ఆదిలాబాద్ లో30 యాక్ట్ పోదా ?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2018 జనవరి నుండి 30 పోలీసు చట్టంను అమలుచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల గొంతు నొక్కుతున్నది. 30 పోలీసు ఆక్ట్ అనేది ఎమర్జెన్సీ పరిస్థితులను పోలిన చట్టం. జిల్లా సూపరింటెండెంట్ లేదా అసిస్టెంట్ డిస్ట్రిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ద్వారా ప్రతి నెల 1 నుంచి నెలాఖరు వరకు నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ నిబంధనలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలను చేపట్టాలంటే ముందస్తుగా డీఎస్పీ లేదా ఆపై అధికారుల నుంచి అనుమతి పొందాల్సిదే. నెల రోజుల