అదాని-ఆర్‌ఎస్‌ఎస్: భారత ఆర్థిక వ్యవస్థ
మత, ఆర్థిక వ్యవస్థల సంబంధం మీద చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఏ సందేహం లేనిది ఆర్‌ఎస్‌ఎస్‌కే. “గురూజీ” చెప్పినట్లు తమది సాంస్కృతిక సంస్థ కదా..పిందూ మతాన్ని ఉద్ధరించే సంస్థ కదా.. అదాని గొడవ మనకెందుకులే అని ఆర్‌ఎస్‌ఎస్ అనుకోలేదు. ఈ దేశంలోని పేదల గురించి, వాళ్ల కష్ట నష్టాల గురించి ఏనాడూ పట్టించుకోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న అదాని ఆర్థికంగా 'నష్ట* పోతున్నాడని, ఆయన తరపున వకాల్తా తీసుకున్నది. అదాని గ్రూప్ ఆర్థిక సామ్రాజ్యం నేరాల పుట్ట అని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ అనే సంస్థ బైట పెట్టడగానే ఆర్‌ఎస్‌ఎస్ ముందుకు వచ్చింది.