14 సంవత్సరాల తరువాత నిర్దోషులుగా తీర్పు
14 సంవత్సరాల 19 రోజుల తరువాత ప్రశాంత్ రాహి, చంద్రకళ తదితరులను ఉత్తరాఖండ్ కోర్టు UAPA కేసులో నిర్దోషులుగా ప్రకటించింది 2022 జనవరి 7న, ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లోని జిల్లా- సెషన్స్ జడ్జి ప్రేమ్ సింగ్ ఖిమల్ కోర్టు, దేశద్రోహం, రాజద్రోహం, UAPA నిందితులు ప్రశాంత్ రాహి, అతని జీవన సహచరి చంద్రకళతో పాటు మరో ఇద్దరిని నిరోషులుగా ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో 14 సంవత్సరాల 19 రోజుల పాటు సాగిన ఈ ప్రసిద్ధ కేసులో అనేక కోణాలు వున్నాయి. 2007 డిసెంబర్ 17 న డెహ్రాడూన్‌లోని ఆరాఘర్ దగ్గర ప్రశాంత్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు