‘వికసిత భారత్’ ఓ ప్రహసనం
భారతీయ జనతా పార్టీ 2014 పార్లమెంటరీ ఎన్నికల ప్రణాళికలో ‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’ అన్న నినాదం ఇచ్చింది. దానికి మార్గం ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అని ప్రజలకు హామీ ఇచ్చింది. అలాగే రాజకీయాల్లో ‘అచ్చేదిన్ ఆనే వాలేహై’ అనేది బిజెపి నినాదం. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో బిజెపి విడుదల చేసిన గంభీరమైన వాగ్దానాలను అమలుచేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. అన్ని వాగ్దానాల గాలి మాటలు గాలి మాటలుగానే మిగిలాయి. మోడీ అమలులోకి తెచ్చిన పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) భారతదేశ ఆర్థిక మూలాలను చిన్నాభిన్నం చేశాయి. మోడీ