సందిగ్ధత విప్లవానికి దారి చూపుతుందా?
ప్రముఖ కవి విమల సారంగ అంతర్జాల పత్రికలో రాసిన కొత్త కవిత ‘కాల యవనికపై నిలిచి..’ ఈ కాలపు విషాదాన్ని గాఢంగా పలికింది. వేలాది, లక్షలాది మంది దు:ఖాన్ని ఆమె తన గొంతులో వినిపించారు. కవిగా విమల లోతైన చూపే ఆమె కవితా శిల్పం. అందులో తీవ్రమైన దు:ఖం, ఆర్తి ఉంటాయి. ఒక రకమైన అంతర్ దృష్టి ఉంటుంది. చాలా బరువైన, తాదాత్మ్య భావనలతో ఆమె కవిత్వాన్ని నిర్మిస్తారు. తాను ఏమనుకుంటున్నదీ సూటిగా చెప్పేస్తారు. తన వ్యక్తిత్వంలోంచి తన వైఖరులను కవిత్వం చేస్తారు. వస్తువు, దృక్పథం ప్రధానమైన కవిత్వంలో శిల్పం ఎలా ఉంటుందో విమలలో చూడవచ్చు. అది చాలా