విశ్లేషణ

కూలీకి కులం – రాయ‌ల‌సీమ ప‌ల్లెల్లో ప‌నికీ వివ‌క్షే

రాయలసీమ అంటే కరువు, వలసలు, వ్యవసాయ సంక్షోభం మాత్రమే కాదు. సామాజిక అసమానతలపై జ‌రిగిన‌ పోరాటాలకు కూడా సుదీర్ఘ చరిత్ర ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన వామపక్ష, విప్లవోద్యమాలు, దళిత, బహుజన ఉద్యమాలు, రైతు-కూలీ పోరాటాల ప్రభావం ఉంది. వీటి వల్ల ఒకప్పుడు బహిరంగంగా కనిపించిన కుల వివక్షలో చాలా మార్పులు వ‌చ్చాయి. కానీ అవే కొత్త రూపాలలో నేడు సమాజాన్ని వెంటాడుతున్నాయి. కులం అంతరించిపోయింద‌నీ, సామాజిక సంబంధాల్లో, ఉత్ప‌త్తి సంబంధాల్లో కులం లేద‌ని వాదించేవారు చాలా మంది ఉన్నారు. కులంతో స‌హా మొత్తంగా గ్రామీణ ఉత్ప‌త్తి సంబంధాలు చాలా మారాయి. అందులోనూ
విశ్లేషణ

వంశగర్వం వెనుక దాగిన మర్మాన్ని ఆవిష్కరించే ‘రావు బహదూర్’

అనగనగా ఒక రాజు. పేరు రామప్ప రావు బహదూర్. రాజు నివసించే ఒక పెద్ద రాజభవనం. భారీ పాత రాజభవనం/ఎస్టేట్ పేరు “భువనాలయం”. గోడల నిండా పూర్వీకుల చిత్రాలు. ప్రతి చిత్రంలోనూ ఒకే గర్వం.ఒకే చూపు. ఒకే వంశం. ఆ చిత్రాల మధ్యలో ఒక మనిషి- ఒక పిల్లవాడు మాత్రం అతకనట్టు ఏడుపు మొహం వేసుకుని ఉంటాడు. అక్కడ ఇమడలేనట్టు బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేసినా అతడిని రాజప్రాసాదం వేర్లు లాగి పట్టి తిరిగి గోడలలోని ఫోటో ఫ్రేమ్ లో బిగించేస్తాయి. రామప్ప నివాసం ఉండేది ఒక విశాలమైన పూర్వీకుల భవనం. (sprawling ancestral mansion/estate). భువనాలయంలో ఒక
విశ్లేషణ

విచారణ కోరుతూ.. ఏకాంత నిర్బంధాన్ని నిరసిస్తూ.. పోరాటంలో ఇద్దరు ఖైదీలు

తెలంగాణ రాష్ట్రంలోని చెర్లపల్లి జైలు నుండి చంచల్‌గూడ జైలుకు బదిలీ చేసిన ఒక రాజకీయ ఖైదీ, పగటిపూట తన జైలు గది (సెల్) బయట గడిపే కనీస హక్కు — కాస్సేపు ఎండలో నిలబడే — అలాగే ఖైదీలకు చట్టపరంగా కల్పించిన హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తొమ్మిది రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టాడు. అదే సమయంలో, ఒడిశాలో ఉన్న మరో రాజకీయ ఖైదీ సుప్రీంకోర్టు సత్వర పరిష్కారం జరపమని ఆదేశమిచ్చినప్పటికీ తన కేసుల పరిష్కరణలో జరుగుతున్న జాప్యాన్ని గురించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాడు. ఆసుపత్రి మంచం మీద నుంచే ఇరవై రోజులపాటు నిరాహార దీక్ష
విశ్లేషణ

తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అంటే శాశ్వత విరమణే

ఈ సంవత్సరం మార్చ్ నెల నుండి – అంటే మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సుముఖత వ్యక్తం చేసినప్పటి నుండి దేశంలో ప్రజాస్వామిక వాదులు, విప్లవ సానుభూతిపరులు, మేధావులు ఈ విషయంలో చర్చలు చేస్తున్నారు. కొన్ని పార్లమెంటరీ రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంపై తమ వైఖరిని ప్రకటించి ఉన్నాయి. ఎన్నో ప్రజాసంఘాలు, విప్లవ పార్టీలు, వామపక్ష పార్టీలు కూడా శాంతి చర్చలను జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు, సభలు నిర్వహించాయి. ముఖ్యంగా తెలంగాణ, పంజాబ్, తమిళ్ నాడు లలో ఇవి పెద్ద ఎత్తున జరిగాయి. ఈ సందర్భంగా ఒక్కొక్క ఘటనలో పది, ఇరవై,
విశ్లేషణ

కళింగ దళిత వర్తమానం ‘గొడిముక్క’ ప్రాసంగికత

కళింగనేల మీద దళితచైతన్యంలోంచి వచ్చిన కవిత్వం తక్కువ. గరిమెళ్ళ సత్యన్నారాయణ,శిల్లా రాజులరెడ్డి, తిమోతి జ్ఞానానందకవి, వంగపండు ప్రసాదరావు మొదలైన కవులు వాళ్లదైన భూమిక నుంచి దళిత కవిత్వం రాయడం జరిగింది. 1990-2000కు అటుఇటు తెలుగు నేల మీద జరిగిన దళితోద్యమాల వెల్లువ కళింగాంధ్ర సాహితీకారుల మీద పడాల్సినంతగా పడకపోవడానికిఒక కారణం- ప్రపంచీకరణ వలన తలెత్తిన వ్యవసాయ సంక్షోభాన్ని కళింగాంధ్ర రచయితలు కవిత ద్వారా, కథ ద్వారా చెప్పే పనిలో నిమగ్నమై వుండటం, రెండో కారణం- దళిత నేపథ్యం నుంచి బలమైన సృజనకారులు రాకపోవడం. అందుకు సామాజిక అంతరాల నిచ్చెనమెట్ల వ్యవస్థ ప్రధాన కారణంగావుంది. కళింగాంధ్ర సాహిత్యానికి ఒక చారిత్రక
విశ్లేషణ

స్పష్టత కొరవడిన‘శతర’

‘శతర’ ఆదివాసీ కవిత్వం పేరుతో కళింగాంధ్ర కవి సిరికి స్వామినాయుడు అతని కొత్త కవిత్వసంపుటిని ప్రకటించాడు. ఈ సంపుటిలోకి అతని తొలి రెండు సంపుటాలు 'మంటిదివ్వ', 'మట్టి రంగు బొమ్మలు' నుంచితీసుకున్న ఆదివాసీ నేపథ్య కవితలనూ చేర్చాడు. మొత్తానికి ఈ సంపుటి ఆదివాసీ జీవితాన్ని-జీవన సౌందర్యాన్ని-సాంస్కృతిక విశేషాలను,ఆదివాసీ జీవిత కుదుపులను-ఆ కుదుపులకు కారణమైన ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలను అతనికున్నచైతన్యపరిధిలో అతను రాయడం జరిగింది. ఆదివాసీలు పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను చెప్పే కవితలనూ స్వామినాయుడు రాయడం మెచ్చదగినది. ఏ కవికైనా కొన్ని పరిధులుంటాయి. ఆ పరిధులు మూలంగానో లేదా ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనకి తక్షణం
విశ్లేషణ

సందిగ్ధత విప్లవానికి దారి చూపుతుందా?

ప్రముఖ కవి విమల సారంగ అంతర్జాల పత్రికలో రాసిన కొత్త కవిత ‘కాల యవనికపై నిలిచి..’ ఈ కాలపు విషాదాన్ని గాఢంగా పలికింది. వేలాది, లక్షలాది మంది దు:ఖాన్ని ఆమె తన గొంతులో వినిపించారు. కవిగా విమల లోతైన చూపే ఆమె కవితా శిల్పం. అందులో తీవ్రమైన దు:ఖం, ఆర్తి ఉంటాయి. ఒక రకమైన అంతర్‌ దృష్టి ఉంటుంది. చాలా బరువైన, తాదాత్మ్య భావనలతో ఆమె కవిత్వాన్ని నిర్మిస్తారు. తాను ఏమనుకుంటున్నదీ సూటిగా చెప్పేస్తారు. తన వ్యక్తిత్వంలోంచి తన వైఖరులను కవిత్వం చేస్తారు. వస్తువు, దృక్పథం ప్రధానమైన కవిత్వంలో శిల్పం ఎలా ఉంటుందో విమలలో చూడవచ్చు. అది చాలా
విశ్లేషణ

సామ్రాజ్యవాద వైరుధ్యాలలో కొత్త సమస్యలు,ఉద్రిక్తతలను తెచ్చే ట్రంప్ ప్రతిపాదనలు

 యుద్ధ నిబంధనలను మార్చడం ద్వారా ఉక్రెయిన్ లో నెలకొన్న ప్రతిష్టంభనను అధిగమించాలని అమెరికా ఆరాటం             1. గత మూడు దశాబ్దాలుగా అబివృద్ధి చెంది, రూపు దిద్దుకున్న అమెరికా సామ్రాజ్యవాదం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల గురించి (రెండవసారి అధికారం చేపట్టిన) ట్రంప్ పరిపాలనా వ్యవస్థ స్పందించింది. అదిప్పుడు సాపేక్షికంగా తిరోగమించాల్సి రావడమేకాక, దాని ప్రత్యర్థులు(రష్యా, చైనా) దగ్గరై. తన ప్రపంచాధిపత్యాన్ని సవాలు చేసేవిగా తయారయ్యారు. ఈ మౌలిక సమస్యలు ఏమంత దూరంగా లేవని భావించిన ట్రంప్ పరిపాలనా వ్యవస్థ వీటి పైన దృష్టి సారించింది. ఈ పరిణామాలు అమెరికాకు ప్రకంపనలు సృష్టించడమే కాకుండా, అవి ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికాకు తన 
విశ్లేషణ కాలమ్స్

బస్తరును కాపాడుకుందాం

ప్రొఫెసర్‌ సాయిబాబా రాజ్య వ్యవస్థీకృత హింస, నిర్బంధం కారణంగా అమరుడైన సందర్భంగా గత అక్టోబర్‌ నుంచి విజయవాడ బుక్‌ ఫెయిర్‌ (జనవరి మొదటి వారం) దాకా కవులు, రచయితలు బుద్ధిజీవుల్లో ఊహించిన దానికన్నా ఎక్కువగా స్పందన వచ్చింది. ఒక నెల కూడా గడవకుండా ఫిబ్రవరి 8, 9 తేదీల్లో సాయిబాబా అమరత్వం సందర్భంలో సంక్షోభ కాలంలో సాహిత్యం భూమిక’ గురించి విరసం ఏర్పాటు చేసిన రెండు రోజుల సాహిత్య పాఠశాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు. అందులో యువత ఎక్కువగా పాల్గొన్నారు. ఈ సాహిత్య పాఠశాలను ప్రారంభిస్తూ సాయి సహచరి వసంత
విశ్లేషణ

త్యాగాల తల్లుల పేగుబంధాలు.. వియ్యుక్క కథలు

వియ్యుక్క కథలు 6 సంపుటాలు నా చేతికందినప్పటి నుంచీ 6 పుస్తకాలు చదివి వివరంగా సమీక్ష గానీ, వ్యాసం గానీ రాయాలనుకుంటూనే ఉన్నాను.  పుస్తకం వచ్చిన వెంటనే వస్తే ఉన్నంత తాజాదనం ఉండదేమో అనే ఆలోచన వల్ల ఇప్పటికి ‘‘అమ్మతనం’’ కి సంబంధించిన 8 కథలను ప్రత్యేకంగా పరిశీలించే పనికి పూనుకున్నాను. ఇక విషయంలోకి వస్తే ‘‘అమ్మతనం’’ పూర్వకాలంలో లేదా సాంప్రదాయంలో మాతృత్వం అనే మాటకు సరిపోల్చదగిన మాట. కానీ మనం అమ్మతనం అని అనుకోవడంలోనే సహజత్వం వ్యావహారికం ఉన్నాయని నా భావన. ఇప్పుడు కథల గురించి తెలుసుకుందాం. ‘‘పిల్లలు’’ అనే కథ తాయమ్మ కరుణ రాసింది. సుమ,