దండకారణ్యంలో మళ్లీ బాంబు మోతలు
విజయవాడ విరసం సభల్లో ఆట పాటలతో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, పోరాడి గెలవగలమనే విశ్వాసాన్ని అందించిన మూలవాసీ సాంస్కృతిక్ కళా మంచ్ సభ్యులు తమ గూడేలకు చేరుకున్న కాసేపటికే డ్రోన్ దాడులు మొదలయ్యాయి. ఈరోజు(జనవరి 30) మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీజాపూర్ జిల్లా ఒట్టిగూడ పక్కన పంట పొలాల్లో ఆకాశం నుంచి బాంబులు కురిశాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉధృతంగా డ్రోన్ హెలికాప్టర్ దాడులు జరిగాయి. ఇటీవల కొద్ది విరామం తర్వాత, ఎన్నికలు జరిగి బీజేపీ అఽధికారంలోకి వచ్చాక పైనిక చర్యలు తీవ్రమయ్యాయి. ఇవాళ జరిగిన దాడిని అందులో భాగంగానే చూడాలి. ఈ నెల 1వ తేదీ