యక్ష ప్రశ్నలు
నరేంద్ర భూపతికి చాలా అసహనంగా వుంది. అడవిని ఆక్రమించుకోడానికి గొడ్డళ్ళు పట్టుకొని వెళ్ళిన మంత్రివర్గ సహచరులు తిరిగి రాకుండా మాయమైపోతున్నారు. ఏం జరుగుతోందో ఆయనకి యెంత తల బద్దలుకొట్టుకున్నా అర్థం కావడం లేదు. తన సహోదర తుల్యులు అత్యంత ఆప్తులు అంతరంగ మిత్రులు కిచెన్ క్యాబినెట్ సభ్యులు రాత్రికి రాత్రి అదృశ్యమవడం ఆయన జీర్ణించుకోలేక పోతున్నాడు. విదేశీ కుట్రలన్నీ తన కనుసన్నల్లోనే నడుస్తున్నాయి కాబట్టి విదేశీ కుట్రకి ఆస్కారం లేదు. ఆంతరంగిక సమావేశ మందిరానికి రమ్మని రక్షణ సలహాదారుకి కబురంపాడు. విషయం అప్పటికే తెలుసుకున్న అతను తక్షణం ఆయన ముందు చేతులు కట్టుకొని వాలాడు. మిత్రదేశం ఇజ్రాయెల్ నుంచి










