అత్యంత దారుణమైన వార్తలు, భయానక, దిగ్భ్రాంతికరమైన న్యాయ నిర్ణయాలు, అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత, అధికారిక ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు, ప్రమాదాల తుఫాను మధ్య జనవరి 8, సోమవారం నాడు సుప్రీం కోర్టు నిర్ణయం చాలా వరకు ఉపశమనం కలిగించింది. కొంత వరకు భరోసానిస్తుంది.

జస్టిస్ బిబి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ 75వ స్వాతంత్య్ర  వార్షికోత్సవం సందర్భంగా మోడీ కేంద్ర , గుజరాత్ ప్రభుత్వాలు శాంతిభద్రతలతోనే కాకుండా మానవీయతకు చేసిన అత్యంత ఘోరమైన దుష్ప్రవర్తనను రద్దు చేసింది.

2002లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ మారణకాండ సందర్భంగా బిల్కిస్ బానో హత్యాకాండలో దోషులను నిర్దోషులుగా ప్రకటించిన డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని రద్దు చేసి – క్రూరత్వాన్ని కూడా సిగ్గుపడేలా చేసే కాండలో నిందితులందరినీ తిరిగి జైలుకు వెళ్లిపోవాలని సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

2002లో జరిగిన ఊచకోత సమయంలో, గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలోని రంధిక్‌పూర్ గ్రామానికి చెందిన బిల్కిస్, అల్లరి మూకలు  తమ ఇంటిపై కూడా దాడి చేస్తారని భయపడ్డ బిల్కిస్, మూడున్నరేళ్ల కుమార్తె సలేహాతో సహా మరో 15 మంది కుటుంబ సభ్యులతో కలిసి, సురక్షితమైన స్థలాన్ని కనుగొనడానికి బయలుదేరి, 2002 మార్చి 3, న బిల్కిస్ తన కుటుంబంతో చప్పర్వాడ్ గ్రామానికి చేరుకుంది. అయితే ఆ మూకలు ఇక్కడ కూడా విధ్వంసం సృష్టించాయి.

కుటుంబంతో కలిసి పొలాల్లో దాక్కున్న బిల్కిస్‌పై ఏకంగా 20-30 మంది దాడి చేశారు.  బిల్కిస్‌పై 12 మంది సామూహిక అత్యాచారం చేశారు, ఆమెతో పాటు ఆమె తల్లితో సహా కుటుంబంలోని మరో నలుగురు మహిళలను కూడా కొట్టి, అత్యాచారం చేశారు.  అంతటితో ఆగని ఆ మూక  బిల్కిస్ కుటుంబంలోని 7 మందిని చంపింది. ఆమె చిన్న కుమార్తెను నేలపైకి విసిరి చంపేసాయి.

భీభత్సాన్ని, క్రూరత్వాన్ని ఎదుర్కొంటూ, బిల్కిస్ మూడు గంటలపాటు అపస్మారక స్థితిలో ఉండి, ఒక హోంగార్డుతో కలిసి లిమ్‌ఖేడా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. దీని తర్వాత, సంవత్సరాల తరబడి నిరీక్షణ, సుప్రీంకోర్టు జోక్యం తర్వాత, మహారాష్ట్రలో విచారణ జరిగి 11 మంది నేరస్థులకు జీవిత ఖైదు పడింది.

జైలులో ఉన్నప్పుడు సత్ప్రవర్తన కారణంగా, గుజరాత్ ప్రభుత్వం వారిని 2022 ఆగస్టు 16 న విడుదల చేసింది. ఈ ఖైదీలను విడుదల చేసేందుకు మోదీ షా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది.

వాస్తవం ఏమిటంటే, ఈ విడుదలకు ముందే, మోడీ షా గుజరాత్ ప్రభుత్వం ఈ క్రూర నేరస్తుల పట్ల దయ చూపింది; జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులలో 10 మంది పెరోల్ సెలవు, తాత్కాలిక బెయిల్‌పై వెయ్యి రోజులకు పైగా బయట ఉన్నారు. 11వ దోషి 998 రోజులు జైలు నుంచి బయటవున్నాడు.

ఒక నిందితుడు, రమేష్ చందనా, పెరోల్‌, సెలవు పైన 1576 రోజులు బయట ఉన్నాడు. రమేష్ చందనా, (58 సం), దాదాపు నాలుగు సంవత్సరాలు బయట గడిపాడు. అదే సమయంలో, 2015 జనవరి- జూన్ మధ్య, 14 రోజుల సెలవులు 136 రోజులుగా మారాయి. జైలుకు తిరిగి రావడానికి 122 రోజులు ఆలస్యం అయింది.

58 ఏళ్ల రాజుభాయ్ సోనీ 1348 రోజులు సెలవులో ఉన్నారు. సెప్టెంబర్ 2013- జూలై 2014 మధ్య 197 రోజుల ఆలస్యం తర్వాత లొంగిపోయాడు. నాసిక్ జైలు నుండి 90 రోజుల పెరోల్ 287 రోజులు అయింది. ఈ దోషులలో పెద్దవాడు, 65 ఏళ్ల జస్వంత్ 1169 రోజులు బయట ఉన్నాడు. 2015లో నాసిక్ జైలులో 75 రోజులు ఆలస్యంగా లొంగిపోయాడు.

స్వల్పకాలిక శిక్షల కోసం, పెరోల్ సాధారణంగా గరిష్టంగా ఒక నెల వరకు మంజూరు చేస్తారు. అదే సమయంలో, దీర్ఘకాలిక శిక్ష విషయంలో, జైలులో నిర్ణీత కాలం గడిపిన తర్వాత గరిష్టంగా 14 రోజుల సెలవు ఇస్తారు. అటువంటి పరిస్థితిలో, ఈ దోషులు జైలు వెలుపల గడిపిన సమయం మూడేళ్ల కంటే ఎక్కువ. వారి సత్ప్రవర్తన అలాంటిది, ఈ పెరోల్ సమయంలో కూడా వారిలో ఒకరిపై అత్యాచారం కేసు నమోదైంది.

అయితే, ఆగస్ట్ 22న వీరిని విడుదల చేయడమంటే కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు నిస్సిగ్గుగా అత్యాచారం చేసినవారి పక్షాన నిలబడి నట్లయింది. ఇందుకు ప్రతిస్పందనగా రిటైర్డ్ ప్రొఫెసర్ రూప్‌రేఖా వర్మ, పూర్వ ఎంపీ సుభాషిణి అలీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మొహువా మోయిత్రా, స్వతంత్ర పాత్రికేయురాలు రేవతి లాల్‌లు క్షేత్రస్థాయి విచారణలతో పాటు అత్యాచార, హత్యా నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న నేరస్థుల విడుదలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు.

దీనిపై స్వయంగా బిల్కిస్ బానో కూడా అప్పీల్ చేశారు – సోమవారం ఇచ్చిన నిర్ణయం 11 రోజుల విచారణ తర్వాత అక్టోబర్‌లో నిర్ణయం కోసం రిజర్వ్ చేయబడింది.

ఈ నిర్ణయం కేవలం 11 మంది దోషుల శిక్షను పునరుద్ధరించడానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది అంతకు మించి, మోడీ ప్రభుత్వం పేరు చెప్పకుండానే రేపిస్టులను రక్షించే కుట్రలో గుజరాత్ ప్రభుత్వం భాగమని సూటిగా ఆరోపించింది.

ఈ క్రమంలో, “వారి విడుదల కోసం, గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా మోసం చేసింది” అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇది భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన చాలా స్పష్టమైన, కఠినమైన ముగింపు. ఇంతకు ముందు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత కఠినమైన భాషలో దోషిగా గుర్తించబడలేదు.

ఇప్పుడు ఈ ఉత్తర్వు తార్కిక ఫలితం ఒక్కటే సాధ్యమవుతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని మోసం చేసిన ప్రభుత్వ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాజీనామా చేయాలి.  రాజీనామా చేయడమే కాకుండా అతనిపై సరైన క్రిమినల్ కేసు పెట్టి శిక్షించాలి.

అయితే ప్రస్తుత పాలకులు ఇలా చేస్తారా? రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం, ఇంత దారుణమైన ఘటనలో నిందితుల పట్ల ప్రభుత్వం సానుభూతి చూపిందని, అందుకే వారిని రక్షించేందుకు, వారికి ఉపశమనం కల్పించేందుకు మోసం చేసేందుకు కూడా సిద్ధమైందన్న వాస్తవాన్ని నొక్కి చెబుతోంది.

ఇది ఊకదంపుడు కాదు – అమిత్ షా నేతృత్వంలోని గృహ మంత్రిత్వ శాఖ సహకారంతో ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన పని మాత్రమే కాదు; ఇది ఈ ఇద్దరి సిద్ధాంతాల అమలు కూడా.  అత్యాచారాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవాలనే పిలుపును వీరి ఆరాధ్యదైవం సావర్కర్ బహిరంగంగా యిచ్చాడు, వ్రాసాడు కూడా.

అత్యాచారాన్ని రాజకీయ ఆయుధంగా పరిగణించాలనే అసహ్యకరమైన ఆలోచనతో బీజేపీ, సంఘ్‌ల ఈ రాజకీయ బంధుత్వం సమకాలీన ప్రపంచంలో అరుదైన రాజకీయ జాతి, ఇది అత్యాచారాన్ని జాతీయవాదంతో ముడిపెట్టే చర్యను కూడా పూర్తి ఉత్సాహంతో చేసింది. కథువాలో అత్యాచారి, హంతకుడిని కాపాడేందుకు త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపి అందులో మంత్రులు, సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ నేతలు బహిరంగంగా పాల్గొనడం మరీ పాత విషయం కాదు.

ఈ సిగ్గులేనితనాన్ని అనేక ఇతర అత్యాచార కేసుల్లో కూడా ఉపయోగించారు. దీనితో పాటుగా, ఈ వంశ నియమాలు, నిబంధనలను కలిగి ఉన్న మనువాదాన్ని ఆచరణలో పెట్టడం కూడా వీరి పని. ఈ అత్యాచారులను విడుదల చేయాలని సిఫారసు చేసిన కమిటీ సభ్యుడు, బిజెపి ఎమ్మెల్యే తన ప్రకటనలో నేరస్థులు “బ్రాహ్మణులు, సంస్కారవంతులు” అని స్పష్టంగా పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు ఈ మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఎవరైనా భరోసా ఇవ్వలేకపోవడానికి ఇది ఖచ్చితంగా ఒక కారణం. ఎందుకంటే అనేక వ్యాఖ్యలు చేసినప్పటికీ, గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్రలో విధించిన శిక్షను రద్దు చేయడాన్ని కోర్టు నిర్ణయాన్ని రద్దు చేయడానికి ప్రాతిపదికగా పరిగణించింది.

అంటే ఈ నేరస్థులకు మహారాష్ట్ర ప్రభుత్వం వద్దకు వెళ్లే అవకాశం మిగిలి ఉంది – మహారాష్ట్రలో ఎవరి ప్రభుత్వం ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, బహుశా ఈ అవసరం కూడా రాక పోవచ్చు – ఎందుకంటే యిది వ్రాసే సమయానికి ఈ పదకొండు మందిలో  తొమ్మిది మంది ఇప్పటికే తప్పిపోయినట్లు వార్తలు వచ్చాయి; ఇప్పుడు, గుజరాత్ పోలీసులు వారి కోసం ఎంత నిజాయితీగా వెతుకుతారో – అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే!

Leave a Reply