రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి
రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి ధర్నా, 29 ఆగస్ట్, ఇందిరా పార్క్ వద్ద, హైదరాబాద్. ఉదయం 10 గం. నుండి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా ! ప్రభుత్వాలు ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రాజ్యాంగం కల్పించిన సంక్షేమ విధానాలను విస్మరిస్తూ, కొనసాగిస్తున్న పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తారు. ఈ క్రమంలో మన దేశంలో ఐదు-ఆరు దశాబ్దాలుగా ప్రజల జీవించే హక్కు, జీవనోపాధి హక్కుల కోసం బలమైన పోరాటాలకు ప్రధానంగా అడవులు, అడవి చుట్టూ ఉన్న మైదాన ప్రాంతాలు కేంద్రంగా మారాయి. నిర్దిష్ట రాజకీయ దృక్పథంతోనే ఆ ఉద్యమాలు కొనసాగాయి. లక్షలాది ఆదివాసీలు ‘జల్, జంగల్, జమీన్, ఆత్మ










