వాకపల్లి అత్యాచారం నుంచి వైమానిక దాడుల దాకా
వాకపల్లి ఆదివాసీ మహిళలను అత్యాచారం చేసిన వాళ్ల మీద కేసును ఏప్రిల్ 6న కోర్టు కొట్టేసింది. ఆ మరుసటి రోజు ఇంకా తెల్లారక ముందే చత్తీస్‌ఘడ్‌లోని పామేడ్ ప్రాంతంలో భారత ప్రభుత్వం రెండో విడత వైమానిక దాడులు చేసింది. ఈ రెండు ఘటనలు వరుసగా జరగడం యాదృశ్చికం కావచ్చు. కానీ వాటి మధ్య పోలిక ఉన్నది. సంబంధం ఉన్నది. ఈ రెండు ఘటనలకు మధ్య పదహారేళ్ల ఎడం ఉన్నది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఆదివాసీ గ్రామం వాకపల్లి. ఆగస్టు 20, 2007న ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో విప్లవకారులను హత్య చేయడానికి కూబింగ్‌కు వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులు వాకపల్లి మహిళల