ఇది మన పోరాటం ఎందుకు కాలేదు?
సైనిక క్యాంపులు ఎత్తేయాలని దండకారణ్యంలో ఆదివాసులు చేస్తున్న పోరాటానికి ఎనిమిది నెలలు నిండాయి. ఇప్పటికీ వాళ్ల సమస్య పరిష్కారం కాలేదు. మామూలుగా ఇలాంటి పోరాటాలు నడుస్తున్నప్పుడు లోకం కోసమైనా ప్రభుత్వం ఉద్యమకారులతో సంపద్రింపులు జరుపుతుంది. కానీ ఈ పోరాటం విషయంలో అలాంటివేమీ లేదు. 2021 మే 17వ తేదీ చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాలో మొదలైన ఈ పోరాటం మొదటి రెండు మూడు రోజుల్లోనే నెత్తుటి మడుగులో తడిసింది. ఐదుగురు ఆదివాసులను భారత ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నది. అయినా ఆదివాసులు వెనకడుగు వేయలేదు. క్రమంగా ఈ ఉద్యమం జార్ఖండ్ ప్రాంతానికి కూడా విస్తరించింది. ఈ ఎనిమిది నెలలుగా