భారత ప్రభుత్వం తన పౌరులపై మరోసారి బాంబు దాడి చేసిందని మీకు తెలుసా?

“గత నెలలో అమిత్ షా బస్తర్‌ను సందర్శించి, ప్రతిఘటనను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసిన తరువాత 2023 ఏప్రిల్ 7 న దాడి జరిగింది. అమెరికా ఇతర దేశాలపై బాంబు దాడులు చేసినప్పుడు చాలా మంది కార్యకర్తలు నిరసన తెలుపుతున్నప్పటికీ, భారత ప్రభుత్వం దేశంలో బాంబు దాడులు చేసినప్పుడు వారు మౌనంగాగా ఉన్నారు.”

నిరసన! నిరసన! నిరసన!

ఛత్తీస్‌గఢ్‌రాష్ట్రం, బస్తార్ జిల్లాలోని భట్టుం, కవురుగట్ట, మీనగట్ట, జబ్బగట్ట గ్రామాల ఆదివాసీల పైన భారత ప్రభుత్వం ద్రోణుల  సహాయంతో 2023 ఏప్రిల్ 23 నాడు వైమానిక బాంబులు వేసింది.

ఉదయం 6 గంటల నుంచి బాంబు దాడి ప్రారంభమైనప్పుడు ఆదివాసీలు తమ బతుకుదెరువు కోసం మహువా ఆకులను సేకరించే పనిలో నిమగ్నమై వున్నారు. బాంబు దాడి తరువాత, ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దళానికి చెందిన మూడు హెలికాప్టర్ల నుండి భారతీయ సాయుధ దళాలు కాల్పులు జరిపాయి. పంటలు, అడవి, వారి నివాస ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. భయంతో పరుగెత్తుతున్నప్పుడు జరిగిన తొక్కిసలాటలో చాలా మంది గాయపడ్డారు!

2021 నుంచి జరిగిన నాలుగో బాంబు దాడి ఇది. 2023లో ఇది రెండవసారి. మొదటి బాంబు పేలుడు 2021  ఏప్రిల్ 19 న, రెండవది 2022 ఏప్రిల్ 15 న జరిగింది. మూడవసారి 2023 జనవరి 11న సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్, కోబ్రా కమాండోలు జిల్లా రిజర్వ్ గార్డ్స్‌తో కలిసి తెలంగాణ- ఛత్తీస్‌ఘఢ్-ఒదిశా సరిహద్దులోని గ్రామాలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి చేశారు.

ఎన్ఎస్ఎ లోని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల సహాయంతో భారతదేశంలో నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టిఆర్ఓ) ను ఏర్పాటు చేశారు. ఎన్టిఆర్ఓ నుంచి భారత వైమానిక దళ సిబ్బంది ఈ డ్రోన్ దాడులను నిర్దేశిస్తున్నారు. ఈ దాడులు భారత ప్రభుత్వ దీర్ఘకాలిక ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. ఈ దాడులు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ అనే దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌లో భాగం. ఈ ప్రాజెక్ట్‌ కోసం కమ్యూనిస్టు వ్యతిరేకంగా సైద్ధాంతిక యుద్ధసహాయంతో పాటు సాంకేతిక, ద్రవ్య సహాయాల్ని ఇజ్రాయెల్, అమెరికా, యునైటెడ్ కింగ్‌డంలు  అందించాయి. గత నెలలో అమిత్ షా బస్తర్‌కు వచ్చి  “ప్రతిఘటనను నిర్మూలిస్తా”మని ప్రతిజ్ఞ చేసిన తరువాత, 2023 ఏప్రిల్ 7న ఈ దాడి జరిగింది. ఇతర దేశాలపై అమెరికా బాంబు దాడులు చేసినప్పుడు చాలా మంది సామాజిక కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ, భారత ప్రభుత్వం తన దేశంలోనే బాంబు దాడులు చేసినప్పుడు మౌనం వహించారు.

రాజ్యం డ్రోన్ దాడులను ఎందుకు ప్రారంభించింది లేదా ఆపరేషన్ సమధాన్-ప్రహార్ దేనికోసం?

మునుపటి దోపిడీదారులు బ్రిటిష్ వలసదారుల రూపంలో వుంటే, ఇప్పుడు తమ దళారీల సహాయంతో సహజ వనరులు, ప్రజల శ్రమల సామ్రాజ్యవాద దోపిడీని నిర్వహిస్తున్న బహుళ నయా-వలసదారుల రూపంలో వున్నారు. ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లోని ఖనిజాలను దోచుకోవడంలో సహాయం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల స్థాయివారితో సహా దళారీ నిరంకుశాధికారులకు అదానీ, బిర్లా, వేదాంత, టాటా, జిందాల్ వంటి దళారీ బూర్జువాలు చెల్లిస్తున్నారు.

గనుల తవ్వకం ద్వారా కార్పొరేట్ సంస్థలు చేస్తున్న ఈ వ్యవస్థీకృత దోపిడీ పెసా చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల ఎప్పుడూ కూడా ఆదివాసీలు, వారి గ్రామసభలనుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ర్యాలీలు, ధర్నాలు, ఇతర రకాల శాంతియుత నిరసనలు పాశవిక అణచివేతను ఎదుర్కొంటున్నాయి. ప్రజల ప్రతిఘటన పెరిగే కొద్దీ, ప్రభుత్వం ఆ ప్రాంతాలలో మరిన్ని అర్ధ-సైనిక క్యాంపులను ఏర్పాటు చేస్తుంది. భూస్వాములు, కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొంటాయి.

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రారంభించిన సల్వాజుడుమ్ అవసరాలను తీర్చడానికి టాటా నిధులు సమకూర్చినట్లుగా గుర్తించారు. సాయుధ దళాలు ఆదివాసీల భూములు, అడవులు, నీటి వనరులతో సహా వారి నివాస స్థలాలను జైలు లేదా నిర్బంధ శిబిరాలుగా  మార్చివేస్తున్నాయి. అక్కడ ఆదివాసీల ఆయుర్దాయం కార్పొరేట్ సంస్థల దయపై ఆధారపడి ఉంటుంది. ‘జీవించే హక్కు’ ను కొల్లగొట్టే  వ్యవస్థీకృత చట్టవ్యతిరేక హత్యలు ఆదివాసీలకు బిర్సా ముండా వంటి ఆదివాసీ నాయకుల మార్గాన్ని ఎంచుకోవడం తప్ప వేరే మార్గం లేకుండా చేస్తున్నాయి.

బ్రాహ్మణీయ రాజ్యం, సామ్రాజ్యవాదాల వల్ల తమ ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు ప్రజలు సంఘటితమై సమరశీలంగా  ప్రతిఘటిస్తారు. భారతదేశంలో పాలక వర్గానికి, రాజ్యానికి సిపిఐ (మావోయిస్ట్) అతిపెద్ద ఆంతరంగిక ముప్పుగా ప్రకటించారు. ‘తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి సవాళ్లు- ప్రణాళికా కమిషన్‌కి నిపుణుల బృందం నివేదిక’ సైనికపర అణచివేత ఆదివాసీల, మావోయిస్టుల ప్రతిఘటనను అంతం చేయలేదని పేర్కొంది. వనరుల దోపిడీ, నిర్వాసిత్వంతో సహా రాజ్యం చేస్తున్న దోపిడీ వల్ల ప్రజలు మావోయిస్టులకు మద్దతు ఇస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది, సూచించింది కూడా. ఒకవైపు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరోవైపు పౌరులను హతమార్చే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు   యుద్ధంలో పాల్గొనాల్సి  వస్తుంది. భారత రాజ్యం చేస్తున్న  యుద్ధం కేవలం పదికోట్ల నలభై లక్షల ఆదివాసీలకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, సామ్రాజ్యవాద ప్రయోజనాలకు సేవ చేస్తున్న గుప్పెడు కార్పొరేట్ సంస్థల కోసం మొత్తం దేశానికి వ్యతిరేకంగా కూడా చేస్తున్న  యుద్ధం.

వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా సైనిక చర్యలు, దాడులను ప్రభుత్వం సమర్థిస్తుంది. కానీ వాస్తవానికి, సిపిఐ (మావోయిస్ట్)ని అంతం చేసి, వారి సాయుధ వర్గ పోరును తుదముట్టించిన తర్వాత కార్పొరేట్‌లు సహజ సంపదను దోచుకోగలరని, ఆదివాసీలను (సాంస్కృతిక/సామాజిక/ఆర్థిక మారణహోమం) నిర్వాసితులను చేయగలరని పరోక్షంగా అర్థం. కాబట్టి, సామ్రాజ్యవాదానికి అనుకూలంగా బ్రాహ్మణీయ హిందూత్వ భారత రాజ్యం చేస్తున్న చర్యకు సమాధాన్ ప్రహార్ అని పేరు పెట్టారు.

బూటకపు ఎన్‌కౌంటర్లు, చిత్రహింసలు, లైంగిక హింస, అత్యాచారం, బలవంతపు అదృశ్యాలు, అక్రమ నిర్బంధాలు, దాడులు, ఆదివాసీలపై యుఎపీఏ చట్టాన్ని ఉపయోగించడం – ఇవన్నీ భిన్నాభిప్రాయాలు కలిగినవారిలో  మానసికాందోళన వాతావరణాన్ని సృష్టించేందుకు రాష్ట్ర పోలీసులు, పారామిలిటరీ ఆపరేషన్ సమాధాన్-ప్రహార్‌లో భాగంగా ఉపయోగించే వ్యూహాలు. ఆదివాసీల కోసం, వారి నిర్వాసిత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఫాదర్ స్టాన్ స్వామి హత్యను, యుఎపీఏ సహాయంతో ప్రొఫెసర్ GN సాయిబాబా జైలునిర్బంధాన్ని ఆపరేషన్ సమాధాన్ ప్రహార్‌తో పాటు చూడాలి. ఆదివాసీలు, దళితులపై వైమానిక బాంబులు వేసి, కాల్పులు జరిపి  యుద్ధం చేసినందుకు ఎస్సీ-ఎస్టీ చట్టం కింద ఎవరైనా శిక్షించవలసి వస్తే – నరేంద్ర మోదీ, అమిత్ షా, ద్రౌపది ముర్ము, భారత సాయుధ బలగాలు, రాష్ట్ర ప్రభుత్వం, బ్యూరోక్రాట్‌లు, కార్పోరేట్‌లను అరెస్టు చేయాలి.

ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ ఆపండి!

సామ్రాజ్యవాదాన్ని అంతం చేయండి!

బ్రాహ్మణీయ హిందూత్వ భారత రాజ్యాన్ని ధ్వంసం చేయండి!

ప్రజల ప్రతిఘటనకు మద్దతు ఇవ్వండి!

ఆంగ్ల మూలం నుంచి  తెలుగు : పద్మ కొండిపర్తి

అంతర్జాల ఏషియన్ స్పీక్స్.కాం నుండి

One thought on “మరో సారి భారత ప్రజలపైబాంబు దాడి

  1. మా సత్యం
    (మాంచాల అచ్యుత సత్యనారాయణ రావు)
    దండకారణ్యం లోని ఆదివాసీ ప్రజలపై
    ఈ ఏడాది జనవరి 11న జరిగిన బాంబుల దాడిని మరువక ముందే మరోసారి ఏప్రిల్ 7వ తేదీన భారత ప్రభుత్వం జరిపిన రెండవ వైమానిక సైనిక దాడి.
    భారత సరిహద్దుల్లో ఉండాల్సిన సైనిక దళాలు దండకారణ్యంలోకి ప్రవేశించి దేశంలోని సొంత ప్రజలపై దాడులు చేస్తున్న సైనికులకు “రూల్ ఆఫ్ లా” వర్తించదా!?. సుప్రీంకోర్టును ప్రశ్నిస్తున్న.
    అందరికీ న్యాయ నియమాలు సమానంగా వర్తించడమే “రూల్ ఆఫ్ లా” అర్థం.
    కానీ ఈ విధానములో “లా” కనుమరుగై ఇల్లీగల్ “లా” ఫాసిజంతో మమేకమై విశ్వరూపమై ఏలుతోంది.
    దండకారణ్యంలో జరుగుతున్న వైమానిక బాంబుల సంఘటన పట్ల భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. భారత సర్వోన్నత న్యాయవ్యవస్థ దేశ ప్రజల హక్కులను- పాలకుల నుంచి, బలవంతుల నుంచి రక్షించాల్సిన బాధ్యతను మరచి మౌనం వహించడం ఫాసిస్టు పాలకుల రాజ్య హింసను సమర్థించడమే. భారత రాజ్యాంగంలో ‘పీఠిక’ లో పేర్కొన్న వాక్యాలు ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి. “మనది సార్వభౌమ, సమ సమాజ, మతాతీత, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యమని” పీఠిక (Preamble)లో పేర్కొన్నారు.
    2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంలోని అర్ధాలు మారిపోయాయి. భారత రాజ్యాంగం మా పరిపాలనకు వర్తించదు అన్నట్లుగా పరిపాలిస్తున్నారు.
    (ప్రధానంగా సమసమాజం’ అనే పదాన్ని పీటికలో 1976లో 42వ సవరణ ద్వారా చేర్చారు.) దీనిని ఇప్పుడు పరిపాలిస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం యొక్క ప్రణాళికలో పెట్టుబడిదారుల సంక్షేమమే వారి ప్రథమ ప్రాధాన్యత తో ఆచరిస్తున్నారు.
    భారత ప్రభుత్వం దేశ ప్రజల మౌనాన్ని బలహీనతగా భావిస్తోంది వారి మౌనం గోడకు వేలాడదీసిన తుపాకి వంటిది.
    ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ ఫాసిస్టు చర్యలు హానికరం. సుప్రీంకోర్టు యుద్ధ ప్రతిపాదికన స్పందించి ఆదివాసులపై జరిగిన వైమానిక యుద్ధాన్ని సుమోటోగా స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నాను.

Leave a Reply