లెక్కల్లో ఉపాధి మాయాజాలం
దేశంలో నిరుద్యోగం తగ్గుతోందంటూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గణాంకాలను ప్రచారం చేసుకుంటు న్నది. ఆ సంఖ్యల వెనుక భారత కార్మిక మార్కెట్ అసలు వాస్తవం కనిపించకుండాపోయే ప్రమాదం కనిపిస్తున్నది. వారంలో ఏడు రోజుల ఉపాధి పరిస్థితిని ఆధారంగా తీసుకొని నిరుద్యోగాన్ని కొలిచే విధానం ఉద్యోగం దొరికిందా లేదా అన్నదే చెబుతుంది తప్ప, ఆ పని ఎంత కాలం ఉంటుంది? ఎంత వేతనం వస్తుంది ? క్రమం తప్పకుండా జీతం అందుతుందా? ఆ ఉద్యోగం జీవన భద్రత కల్పిస్తుందా ? వంటి కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు. అసంఘటిత రంగమే ఆధారంగా కోట్లాది మంది బతుకుతున్న భారత్ లో










