ఏ మొక్కై మొలవాల్నో తెల్వక విత్తులు భూమి పొత్తిళ్ళలోనే దాక్కున్నయ్...కుప్పలు తెప్పలుగా విత్తులు పోగైతనే ఉన్నయ్...నెత్తుటి వాన కుండపోతగా కురుస్తనే ఉంది... కన్నీటి కాలువల కన్న బిడ్డల శవాలనేరుకుంటున్నరు కొందరు...నెత్తుటి వాసనని అత్తరు వాసనలా అస్వాదిస్తున్నరు కొందరు...ఎవడి గెలుపోటముల కోసమో ఈ ఆటలు...గెలిచాకా ఎవడు జరుపుకుంటరో ఆ గెలుపు సంబరాలు....ఏ దిక్కుమాలిన దేహంలో పుట్టిందో ఈ నీతిమాలిన సాగు చేయాలనే ఆలోచన...ఆ ఆలోచనని ఎవరు బొందపెడుతరో...ఆ ఆలోచన పుట్టిన దేహం ఎప్పుడు దహనమైతదో...ఆ విత్తులకి శక్తులొచ్చి చావుల
కవిత్వం

తప్పుడు గుర్తింపు

అవును! వాళ్లు మమ్మల్ని చంపగలరు అవున‌వును !వాళ్లు బొగ్గు గనుల కార్మికులను చంపగలరు! తాపీ మేస్త్రిలని, రైతులని కూలి వాళ్ళని, కోతలు కోసే రైతు కూలీలనుపండ్లమ్మే వాళ్ళను చంపేయగలరు !అవును వాళ్లు అట్లానే చంపగలరు! లేకపోతే 14 లేదా 41, 20 లేదా 22 నంబర్లుగా మారిపోయిన లక్షల మందినివాళ్ళ స్వంత పేర్లు ఉన్న వాళ్ళని చంపేయగలరు! లేదా గుర్తింపు పొందని లెక్కలేనన్ని శవాలను ,30 సెకండ్ల కోసం ఫ్లాష్ లైట్ లో పడి వెలిగిపోయే పేర్లను, ఆగ్రహోదగ్ధ నిరసనల ప్రదర్శనల మధ్య క్షణాల్లో మాయమయ్యే వాళ్ళని వాళ్ళు చంపెయ్య గలరు! వాళ్ళందర్నీ శాశ్వత విషాదంలోకి నెట్టగలరు! వాళ్ళని
వ్యాసాలు

2025లో రికార్డు స్థాయిలో జర్నలిస్టుల మరణాలు: బాధ్యత ఇజ్రాయెల్దే

2024-2025 సంవత్సరాలలో జరిగిన జర్నలిస్టుల హత్యలలో మూడింట రెండు వంతుల బాధ్యత ఇజ్రాయెల్ మీద ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌లో జర్నలిస్టులు ప్రేవెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ -2016 (పిఇసిఎ) కింద వేరే రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టుస్ (పిఎఫ్యుజె) సెక్రటరీ జనరల్ అర్షద్ అన్సారి మాట్లాడుతూ, 2025 సవరణ తర్వాత పిఇసిఎ కింద 500 మందికి పైగా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. న్యాయపరమైన కేసులు, అరెస్టులు, బెదిరింపులతో సహా జర్నలిస్టులపై పెరుగుతున్న ఒత్తిడితో పాకిస్తాన్ పోరాడుతున్నప్పుడు, జర్నలిస్టులను రక్షించే కమిటీ (సిపిజె) రూపొందించిన కొత్త ప్రపంచ నివేదిక- 2025 ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా
సంభాషణ

పోలీసుల స్వేచ్ఛను బలపరచే తీర్పు: అబ్దుల్ వాహిద్ షేక్ అనుభ‌వం

అన్యాయమైన జైలు శిక్ష కారణంగా కోల్పోయిన సంవత్సరాలతరబడి  భారమైన నిశ్శబ్దాన్ని అబ్దుల్ వాహిద్ షేక్ అనుభవించారు. ముంబైకి చెందిన మాజీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైన షేక్, 2006 ముంబై లోకల్ ట్రైన్ పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొన్న 13 మందిలో ఒకరు. ఆయన తొమ్మిదేళ్లపాటు హై-సెక్యూరిటీ జైలులో గడిపారు. 2015లో ఆరోపణలు అన్నీ తప్పుడువని తేలి, నిర్దోషిగా విడుదలైన మొదటి వ్యక్తి ఆయనే. పదేళ్ల తర్వాత మిగిలిన 12 మంది కూడా నిర్దోషులుగా విడుదలయ్యారు. విడుదలైనప్పటి నుండి, అబ్దుల్ వాహిద్ షేక్ తన అనుభవాన్ని న్యాయపోరాటంగా మార్చుకున్నారు. ఉర్దూలో 'జైలు సాహిత్యం'  పైన పిహెచ్‌డి పూర్తి చేసి, అన్యాయంగా