దండకారణ్య సమయం

మన కాలపు భగత్‌సింగ్‌తో కలిసి నిలబడటం కష్టం

ఛత్తీస్‌గఢ్‌లో 29 మందిని చంపిన సందర్భం మొదటగా, బ్రిటీష్ సామ్రాజ్యం భారతదేశంలోని మెజారిటీ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని భగత్ సింగ్ నమ్మాడు. గుర్తుంచుకోండి, అందరూ కాదు –మెజారిటీ. బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి పెద్ద పాలులో భారతీయులు ప్రయోజనం పొందుతూండేవారు. వారికి మద్దతుగా వుండేవారు. వారే రాజులు-చక్రవర్తులు, భూస్వాములు-నవాబులు, బ్యూరోక్రాట్లు, న్యాయమూర్తులు, పోలీసులు, సైన్యం మొదలైనవారు . బ్రిటీష్ ఉన్నతాధికారులు (బ్యూరాక్రసీ), న్యాయమూర్తులలో అధిక భాగం భారతీయులే. సైన్యంలో మెజారిటీ భారతీయులు, పోలీసులలో భారతీయులు మాత్రమే ఉన్నారు. రెండవది, భగత్ సింగ్, అతని సహచరులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెకలించి పారేయాలని  నిర్ణయించుకున్నారు. శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ ఉద్యమాలతో కాదు,