ఇంటర్వ్యూ సంభాషణ

సీమ ఆకాంక్ష‌ల‌ప‌ట్ల నిర్ల‌క్ష్యం

రాయలసీమ సమాజం ఆశలను, ఆకాంక్షలను సభ్య సమాజం ముందుంచడానికి రాయలసీమ సాగునీటి సాధన సమతి, రాయలసీమ ప్రజా సంఘాలు అనేక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాల సారాంశాలను విస్తృతంగా సమాజం ముందుంచడంలో, వారికీ అవగాహన కల్గించడంలో, చైతన్యం కల్గించడంలో  పత్రికా రంగం  ప్రధాన పాత్ర వహించాల్సివుంది. అణగారిన, నిర్లక్ష్యానికి గురైన, వెనుబడిన ప్రాంతాల సమస్యలతో పాటు వాటికీ నిర్దిష్ట పరిష్కార మార్గాలను  రాజకీయ వ్యవస్థకు ముందుంచడంలో కుడా  పత్రికా రంగం  బాధ్యతాయుత పాత్ర  వహించాల్సివుంది.  ఆ దిశగా “వసంతమేఘం’ సంపాదకులు, నిర్వహకులు క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికీ ముందుగా అభినందనలు.  అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోస్తా
సాహిత్యం వ్యాసాలు కొత్త పుస్తకం

విప్లవ సాహిత్య విమర్శకు విలువైన చేర్పు

నాగేశ్వరాచారి మూడు దశాబ్దాలకు పైనే పరిచయం, స్నేహం. గద్వాల నుంచి మొదలుపెట్టి కర్నూలు, హైదరాబాద్, అనంతపురం దాకా రాష్ట్రంలో ఎన్నెన్నోచోట్ల సాహిత్య సమావేశాల్లో కలుస్తూనే ఉన్నాం. అడపాదడపా తన రచనలు అరుణతార లోనో, మరొక పత్రికలోనో చూస్తూనే ఉన్నాను. కాని తనలో ఇంత నిశితమైన ఆలోచనాపరుడైన సాహిత్య విమర్శకుడు ఉన్నాడని ఈ పుస్తకంలోని దాదాపు ముప్పై వ్యాసాలు ఒక్కచోట చదివినప్పుడే తెలిసింది. విద్యార్థి ఉద్యమం ద్వారా సామాజిక ఆలోచనాచరణలోకి ప్రవేశించడం, విశ్వవిద్యాలయ విద్యలో తెలుగు భాషా సాహిత్యాలలో సుశిక్షితుడు కావడం, అధ్యాపక వృత్తిలో నిరంతర అధ్యయనానికీ, జ్ఞాన వితరణకూ అవకాశం రావడం, అనంతపురం వంటి సంక్షుభిత వాతావరణంలో విప్లవ
కాలమ్స్ లోచూపు

కాషాయ ఫాసిజం ఒక విషపూరిత కషాయం

‘కాషాయ ఫాసిజం, హిందుత్వ తీవ్ర జాతీయవాదం, నయా ఉదారవాద వనరుల దోపిడి’ అనే ఈ పుస్తకం  అశోక్ కుంబం గారు  రాసిన ఇంగ్లీష్ వ్యాసానికి కా. సి యస్ ఆర్ ప్రసాద్ చేసిన అనువాదం. భారతీయ ఫాసిజం అనేది మన నేలమీది ఆధునిక పెట్టుబడిదారీ సామాజిక దుష్పరిణామమే. అంటే, ఇక్కడి ఫాసిజానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ,  దాని చుట్టూ ఉండే భిన్న సామాజిక సంస్కృతుల సంక్లిష్ట, సమాహారమైన నాగరికత అనే రెండు వైపుల నుంచి బలం సమకూరిందని అర్థం చేసుకోవాలి. అందువల్ల భారత ఫాసిజాన్ని స్థూలంగా చూసినప్పుడు గతకాలపు విదేశీ ఫాసిజంతో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ, సూక్ష్మంగా పరిశీలించినప్పుడు
వ్యాసాలు

సంఘటితం అవుతున్న బస్తర్ ఆదివాసీ పోరాటాలు

“గత సంవత్సరం, కొంతమంది జిల్లా రిజర్వ్ గార్డులు గ్రామానికి వచ్చి నన్ను పట్టుకుని, నక్సలైట్లు ఎక్కడ దాక్కున్నారో చెప్పమని వేధించడం మొదలుపెట్టారు. రెండు రోజుల పాటు అడవిలో తిప్పారు. చాలాసార్లు శారీరకంగా హింసించి, చివరకు అడవిలో వదిలేశారు, ”అని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భద్రతా బలగాల ఆరోపణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న స్మిత (పేరు మార్చబడింది) అన్నారు. గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న భద్రతా బలగాల శిబిరాలకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ జిల్లాల్లో నిరసనలు చేస్తున్న వేలాది మంది గ్రామస్తుల్లో స్మిత ఒకరు. స్మిత గ్రామంలో మాదిరిగానే, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, బీజాపూర్, సుక్మా, తదితర జిల్లాల్లోని గ్రామాల్లో భద్రతా దళాల
సాహిత్యం వ్యాసాలు కొత్త పుస్తకం

భూమి రంగు కవి

కాలం పొదిగిన కవిత్వమిది. ఈ కాలంతో సంఘర్షించిన కవిత్వమిది. కాల స్వభావపు ఆనుపానులను పట్టుకున్న కవిత్వమిది. ఈ దు:ఖిత కవి సమయాల్లోని వర్మ అంతరంగ సంచలనాలివి. ఆయన సృజన లోకపు చిత్తరువులివి.  మానవాళి అనుభవిస్తున్న రాపిడినంతా ఆయన తనలోకి వొంపుకొని రాశారు. తన ఊహాన్వేషణల వెంట మనల్ని నడిపించుకుంటూ వెళ్తూ మన అనుభవాలనూ కవిత్వం చేశారు. మానవుడిగా, కవిగా ఆయనలోని అలజడినంతా మనకు పంచిపెట్టడానికి తన కాల్పనికతనంతా వెచ్చించారు.    వెరసి కవిగా వర్మ తన పరిణతినంతా పోతపోసిన సంపుటి ఇది. ఎవరీ భూమి రంగు మనుషులు? ఎక్కడి వాళ్లు? వాళ్ల కోసం వర్మ ఎందుకింత దు:ఖితుడవుతున్నారు? ఎలాంటి
సాహిత్యం కాలమ్స్ అలనాటి రచన

చెదిరినసమాజం

మూలం: చినువా అచ్ బె                        తెలుగు అనువాదం: కొలసాని సాంబశివరావు                                                             “చెదిరిన సమాజం” ఇది నైజీరియన్ నవల. దీని ఇంగ్లీష్ పేరు “థింగ్స్ ఫాల్ అపార్ట్”[Things fall apart]  దక్షిణ ఆఫ్రికాలో ఒక దేశం నైజీరియా. ఆ దేశంలో ఒక మారు మూల గ్రామం ”వుమ్యోఫియా”. నాగరికతకూ, సాంకేతికతకూ దూరంగా వున్న గ్రామం. వ్యవసాయపు పనులూ, వర్షం కోసం ఎదురు చూపులూ, కట్టుబాట్లూ, రచ్చబండ తీర్పులూ, నమ్మకాలూ, ముర్ఖత్వాలూ, అన్నీ కలసి దూరంగా బ్రతుకుతున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ‘యామ్’ పంటల పండుగ.ఆరోజు అందరూ ఒకచోట చేరి సమిష్టి వంటలూ, ఒకవైపు సంగీతవాయిద్యాలూ, మరోవైపు మల్ల యుద్దాలూ, ఆడా, మగా,
కాలమ్స్ ఆర్ధికం

అసమానతల భారతం

'మన ప్రజాస్వామ్యం మేడిపండు... మన దరిద్రం రాచపుండు' అన్నాడోక కవి. ఆయన మాటలు అక్షర సత్యాలు. ఎందువల్లనంటే ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడ భారతదేశంలో పేదరిక నిర్మూలన సాధ్యం కాలేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నా  సామాన్యుల బతుకులు మారడం లేదు. దేశాన్ని దశాబ్దాలు పరిపాలించిన పార్టీలు దేశ సంపదను దోచుకుని విదేశాలకు తరలించడం, స్విస్‌ బ్యాంకుల్లో వేల కోట్ల నల్లధనాన్ని దాచిన జాతీయ నాయకులు మళ్లీ ప్రజలలోకి వచ్చి దేశానికి సేవ చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారు. గత పాలకుల శాపమే నేటికీ పేదరికం వేధిస్తున్నదని
సంభాషణ

ప్రహార్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌పంచ ప్ర‌తిస్పంద‌న‌

భారత విప్లవోద్యమంపై ప్ర‌భుత్వ దాడికి వ్య‌తిరేకంగా న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ దేశాల్లోని ప్ర‌జాస్వామిక వాదులు స్పందించారు. విప్ల‌వ ప్ర‌జా పోరాటాల‌ను నిర్మూలించ‌డానికి ఇటీవలే భార‌త పాల‌కులు ప్రారంభించిన నూతన ప్రహార్‌-3ని నిరసిస్తూ “ఇంటర్నేషనల్‌ కమిటీ టు సపోర్ట్‌ పీపుల్స్‌ వార్‌ ఇన్‌ ఇండియా” (ఐసీఎస్‌పీడబ్య్యూఐ-భారత ప్రజాయుద్ధానికి మద్దతుగా అంతర్జాతీయ కమిటీ) పిలుపు మేర‌కు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనేక దేశాలలో చాలా క్రియాశీలంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.ఇట‌లీ నుండి టునీషియా వరకు, ఈక్వడార్‌ నుండి కెనడా వరకు, అమెరికా నుండి జర్మనీ వరకు, బ్రెజిల్‌ నుండి డెన్మార్క్‌ వరకు, కొలంబియా నుండి నార్వే వరకు, స్పెయిన్‌ నుండి స్విట్టర్‌లాండ్‌
ఇంటర్వ్యూ సంభాషణ

రాజకీయ చదరంగంలో ప్రజలే పావులు

అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని  కోస్తా ఆధిపత్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ప్రతి పక్షాలు  మద్దతు ఇస్తున్నాయి. దీనిని ఎట్లా చూడాలి? జవాబు: మేం ఆ డిమాండ్ ను అప్రజాస్వామికమైనదిగా పరిగణిస్తున్నాం. అయితే, గత ప్రభుత్వ ఆ నిర్ణయపు తప్పొప్పులకు అన్నీ రాజకీయ పార్టీలూ బాధ్యులే. అధికారంలోకి వచ్చాక వైఎస్ ఆర్ పి పార్టీ ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది.  అందువల్ల  ఆపార్టీ  గతంలో తాము అమరావతి రాజధాని ప్రతిపాదనకు మద్ధతునివ్వడం తప్పని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సంబంధిత ప్రజలను చర్చలకు పిలిచి సముచిత నష్టపరిహారం ఇవ్వాలి. రాజకీయ చదరంగంలో ప్రజలని, వారే పార్టీ వారైనా పావులను