ఈ తరం జమీల్యా
నన్ను కట్టిపడేసి ఓ చోట కూర్చోబెట్టి ప్రేమగా నాకోసం ఓ పాట పాడి, నేను దాటొచ్చిన ప్రేమ కధ చెప్పి ఏడిపించి కళ్ళు తుడుచుకునేలోపే మాయమైంది. ఇప్పుడు ఆమె నా ప్రేయసి. జమిల్యా అతి త్వరగా అతి తీవ్రంగా అతిగా నేను ప్రేమించిన తక్కువ పాత్రల్లో జమీల్యా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం నేను ప్రేమించిన నా ప్రియురాలు రాజేశ్వరిని మళ్ళీ చూసినట్టుంది. ఒక చిన్న పెయింటింగ్ చెప్పే కథ. అది గీసిన కుర్రాడి ప్రేమకథ. తన వదిన ప్రేమకథ. ఓ గాయపడిన ఒంటరి సైనికుడి కథ. చాలా మామూలుగా మొదట్లో వేసిన చిత్రం చూడడానికి ఎలా ఉన్నా,