వ్యాసాలు ఓపెన్ పేజీ

అమరావతి రైతుల ఉద్యమం – ప్రజాస్వామిక దృక్పథం

అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు’ పాదయాత్ర దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అక్కడక్కడా ఆటంకాలెదురైనా, కోర్టు అనుమతివల్ల సాఫీగానే సాగిందని చెప్పవచ్చు. ఆ యాత్రకు అన్ని ప్రతిపక్షాల మద్దతు వున్నందువల్లనూ, మీడియా సహకారం పూర్తిగా వున్నందువల్లనూ అధిక ప్రచారం లభిస్తున్నది కూడా. అయితే, ఇది సరళమైన సమస్యకాదు. దీనిని కేవలం ఒక ప్రాంత రైతు సమస్యగానే చూడలేం. అందువల్ల ఎంత మద్దతు ఉన్నదో, అంతే వివాదాస్పదమైనది కూడా. అంతేగాక, ఇందులో అధికార రాజకీయ ప్రమేయాల పాత్రను చూడక తప్పదు. అంతేకాదు, అధికార రాజకీయాలంటే అధికార పార్టీల రాజకీయాలని అర్థంజేసుకుంటే ఈ వివాదం పట్ల ప్రజాస్వామిక వైఖరి
కాలమ్స్ ఓపెన్ పేజీ

ఏ వెలుగులకు ఆ వెన్నెల?

కళ కళ కోసం కాదు. ఎప్పటి మాట ఇది! ఈ నినాదం వెనక ఎంత పోరాటం! ఈ నినాదం వెంట ఎన్ని త్యాగాలు! కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా గుర్తు చేయాల్సి వస్తోంది. చర్చ మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తోంది. సినిమా పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గతించాడు. ఆయన పని చేసిన రంగంలో తనదైన బలమైన ముద్ర వేసిపోయాడు. దాని గురించి మీడియా ఆలపిస్తూనే ఉంది. దాన్నలా ఉంచితే రచయితగా ఆయనేమిటి, ‘వ్యక్తిగత’ రాజకీయ విశ్వాసాలపరంగా ఆయనేమిటి, ఈ రెండిటినీ కలిపి చూడాలా, వేరువేరుగా చూడాలా అనే ప్రశ్న ముందుకొచ్చింది. ఆయన స్వయంగా ప్రకటించి ఉన్నాడు గనక
ఓపెన్ పేజీ

ఆఫ్గ‌నిస్తాన్‌ను ఎలా అర్ధం చేసుకోవాలి?

ఆఫ్ఘనిస్తాన్  రాజకీయ వ్యవస్థను,  సామాజిక సంబంధాలను అమెరికన్ సామ్రాజ్యవాదపు కనుసన్నలలో న‌డిపేందుకు అక్క‌డ ఒక బ్యూరాక్రటిక్ బూర్జువా నమూనా ప్రభుత్వాన్ని  ఏర్పరిచే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.   నిజానికి బ్రిటన్ సామ్రాజ్యవాదం సైతం ఎన్నో సార్లు అఫ్ఘనిస్తాన్ ని దాని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించింది. బ్రిట‌న్‌ను    అనుసరించే రాజుని లేదా పరిపాలనను స్థాపించాలనే  ప్రయత్నం జ‌రిగింది. అయితే అవ‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయ‌యి.  చరిత్ర దీన్ని రుజువు చేస్తుంది.  అయితే  ఈ రోజు మత ప్రాతిపదిక‌గా ఆఫ్ఘనిస్తాన్ ని సామ్రాజ్యవాద కబంధ హస్తాల నుండి *విముక్తం* చేయడం అనే ప్రక్రియను విమర్శనాత్మకంగా ప‌రిశీలించాలి.  ఈ పరిశీలన ఆఫ్ఘనిస్తాన్ సామాజిక సంబంధాల నుంచి,  ఉత్పత్తి సంబంధాల నేపథ్యం నుండి
ఓపెన్ పేజీ

వాళ్లు తాలిబాన్ల‌కంటే భిన్నంగా ఉన్నారా?

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడం వారి మునుపటి పాలన జ్ఞాపకాలను తాజా చేసింది. ఆ సమయంలో తాలిబాన్లు షరియాకి తమ సొంత పద్ధతిని, మహిళలపై భయంకరమైన అణచివేతను అమలు చేశారు. వారు  పురుషులను కూడా విడిచిపెట్టలేదు. పురుషులకు ప్రత్యేక దుస్తులు, గడ్డం తప్పనిసరి చేసారు. బమియాన్‌లోని గౌతమ్ బుద్ధ భగవానుని పురావస్తు ప్రాముఖ్యత కలిగిన విగ్రహాలను కూడా తాలిబాన్లు కూల్చివేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబాన్‌లను భారతీయ ముస్లింలలో ఒక చిన్న విభాగం స్వాగతించింది. వారి దృష్టిలో ఇది విదేశీ ఆక్రమణదారులపై ఇస్లాం విజయం. ఈ పరిణామంతో చాలా మంది ముస్లింలు, ముఖ్యంగా ముస్లిం
కాలమ్స్ ఓపెన్ పేజీ

అందోళనాజీవుల కాలమిది

హిందుత్వ ఫాసిజమనే విష వృక్షం రోజు రోజుకు తన వేర్లను సమాజ లోతుల్లోకి చొప్పించి తన పునాదిని గట్టిపర్చుకుంటుంది. తన శాఖలను విస్తరించుకుంటూ పాలనా, చట్టం, న్యాయం, మీడియా అన్నింటిని తన నీడ కిందికి తెచ్చుకుంటుంది. మన సమాజంలో చారిత్రకంగా (వందల సంవత్సరాలుగా) అనేక రూపాలలో కొనసాగుతున్న అధిపత్య భావనలు (కుల దురాహంకారం, పితృస్వామ్యం, మత పెత్తనం)  హిందుత్వ విష వృక్షపు వేర్లకు సత్తువనిస్తున్నాయి. ఆ విష వృక్షం ఈ రోజు దోపిడీ కుల, వర్గాల అండదండలతో అధికారం చేజిక్కించుకొని తన ఫాసిస్టు నిజ స్వరూపాన్ని నగ్నంగా ప్రదర్శిస్తుంది. అయితే ఈ రోజు కాకపోతే రేపు ఆ విష