వ్యాసాలు

బాల్జాక్ ప్రపంచంలో..

(ఇటీవల విరసం విడుదల చేసిన ముక్తవరం పార్థ సారథి  *బాల్జాక్ జీవితం - సాహిత్యం* పుస్తకానికి రాసిన ముందుమాట ) ముక్తవరం పార్థసారథి గారికి శరీరం లేదు. ఒక హోదా లేదు. అవార్డులు, రివార్డులు లేవు. పబ్లిసిటీ లేదు. ప్రచారం లేదు. ముఠాలు లేవు. సాహిత్యమే పార్థసారథి గారు. ఆయనతో మాట్లాడితే సాహిత్యం మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఆయన్ని ఎరిగినవాళ్లు సాహితీ సంపదని ఎంతోకొంత సంగ్రహించకుండా ఉండరు. అందుచేతే ఎరిగినవాళ్లు, ఆయన్ని ఎరగని వాళ్లలా నడుచుకుంటారు. అయినా కించిత్తు కూడా విచారించరు. బావిలో నీళ్లు చేదకపోతే వూట తగ్గిపోతుందేమోనన్నట్టుగా, నిరంతరం ఒక ప్రవాహంలా సాహిత్యాన్ని వెలువరిస్తారు. ఆర్బిఐ లో అధికారిగా
ఎరుకల కథలు

ధర్నా

"ఇదంతా అయ్యేపని కాదులేన్నా" నిష్ఠూరంగా అన్నాడు గోపాల్. గోపాల్ మాటలకు బదులు చెప్పే ప్రయత్నం చెయ్యలేదు రమణ. అతడికి ముప్పై ఐదేళ్లుంటాయి. సన్నగా పొడవుగా ఉన్నాడు. అతడి తల్లోంచి చెమట కారిపోతోంది. ఎడమచేతికి వున్న వాచీకేసి రోడ్డుకేసి మాటిమాటికి తలతిప్పి చూస్తున్నాడు. అతడి కళ్లు చురుగ్గా వున్నాయి. మొహం ప్రశాంతంగా వుంది. ఎంఆర్ఓ ఆఫీసు ముందు జనం గుంపు చేరిపోయారు. ఎండ చుర్రుమంటోంది. ఉదయం పదకొండు గంటలవుతున్నా ఎంఆర్ఒ జాడలేదు. ఆఫీసులో సిబ్బంది కూడా పలుచగా ఉన్నారు.కొన్ని సీట్లు ఖాలీగా కనపడుతున్నాయి.ఒక ఉద్యోగి దినపత్రికని తల పైకెత్తకుండా శ్రద్ధగా చదువుకుంటున్నాడు. అతడి ముందు బిక్క మొహంతో ఒకామె నిలబడి
వ్యాసాలు

సంతోషకరమైన దినాలు చెల్లిపోయాయి

మూడోసారి నరేంద్రమోదీ సంకీర్ణ ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చాడు.  భారత ప్రజలు విచక్షణతో తీర్పు ఇచ్చారు. దేశంలోని రెండు కూటములకు తగిన ప్రాధాన్యతనిచ్చారు.  ఇది ఎన్నికల సమీకరణల మీద విశ్లేషణ. అయితే మొత్తానికి భారతీయుల సంతోషకర దినాలకు కాలం చెల్లింది.  నిరుద్యోగం, ఆర్థిక కుంగుబాటు భారతీయ కుటుంబాలలో సర్వసాధారణమైంది. అసంఘటిత కార్మికులలో పనిభద్రత ఒక సవాలుగా మారింది.  భారతదేశంలోని కొన్ని నగరాలలో జరుగుతున్న అభివృద్ధికి, నమూనా ముఖ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు వలస కూలీల అవసరం ఏర్పడుతుంది. దేశాన్ని   కలిపే అనేక రైళ్ళు వలస కూలీలతో నిండి ఈ మహా నగరాల వైపు  వెళుతున్నాయి.  గ్రామాలలో ఉపాధి తగ్గింది.  నరేంద్ర
వ్యాసాలు

ఇజ్రాయిల్ జైళ్ళలో పాలస్తీనా మహిళా జర్నలిస్టులు

పాలస్తీనా జర్నలిస్టులపై దాడులు ఎప్పుడూ విస్తృతంగానే జరుగుతున్నాయి. పాలస్తీనా మీడియా ఉద్యోగులను ఇజ్రాయెల్ అధికారులు తరచూ "రెచ్చగొడుతున్నారనే" నేరారోపణతో  “రహస్య సాక్ష్యం” వుందని, "పరిపాలనా సంబంధ ఖైదీలు"గా జైలు శిక్షకు గురిచేస్తారు. ఈ రెండు ఆరోపణలు కూడా అబద్ధం. ఇజ్రాయెల్ నేరాలను బహిర్గతం చేయకుండా జర్నలిస్టులను అడ్డుకునేందుకు ఉద్దేశించినవే. ఇతర ఖైదీల మాదిరిగానే ఇజ్రాయెల్ జైళ్లలో జర్నలిస్టులు హింస, కొరడా దెబ్బలు, అవమానం, హింసలకు గురవుతున్నారు. అంతేకాదు, వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంపర్కమూ లేదు. 2024 జులై 11 నాటికి ఇజ్రాయెల్ జైళ్లలో ఆరుగురు పాలస్తీనా మహిళా జర్నలిస్టులు ఉన్నారు. నిత్యమూ ఇజ్రాయెల్ గార్డుల హింసకు గురవుతున్న
వ్యాసాలు

సత్యంపై గురి: గాజాలో మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యాలు 

 పాలస్తీనా మహిళా జర్నలిస్టులకు ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రాధాన్యత లేదు; వారు కఠిన ఘర్షణ వాస్తవాలను ఎదుర్కొంటున్నారు. కొనసాగుతున్న మానవతా సంక్షోభం మధ్య హింస, సామూహిక నిర్వాసిత్వం, వదలివేయబడటం వంటి తీవ్రమైన ప్రమాదాలతో వారు పోరాడుతున్నప్పుడు 8వ తేదీ వారికి ప్రాముఖ్యతలేని వేడుక అవుతుంది. తమ పనిలో వ్యక్తిగత ప్రమాదాలు ఉన్నప్పటికీ, ముందు వరుసలో నిలబడి ప్రతికూలతను తట్టుకు నిలబడేవారి  కథనాలను పంచుకోవడం, వారి బాధలకు సాక్ష్యమివ్వడం పైనే వారి దృష్టి ఉంటుంది. ముట్టడి - ప్రభావం ఏ యుద్ధంలోనైనా భయానక అనుభవాలు అనుభవించడం ఒక అసమానమైన పరీక్ష. ఏదేమైనా, ఆ యుద్ధ
సంపాదకీయం

ఎన్నికల తరువాత ..

‘ఎన్నికల వేడి’ అంటారు కదా. అది ఎన్నికలయ్యాక చల్లారిపోతుంది. మళ్లీ ఏవో ఎన్నికలు వచ్చే దాకా అంతా చల్లదనమే. పోలింగ్‌ పాలకుల తలరాత మారుస్తుంది. కొత్త వాళ్లు అధికారంలోకి రావచ్చు. పాత వాళ్లే కొనసాగవచ్చు. అద్భుతాలు జరిగినా, జరగకపోయినా ఏదో ఒక రకంగా ‘పాలించడబడటం’ ప్రజలకు మామూలవుతుంది. వేడి చల్లారిపోవడం, కొత్తపోయి పాతపడటం  అంటే ఇదే. కాకపోతే మొన్నటి సాధారణ ఎన్నికలకు కొంత ప్రత్యేకత ఉంది. ప్రధాన స్రవంతి పత్రికల్లో కూడా ఇది కనిపించింది. బీజేపీ కూటమికి, ఇండియా కూటమికి మధ్య భావజాల ఘర్షణగా కూడా  చూశాయి. నిజానికి ఇది దిన పత్రికలకు అందే వ్యవహారం కాదు. వాటి  
వ్యాసాలు

ఖైదులో సురేంద్ర గాడ్లింగ్: అనేక క్రూరత్వాలు, వైచిత్రాలు, అన్యాయాలు

2024 జూన్ 6 నాటికి సురేంద్రను అరెస్టు చేసి ఆరేళ్లు పూర్తయ్యాయి. సుదీర్ఘ ఆరేళ్లు! ఈ కాలాన్ని కొన్ని పదాల్లో వివరించడం చాలా కష్టం. ఈ ఆరేళ్లలో జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు వుండిన స్థిరత్వం, భద్రత, స్నేహితులు, బంధువులు, సంతోషాలతో  ఉన్న జీవితం అకస్మాత్తుగా పూర్తిగా మారిపోయింది. నా ఘోరమైన  పీడకలల్లో కూడా ఊహించలేనంత వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మా ఇంటిపై దాడి జరిగిన  2018 ఏప్రిల్ 17నాటి భయంకరమైన తెల్లవారుజామును నేను గుర్తుచేసుకున్నాను; సురేంద్రను తీసుకెళ్ళిన  2018 జూన్ 6 నాటి ఆ దుర్మార్గపు ఉదయం. ఇది నిజంగా జరిగిందని నమ్మడానికి నాకు చాలా సమయం
మీరీ పుస్తకం చదివారా ?

నెత్తుటితో తడుస్తున్న నేల గురించి

‘మనిషే మనిషిని చంపుకు తినే ఈ లోకం ఎంతకాలం మనగలదు’ ‘మూర్ఖుడా యుద్దాతో దేశాల్ని కొల్లగొట్టగలవేమో సరిహద్దుల్ని జరపగలవేమో మహా అయితే ఇంకో విస్తీర్ణాన్ని నీ కాలి కింద తొక్కి పట్టగలవ్‌ జనం హృదయాలనైతే గెలవలేవు’ ‘ప్రేమను పంచడం కంటే మరో మతం లేదు’ ‘చివరగా యుద్దం సమస్త జీవరాశిని చంపుతుంది’ ...ఇటువంటి కవితావాక్యాలతో పాలస్తీనా`ఇజ్రాయిల్‌  యుద్దానికి వ్యతిరేకంగా..సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ వచ్చిన కవిత్వమే ఈ గాజాలేని జాగా..ఇప్పుడు దేశాలకు దేశాలు శ్మశానాలౌతున్నాయి. నిత్యం నెత్తుటితో తడుస్తున్నాయి. గాయపడ్డ నేల కాదది..చంపబడ్డ నేల..చెరచబడ్డ నేల..పసికందులని కనికరం లేకుండా బుల్లెట్ల వర్షం కురుస్తున్న నేల..ఇప్పటికీ ఎటుచూసినా దేహాన్ని తెంచుకుని విసిరేయబడ్డ అవయవాలు,
వ్యాసాలు

డ్యామ్ ఒద్దంటున్న అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు

సియాంగ్ నదిపై కట్ట తలపెట్టిన విద్యుత్ ప్రాజెక్టు ఆదివాసీల భూములను ముంపుకు గురిచేసే ప్రమాదం ఉంది. జూలై 8న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పర్యటనకు ముందు డ్యామ్ నిర్మాణ వ్యతిరేక కార్యకర్తలు యిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జూన్ 22న, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లా యంత్రాంగం 12 గ్రామాల పంచాయతీ సభ్యులు, పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సియాంగ్ నదిపై ప్రతిపాదిత జలవిద్యుత్ ప్రాజెక్ట్ వల్ల గ్రామాలన్నీ ప్రభావితమవుతాయి, ఈ ప్రాంత నివాసితులు సంవత్సరాలుగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. టిబెట్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర ప్రధాన ఉపనది సియాంగ్. ఈ సమావేశం 10,000 మెగావాట్ల
సంస్మరణ

ఇలాంటి వారు నిర్మిస్తున్న విప్లవోద్యమం వెనకడుగు వేస్తుందా?

(దండకారణ్యంలో జరుగుతున్న మారణ హోమం గురించి ఆదివాసీ మహిళ కుమ్మే నాతో ఇలా సంభాషించడం మొదలు పెట్టింది. ఆమె మాటలు లోకమంతా వినాల్సినవి.  దండకారణ్యం గురించి, విప్లవోద్యమం గురించి, అందులో అమరులైన వీరుల గురించి నాకు చెప్పింది.  అందులో గొప్ప జీవితానుభవం ఉంది.  జ్ఞానం ఉంది. విప్లవాచరణ ఉంది. చాలా మామూలు జీవితం నుంచి వచ్చి విప్లవకారులై అమరులైన తీరు వివరించింది.  ఆమె ఏమంటున్నదో వినండి... ఓ కార్యకర్త) మేం ఆదివాసులం. అడవులే మా ప్రాణం. మా అడవులలో చాలా కాలంగా శాంతి కరువైంది. ఇపుడు ఎటు చూసినా మా అడవులలో ఖాకీలే దర్శనమిస్తున్నారు. ఎందుకో తెలియదు. అడవిలో