పత్రికా ప్రకటనలు

ATHENS: Solidarity panel for Professor Saibaba and the political prisoners in India

A panel concerning the political prisonersin India, event that dozens of people participated, was held by Bookstore-Cafe "Ektos ton Teichon" in Athens. The speakers of the event, described the chronicle of persecutions, of the disabled Professor GN Shaibaba, within the framework of the prefecture of "antiterrorist" law UAPA. The panel tried to indicate the general context within which operation "Green Hunt" takes place and the fierce oppression of left and revolutionary voices
వ్యాసాలు


చట్ట బద్ధ పాలన అడిగినందుకే సాయన్న జైలుపాలు

కొల్లూరి సాయన్న ... ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సుందరగిరి గ్రామంలో దళిత రైతు కుటుంబం లో పుట్టాడు. న్యాయశాస్త్ర విద్యార్ధిగా విద్యా రంగ సమస్యలపై పని చేశాడు. చదువుకున్న చదువుకు సార్ధకత చేకూరేలా, తెలంగాణా గ్రామీణ ప్రజల కోసం, ముఖ్యంగా రైతుల కోసం , ఆదివాసీ ప్రజల కోసం పని చేయాలని ఐదేళ్ల క్రితం నిర్ణయించుకుని పని ప్రారంభించాడు. అత్యంత నిజాయితీ, నిబద్ధత కలిగిన కార్యకర్త సాయన్న. నిత్య అధ్యయనంతో వ్యవసాయ రంగ సమస్యలపై అవగాహన పెంచుకుని వివిధ జిల్లాలకు తన పనిని విస్తరించుకుని తెలంగాణా రైతాంగ సమితి నాయకుడుగా ఎదిగాడు. ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షులుగా,
సాహిత్యం కవిత్వం

అలల కెరటాలు

అనంత విశ్వాన్ని నిబ్బరంగా చూస్తానుఅంతా అర్థం అయినట్టే కట్టిపడేస్తుందిజీవితం కూడా. ఆకర్షణ తో కట్టుబడ్డట్టుముడిపడటాలు చెదిరిపోవటాలు చూస్తాం. కాలం పైన చిరు నవ్వు తాకికాసేపు చేసే కాలక్షేపం చూస్తాం. మరుక్షణంగాలికి కాలం ఊగిపెట్టే కన్నీటిని చూస్తాం. మురిసిపోయే లోపేతుపాను ముసిరినట్లుఅంతలోనేస్వచ్ఛం గా దృశ్యాలుగా చెక్కబడుతున్నట్లుఅనుభవాలు కుదుపుతుంటాయి . తీరం వైపు కళ్ళను పరచిఅలల కెరటాలను చూస్తాను.సంతోషాలు దుఃఖాలు పోటీపడిఊగిపోతుంటాయి. అయినానిశ్చలంగా సముద్రం వైపు చూస్తూప్రశాంతతను పల్లవిస్తాను.
సాహిత్యం కవిత్వం

భానుడి చూపు

ఎవరు రాసారీ పద్యాన్ని,ఉద్యమంలాంటి ఉదయాన్ని?!వెలుతురు లాంటి నినాదాన్ని?!చీకటికి తెర దించి కాంతికి పట్టం కట్టినపదాల కెరటాల కవన సముద్రాన్ని!? ఎవరు రాసారీ పద్యాన్నిదువాల ఒడిలోంచి నిదుర లేచినజాబిల్లి తోబుట్టువుని!?తిమిరం కుబుసాన్ని విడిచితళతళాడుతూ తెల్లారిన కాలాన్ని!? ఎవరు రాస్తారు వెన్నెల సిరా నిండినగాలి కలంతోకొండలపై నుంచి జారే నిశ్శబ్దపు జలపాతాలని?! అరణ్యంలో తాండాలోతంగెడు పూల పురుడు వాసననిపీల్చుకుని మత్తగిల్లే మధువుకు ప్రియమైన భ్రమరాలనీ!? ఎవరు రాస్తారు పద్యాలనీప్రాణ త్యాగానికి సిధ్ధపడితుపాకీ భుజాన వేలాడదీసుకొనిఅరణ్యం మీంచి లోకం మీదికివిప్లవం ప్రసరిస్తున్న భానుడి చూపుని!?
లోచూపు

స్వచ్ఛ భారత్లో స్వచ్ఛత ఎక్కడ’?

మన ఇంటికి గోడలు ఎంత అవసరమో కిటికీలు, దర్వాజలు అంతకంటే ఎక్కువ అవసరం. అవి లేకుండా మనం గోడల మధ్య బందీలమైతే మనను బైటి గాలులేవీ తాకవు. బయటి వెలుతురేదీ మనకు సోకదు. మన ఇంటి గోడల బయటి కైవారాలు సురక్షితంగా ఉన్నాయా, లేదా కూడా మనకు తెలియదు. కనుక మన ఇల్లు సురక్షితంగా ఉండాలంటే మనం గోడలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఇతర ఇళ్లకు చెందిన బయటి గోడలను పరిశీలించాల్సి ఉంటుంది. వివిధ ఇళ్ల గోడల మధ్యన ఉన్న రక్షక వ్యవస్థలను పరిరక్షించుకోవలసి ఉంటుంది. విధ్వంసక వ్యవస్థలను రూపుమాపుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఇలాగే మన స్వీయ అస్తిత్వాలను
ఆర్ధికం

భారత్‌ను ఆవరిస్తున్న ఆర్థిక మాంద్యం

అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో మనదేశ పరిస్థితి చూస్తే రూపాయి విలువ వెలవెలపోతూ… రికార్డు స్థాయి పతనాన్ని చవి చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చరిత్రలోనే ఇదివరకూ ఎప్పుడూ లేని స్థాయిలో రూపాయి పతనమయ్యింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపునకు తోడు పలు దేశీయ కారణాలతో సెప్టెంబర్‌ 27న రూపాయి విలువ 82కు పతనమయ్యింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెటులో డాలరుతో రూపాయి మారక విలువ అక్టోబర్‌ 19న ఏకంగా 79 పైసలు కోల్పోయింది. తొలిసారి రూపాయి మారకం విలువ 83.20కి క్షీణించింది. రూపాయి మారక విలువ చరిత్రలోనే ఇది అతిపెద్ద పతనం. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రూపాయి మారకం
కవిత్వం

ఇది‌ తల్లుల దేశం

ఆ తండ్రి పోరాట వారసత్వంఆమె ముని వేళ్ళ గుండావారి దేహమంతా ప్రవహిస్తూఈ దేశ భవిష్యత్ చిత్రపటాన్నిదేదీప్యమానంగా చిత్రిస్తోంది తను కన్నది వాళ్ళిద్దరినేవారు నిర్మించిందివేలాది విముక్తి సైన్యాన్ని బిడ్డల కోసంనెత్తుటి ధారలావర్షించిన తల్లి ప్రేమఒకవైపు నేల తల్లి విముక్తిసాధనలో వారున్నారన్నభరోసా మరోవైపుతనను నిటారుగానిబ్బరంగా నిలబెడుతూవచ్చాయి ఒకరు ఒరిగినాతనందించినజెండా ఎత్తుకున్నమరో బిడ్డచూపులకు కానరాకపోయినాఆ రెపరెపల వెచ్చని గాలితన నూరేళ్ళ శ్వాసయింది అమ్మలెప్పుడూ అంతెఒక కంట్లో సూరీణ్ణిమరో కంట వెన్నెలనీవిరబూయిస్తారు అమ్మలంతేతమ పచ్చని కొంగుతోదేశానికి తల్లులవుతారువీరుల‌ గొంతులోచనుబాలధారలవుతారు అమ్మలకు మరోమారునమస్కరిద్దాం (వీరమాత మల్లోజుల మధురమ్మకు వినమ్ర జోహార్లతో)
కవిత్వం

అమరుని తల్లి

ఇంతకీ…ఈ ఆపదను తట్టుకోమనే ఓదార్పు మాటలు చెప్పడానికి ఆ తల్లికి అక్కడ ఎవరూ లేరు.నీ సానుభూతంటావా.. ఆమెకి అవసరమే లేదు.నీ మాటలంటే ఆమెకి లెక్కే లేదు.అసలు ఆమె ఎవరనుకుంటున్నావు?ఆమె అమరుని తల్లి !ఒకటి,రెండు,మూడు,నాలుగు ,ఐదేసి చుక్కలు.. చుక్కలుగా కపటంతో రాలిపోయే నీ మొసలి కన్నీళ్లనే… ఆమె తన తెగువతో ఆశ్చర్య పరుస్తుంది..నిలవరిస్తుంది!మూగ ప్రేక్షకుల దొంగ సానుభూతి ఆమెకెందుకు ? కౄరంగా చంపబడిన తన కొడుకులు మిగిల్చిన ఖాళీని..నీ అల్పమైన సహనుభూతితో పూడ్చలేవు.కొడుకుల మరణ దుఃఖాన్ని గుక్కిళ్లు గా మింగెయ్యమని.. మౌనంగా ఉండమని ఆమెకి చెప్పే అర్హత నీకు లేదు గాక లేదు !ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా..?నీ