కరువు నిజంగా పీడించేదెవరినో చెప్పిన కథ ‘కరువెవరికి’
అనంతపురం జిల్లా (రాయలసీమ) కరువు గురించి చాలా కథలే వచ్చుంటాయి.ప్రకృతి చేస్తున్న విధ్వంసాన్నో , ప్రకృతిని సాకుగా చూపిస్తూ రాజ్యపు, దాని యంత్రాంగపు వైఫల్యాలను ఎత్తిచూపుతూ, విషాదభరితమైన జీవితాలను చిత్రించిన కథలే అవన్నీ. ఒక కథలో సమాజంలోని ఒక స్తరాన్ని ( పొరను) చిత్రించడం ద్వారా సమాజాన్ని సాధారణీకరించడానికి ఆకథలన్నీ ప్రయత్నించివుంటాయి. అయితే ఒక నిర్ధిష్ట ప్రాంతంలో ' కరువు ' అనే అవ్యవస్థ ఎట్లా వుంటుంది.దాని ప్రభావానికి ఆ సమాజంలోని వివిధ సెక్షన్ల ప్రజలు ఎట్లా వున్నారు. ఎవరికి యేమేరకు కరువుశాకం తాకింది , లేదా ఆ వేడిని కూడా చలికాచుకోవడానికి వాడుకునే వెసులుబాటు ఎవరికుందీ ,