ఆర్థికం

ఆందోళనకరంగా ఆర్థిక వ్యవస్థ

ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌(ఎఫ్‌ఇ) నివేదిక ప్రకారం దేశంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమౌతోంది. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం, రూపాయి విలువ జీవనకాల కనిష్టానికి క్షీణత, విదేశీ మారక నిల్వలు కరిగిపోతున్నాయి, స్టాక్‌ మార్కెట్ల నష్టాల్లోకి జారుకుంటున్నాయి. గ్యాస్‌, డిజిల్‌, పెట్రోల్‌ రేట్లు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. నిరుద్యోగం పెరిగిపోతోంది, ఆహార పదార్థాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. భారత జనాభాలో యువత 50 శాతం వరకు ఉంది. వారి నైపుణ్యానికి తగిన ఉపాధి లేకపోవడంతో ఉత్పాదక శక్తి పుంజుకోవడం లేదని, పర్యవసానంగా  పారిశ్రామిక వృద్ధి కుంటుపడుతుందని, ఇందుకు పాలకుల అనుచిత విధానాలే కారణమని ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ స్పష్టం చేసింది. గత సంవత్సర
ఆర్థికం

అదానీకి చట్టాలు వర్తించవా ?

గత రెండు దశాబ్ధాలుగా, బొగ్గు  సంబంధిత అవినీతి కథనాలను భారతదేశం చూసింది. 2014లో యుపిఎ-2 ప్రభుత్వం పతనం కావడానికి, బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం బొగ్గు గనుల కుంభకోణం. ఇప్పుడు మోడీ ప్రభుత్వ హయాంలో మరో బొగ్గు కుంభకోణం బయట పడింది . మోడీకి అత్యంత నమ్మకస్తుడైన గౌతమ్‌ అదానీ దిగుమతి చేసుకున్న విదేశీ బొగ్గు ధరను అత్యంత ఎక్కువగా చూపించి వేలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన కథనాన్ని లండన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక దినపత్రిక పైనాన్షియల్‌ టైమ్స్‌ ‘ద మిస్టరీ ఆఫ్‌ అదానీ బొగ్గు దిగుమతుల విలువ నిశబ్దంగా రెట్టింపు అవుతోంది’ అనే శీర్షికతో
ఆర్థికం

కార్పొరేట్‌ సేవలో మోడీ ప్రభుత్వం

కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న పాలకుల ప్రగల్భాలు నిజం కాదని తేలిపోయింది. ఏ రంగంలో చూసిన ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మన పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్‌, భూటాన్‌లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. మనదేశ ఆర్థిక వ్యవస్థ కూడ పతనం దిశగా వేగంగా దిగజారుతున్న పరిస్థితుల్లో భవిష్యత్తు పట్ల ప్రజల్లో భయాలు పెరిగిపోతున్నాయి. ఎనిమిది సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్‌ రంగానికి ఏకపక్షంగా అంకితమై సేవలందిస్తున్నది. ''బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ప్రభుత్వమైన పెట్టుబడిదారుల పనులను చక్కబెట్టే కార్యనిర్వాహక కమిటి'' అని మార్క్స్‌ 1850 థకంలోనే తెలపాడు. అధికార బదిలీ జరిగి ఏడున్నర
ఆర్థికం

కార్పొరేట్ల గుప్పిట్లోకి బ్యాంకులు

గత కొంత కాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను కారు చౌకగా అస్మదీయులైన బడా బాబులకు కిళ్లీలుగా చుట్టి నోటికి అందించడం ఈ ప్రభుత్వ విధానం. మోడీ 2014లో అధికారంలోకి రాగానే కాన్పెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్టీస్‌ (సిఐఐ) ప్రభుత్వం ముందుంచిన చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌లో బ్యాంకింగ్‌ రంగం ప్రైవేటీకరణ ప్రధానాంశంగా ఉంది. ఇప్పటికే లక్షల కోట్ల కార్పొరేట్ల రుణ బకాయిలను మాఫి చేసిన మోడీ ప్రభుత్వం, వాటి దాహర్తిని తీర్చడం కోసం ఇప్పుడు ఏకంగా ప్రభుత్వరంగ బ్యాంకులనే అప్పగించేందుకు సిద్దమైంది. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌
కాలమ్స్ ఆర్థికం

అవినీతి, దోపిడీల‌ను పెంచే క్రోనీ క్యాపిటలిజం

ఊసరవెల్లి రంగులు మార్చుకున్నట్లు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కూడ అనేక రూపాలలో కొనసాగుతుంది. అందులో ఒకటి క్రోనీ క్యాపిటలిజం. (ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం) అని మనం పిలుస్తున్నాం. ఆసియా టైగర్‌గా పిలువబడే నాలుగు దేశాలు దక్షిణ కొరియా, తైవాన్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ దేశాలు వేగంగా పారిశ్రామికీకరణ చెంది 1960-96 వరకు సంవత్సరానికి 7 శాతానికి పైగా ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించాయి. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐయంఎఫ్‌) సంస్థలు ఆ దేశాల అభివృద్ధి తీరును బాగా శ్లాఘించాయి. అయితే 1997లో ఆసియా టైగర్‌ దేశాల ద్రవ్యవ్యవస్థ ఒకేసారి కుప్పకూలింది. అయితే ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లు ఆసియా టైగర్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు