వ్యాసాలు

అప్పర్ భద్ర సరే.. రాయలసీమ ప్రాజెక్టుల మాటేమిటి ?

అప్పర్ భద్ర ప్రాజెక్ట్ పై నేడు ఆంద్రప్రదేశ్  ప్రభుత్వం, రాజకీయ పార్టీలు తెలియజేస్తున్న నిరసనలు “తానాడలేక మద్దెలవోడు అన్నట్లు” అనే  సామెతను గుర్తుకు తెస్తున్నాయి.  కె సి కాలువకు  కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకొనేoదుకై  గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి ప్రయత్నించకపోగా, 2015 లోనే దానికి వివరమైన ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్)ను ఆ నాటి కృష్ణా బోర్డ్ కు సమర్పించినా, డిపిఆర్ ఇవ్వలేదని కేంద్ర జల కమీషన్ కు తెలిపిన ప్రబుద్ధులు    మన అధికారులు. అంతేకాదు, ఎన్నికల ఎత్తుగడలో భాగంగానైనా 2019 మార్చి లో   గుండ్రేవులకు చంద్రబాబు నిధులు కేటాయించారు. అయితే రద్దుల జగనన్న దాన్ని తుంగలో తొక్కాడు. దానిపై  స్పoదించిన
కథలు

మిస్టర్ ఏ

విజయవంతమైన వ్యక్తి  జీవిత కథను మనం చదివినప్పుడు, వారు వారి జీవితంలోని సవాళ్లను ఎలా  అధిగమించారు అనే దాని గురించి మనకు చాలా అంతర్దృష్టిని అందిస్తుంది. ఈ పాఠాలు మన జీవితాలను నడపటానికి,  మన ప్రియమైనవారి కోసం మంచి భవిష్యత్తును ప్లాన్ చేయడంలోను  సహాయపడతాయి. నిజానికి మిస్టర్ ఏ  భారత ఆర్థిక వ్యవస్థ  ఆకాశంలో మెరిసే నక్షత్రం. మిస్టర్ ఏ, అంబానీల తర్వాత రెండవ సంపన్న కుటుంబం. కానీ ఇతర వ్యాపార దిగ్గజాల మాదిరిగా కాకుండా, మిస్టర్ ఏ తన తండ్రి నుండి అదృష్టాన్ని వారసత్వంగా పొందలేదు. బదులుగా, అతను తన విధిని మార్చడానికి చాలా కష్టపడ్డాడు. మిస్టర్ ఏ  విజయగాథను పరిశీలిస్తే,  అతని బలమైన
కవిత్వం

పలమనేరు బాలాజీ కవితలు మూడు

1. లేనప్పుడు " అప్పుడు గాలి చొరబడదు మాట నిర్మాణం కాదు మనిషి లేనప్పుడే ఉనికికి అర్థం, విలువ! అప్పుడు రాత్రి ఎంతకూ కదలదు రాత్రంతా.. వస్తువులు మాట్లాడుతుంటాయి మనిషి లేనప్పుడు వస్తువులు పుస్తకాలు బొమ్మలే మనుషులవుతాయి, మాటలవుతాయి. అప్పుడు ఏదీ కుదరగా ఉండదు ఎడబాటు తర్వాత సుదీర్ఘ తడబాటే! అప్పుడు పొలమారినట్టు , పొగ చూరినట్టు, మబ్బు కమ్మేసినట్టు కళ్ళ ముందరి వాళ్ళు కన్నీటి పొరలైనట్టు... అప్పుడు మాట్లాడనీ, పోట్లాడనీ అలగనీ, అదిరించనీ, బెదిరించనీ,భయపెట్టనీ.. నీ... నీ...నీ..... అప్పుడు లోకంగా,ప్రాణంగా,దేహంగా ఉండనీ... మనసుని, మనిషినీ, మనసైన మనిషినీ !! 2. కొత్తగా.. ప్రేమించే వాళ్ళు కాబట్టే -వాళ్ళట్లా
కవిత్వం

నా నగర మేదీ

** నా నగరం కోసం వెతుకుతున్నా.. ఎక్కడుందది ఎక్కడుండేదది జ్ఞాపకాలు మసక బారుతున్నాయ్ మస్తిస్కం మొద్దుబారి పోతున్నది అది గోద్రా మురికివాడల్లో ఉండే ది నర్మదా లోయలో తచ్చాడుతుండేది కాదు కాదు . అది హాశింపుర కాలువలో శవమై తేలి లోకాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది నెల్లి మారణకాండలో మౌనంగా దుఃఖించింది కాదు ,కాదు.. అది బస్తర్ మారణకాండలో కల్లోల కాలానికి సాక్షిగా నిలిచింది జీలం నది ఒడ్డున గాయాలతో సొమ్మసిల్లింది. అది కూచిబెదార్లో ఉండేది నంది గ్రామ్ లో ఉండేది జఫ్రాభాగ్, చాంద్బాగ్ ఎన్నని చెప్పను మర్చిపోతున్నా అలసిపోతున్నా నన్ను నేను నిలబెట్టుకోవడానికి నాతో నేను నిరంతరం
వ్యాసాలు

‘బస్తర్‌లో ఆదివాసీ మహిళలకు స్వేచ్ఛ లేదు’- సోనీ సోరీ

భారతదేశం మధ్య ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంతాలలో చాలా కాలంగా ఖనిజాల దోపిడీ విపరీతంగా జరుగుతోందని మనందరికీ తెలుసు. పెట్టుబడిదారులకు ఈ దోపిడీని సుసాధ్యం చేయడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతాలలో నివసించే ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఈ ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాయి. భారతదేశమంతటికన్నా అత్యధిక సంఖ్యలో అర్ధ సైనిక బలగాలు ఈ ప్రాంతాలలో ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో మోహరించిన ఈ సైనిక బలగాలు ప్రభుత్వ విధానం ప్రకారం ఆదివాసీల ధైర్యాన్ని దెబ్బతీయడానికి మహిళలపై లైంగిక దాడులు చేస్తాయి. బస్తర్‌లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్త సోనీ సోరీ కూడా స్వయంగా శారీరక రాజ్య హింసను భరించింది. మహిళా దినోత్సవం
సంపాదకీయం

ఫాసిస్టు వ్యతిరేక ప్రజాయుద్ధ సేనాని

స్టాలిన్‌ వ్యతిరేకతతో మొదలై కమ్యూనిస్టు వ్యతిరేకులుగా మారిపోయిన వాళ్లు చరిత్రలో కోకొల్లలు..’ అని చలసాని ప్రసాద్‌ డజన్ల పేర్లు ఉదహరించేవారు. ఇరవయ్యో శతాబ్దపు విప్లవాల్లో, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాల్లో స్టాలిన్‌ అంత జనామోద నాయకుడు లేరు. ఆయనలాగా విమర్శలు మోసినవాళ్లూ లేరు. బహుశా ఒక వెనుకబడిన పెట్టుబడిదారీ దేశంలో విప్లవోద్యమానికేగాక సోషలిస్టు నిర్మాణానికి కూడా నాయకత్వం వహించడం ఆయన ప్రత్యేకత. ఆ శతాబ్ది విప్లవాల ప్రత్యేకతల్లాగే ఆ కాలపు సోషలిస్టు నిర్మాణ ప్రత్యేకతలను కూడా పరిగణలోకి తీసుకొని చూడ్డానికి ఇప్పుడు చరిత్ర మనకు అవకాశం ఇచ్చింది. అందుకే ఇప్పటికీ విప్లవమన్నా, సోషలిజమన్నా స్టాలిన్‌ అజరామర పాత్ర మీద  అంతులేని
పత్రికా ప్రకటనలు

బైరి నరేష్‌ పై హిందుత్వ మూకల దాడి

నరేష్‌పై హిందుత్వ శక్తులు ఫిబ్రవరి 27న మరోసారి దాడికి పాల్పడ్డాయి. ఈసారి పోలీసుల సమక్షంలోనే  దాడి జరిగింది.   మనోభావాలు దెబ్బతిన్న భక్తుల మూక ఈ పని చేసిందా? లేక కేసీఆర్‌ ప్రభుత్వ అండతో చెలరేగిపోయి దాడికి దిగిందా? అనే ప్రశ్నలు చాల మామూలు వాళ్లకు కలిగేలా ఈ ఘటన జరిగింది. నరేష్‌ అభిప్రాయాలేవైనా సరే... అవి ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం. హేతుబద్ధ చర్చకు ఆస్కారం ఇవ్వదల్చుకోని వాళ్లే తరచూ మనోభావాల పేరుతో ఉన్మాద చర్యలకు పాల్పడుతుంటారు. ఇది ఫాసిస్టు లక్షణం. నరేష్‌పై దాడి వల్ల నాస్తిక, హేతువాడ, ప్రగతిశీల, విప్లవ శక్తులకు ఫాసిస్టు శక్తులు ఒక
పత్రికా ప్రకటనలు

వైద్య విద్యార్థి ప్రీతిబలవన్మరణానికి కారకులెవరు?

అసమానత, హింస, వివక్ష ఉన్న సమాజంలో జరిగే బలవన్మరణాలన్నీ సామాజిక హత్యలే. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజ్‌ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థి డాక్టర్‌ ప్రీతి ఫిబ్రవరి 22న బలవన్మరణానికి గురైంది. ఇది  మన సమాజ దుస్థితిని తెలియజేస్తోంది. స్త్రీలు  ఇంట్లో, సమాజంలో  ఆత్మగౌరవంతో జీవించడానికి  చాలా ఘర్షణ అనుభవించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఒక దశ దాటాక వారు ఆత్మహత్య వైపు నెట్టివేయబడుతున్నారు. మన సమాజం నాగరికంగా ఎదగలేదని చెప్పడానికి ప్రీతి బలవన్మరణం ఉదాహరణ.                 సమాజంలోలాగే ఉన్నత విద్యా రంగంలో  కూడా పితృస్వామ్య, ఆధిక్య భావజాలం కొనసాగే అవకాశం ఉంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించగల
సమీక్షలు

భీమా నది ఘోష 

నేను భీమా నదిని మాట్లాడుతున్నాను! అంటూ 1818 నుండి మొదలైన ప్రస్థానం ఇది. ‘‘చరిత్ర కన్నులోంచి దుఃఖపు చెమ్మనై చిప్పిల్లుతున్నాను మూగబోయిన అలల తీగలపై పురిటి బిడ్డల తొలి ఏడుపునై పెల్లుబుకుతున్నాను..’’ అనే దగ్గరి నుంచి ‘‘అంటరాని కళేబరాన్నై పైకి లేచే దాకా’’, ‘‘రష్యా సేనల పైకి ఉక్రెయిన్లో’’ అంటూ వర్తమానం దాకా! సాగుతుంది.             ‘‘అగాధాల్లో పూడిపోయిన రాచరికాన్ని మళ్ళీ వూరేగిస్తున్న రాచ వీధుల్లోంచి నడచి వస్తున్నా!’’ అని మొదలై ఆనాటి నుంచి ఈనేటి ఏలికల గుట్టు  బయట పెట్టారు. ‘‘పేగు తెంపిన మంత్ర సాని చనుబాలు తాగనివ్వని పసి బాలుడి నోట్లోంచి బొటన వేలినై బయటికి
కొత్త పుస్తకం

హిందూమతం అబద్ధమని ఒప్పించే రచన

సి.యస్‌.అర్‌.ప్రసాద్‌ అనువాదం చేసిన  దివ్యా ద్వివేది, షాజ్‌ మోహన్‌, జె.రెఘు కలిసి రాసిన హిందూయిజం ఒక అబద్ధం అనే రచన వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకోడానికి సైద్ధాంతికంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ ముగ్గురు వ్యాస రచయితలు హిందూ మతాన్ని, కుల వ్యవస్థను కలిపి చూశారు. అందుకే హిందూ మెజార్టీ వాదం అగ్రకులాల సృష్టి అనే ఉప శీర్షిక దీనికి ఉంది.             హిందూయిజాన్ని అర్థం చేసుకోడానికి అనేక చారిత్రక వాస్తవాలను వ్యాసకర్తలు ముందుకు తీసుకొచ్చారు.  హిందూత్వ సంస్కృతిక జాతీయవాద భావజాలాన్ని చారిత్రక  భౌతిక వాద దృక్పథంతో,  మార్క్సియన్‌ కోణంలో ఈ రచయితలు చూశారు. దీనికి  భారతీయ హిందూత్వ ఆధిపత్య