కాలమ్స్ లోచూపు

కుల గుట్టును రట్టు చేసిన కథలు

సుమారు మూడు దశాబ్దాల క్రితం  తెలుగునాట తలెత్తిన అస్తిత్వ ఉద్యమాలు వివిధ అస్తిత్వాల సమస్యలపై ప్రత్యేక అధ్యయనాలను ప్రేరేపించాయి. ఆయా సమస్యల మూలాలను పునఃపరిశోధించడం, సరికొత్త పరిష్కార మార్గాలను కనుగొనే ప్రయత్నాలూ  ముమ్మరమయ్యాయి. అలాగే వర్గపోరాట పద్ధతులను, ఫలితాలను పునఃసమీక్ష చేసుకునే చారిత్రక అనివార్యతను కూడా అవి సృష్టించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే- ఆయా సామాజిక అస్తిత్వ బృందాలు ‘తనలో తానుగా’ ఉన్న స్థితినుండి ‘తన కోసం తానైన’ స్థితి లోకి  మారడంగా ఆ అస్తిత్వవాద ఉద్యమాలను అభివర్ణించవచ్చు. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు, దళితవాద ఉద్యమం గాని దళితవాద సాహిత్యం గాని లేవనెత్తిన విషయాలన్నీ ఆహ్వానించదగ్గవే. సామాజిక వాస్తవికతలో
అంతర్జాతీయ చిత్ర సమీక్ష కాలమ్స్

పాలస్తీనా సత్యం : జెనిన్ జెనిన్

పాలస్తీనా భూభాగం లోని ‘జెనిన్’ అనే శరణార్థి శిబిరం మీద ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దారుణమైన దాడి గురించి, దాని పరిణామాల గురించి అరబిక్ భాషలో దృశ్యీకరించిన  డాక్యుమెంటరీ చిత్రం “జెనిన్ జెనిన్”.  దీని స్క్రిప్ట్ రచన, దర్శకత్వం మొహమ్మద్ బక్రీ నిర్వహించారు. ఈ చిత్ర నిడివి 54 నిమిషాలు. “జెనిన్, జెనిన్” అనే డాక్యుమెంటరీ చాలా విషాదకరమైన వినాశనకరమైన ‘జెనిన్ యుద్ధం’ గురించి దృశ్య మాధ్యమంలో హృదయ విదారకంగా  చిత్రీకరించబడింది. ఇది పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ లోని జెనిన్ శిబిరం ప్రజలతో పూర్తిగా దర్శకుడు జరిపిన ఇంటర్వ్యూల ద్వారా కథకుడు లేకుండా చెప్పడం చూస్తారు ప్రేక్షకులు. వివిధ
సాహిత్యం సంభాషణ

మనీష్ ఆజాద్ విమర్శకు కోబాడ్ గాంధీ స్పందన

 ఏప్రిల్ 19, 2021 ('ది కోరస్' లో కోబాడ్ గాంధీ పుస్తకం "ఫ్రాక్చర్డ్ ఫ్రీడం" పై విమర్శ రాసిన మనీష్ఆజాద్‌కు సమాధానాలు) పెట్టుబడిదారీ విధానం ప్రజల జీవితాలను, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగడం మంచిది. చర్చల ద్వారా మాత్రమే మనకు మరింత స్పష్టత వస్తుంది. కానీ దీనిని ప్రదర్శించే విధానం భారతీయ వామపక్షానికి విలక్షణమైనది, వీరిలో చాలామంది తమ స్వంత ఆచరణని (దాని ప్రాసంగికతను) విశ్లేషించుకోరు, కాని అసలు విషయం లేకుండా వ్యంగ్యంగా రాయడంలో ప్రవీణులు. మనీష్ ఆజాద్ ప్రశ్నలు మాత్రమే లేవనెత్తి, ఒక్క సమాధానం కూడా ఇవ్వలేదు, అతనికి
క్లాసిక్స్ ప‌రిచ‌యం

కుటుంబం – సొంత ఆస్తి – రాజ్యాంగ యంత్రం

(మార్క్సిస్టు సిద్ధాంత ర‌చ‌న‌ల్లో ఏంగెల్స్ రాసిన కుటుంబం, సొంత ఆస్తి, రాజ్యాంగ‌యంత్ర ఆవిర్భావం చాలా ముఖ్య‌మైన‌ది. చాలా తొలి రోజుల్లోనే ఈ పుస్త‌కం తెలుగులోకి వ‌చ్చింది. అనేక ప్ర‌చుర‌ణ‌లుగా వెలుబ‌డింది. వి. వెంక‌ట‌రావు వ‌సంత‌మేఘం కోసం దీన్ని స‌ర‌ళంగా ప‌రిచ‌యం చేస్తున్నారు.  ఈ సీరియ‌ల్   ఈ సంచిక‌తో ఆరంభ‌వుతున్న‌ది. వీలైతే ఇలా కొన్ని మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాల‌ను ప‌రిచ‌యం చేయాల‌ని అనుకుంటున్నాం- వ‌సంత‌మేఘం టీ)  ●  ఈనాడు   అమలులో వున్నకుటుంబ వ్యవస్థ గతంలో ఎలా ఉండేది? ఎప్పుడూ ఇలాగే ఉండేదా?మన సాంప్రదాయ వాదులు వాదిస్తున్నట్లు ఇది భారతదేశానికి మాత్రమే సొంతమా? బయట ప్రపంచంలో ఇతర దేశాల్లో కుటుంబ వ్యవస్థ ఎలా
సాహిత్యం వ్యాసాలు

ప్లేటో కవిత్వ ద్వేషకుడా?

ప్లేటో కవిత్వాన్ని-కవులను వ్యతిరేకించేవాడని మనకు గ్రీకు సాహిత్యంతో కొద్దోగొప్పో పరిచయమున్నా తెలిసే ఉంటుంది. నిజానికి ప్లేటో గ్రీకు తాత్త్విక అభివృద్ధికి బీజాలు వేసాడని మనం చెప్పుకుంటాము. అయితే హెగెల్ వంటి ప్రముఖ తాత్త్వికుడు పారమనిడ్స్ అనే తాత్త్వికుడి   పారమార్ధిక చింతన తత్త్వం మాత్రమే తత్త్వశాస్త్రం అనే శాఖ అభివృద్ధికి మూలమైనదని వివరించారు. ఏమైనా పారమనిడ్స్   ఈ పారమార్ధిక చింతన   జడత్వ సారం అలాగే జెనో యొక్క గతితార్కిక ప్రయోగాన్ని ప్లేటో సమన్వయించి తన తత్త్వశాస్త్రపు పద్ధతిని అభివృద్ధి పరిచాడు(మరికొంత మంది తాత్త్వికుల తత్త్వాలని సైతం సమన్వయం చేసాడు). పారమనిడ్స్ గతిని-చలనాన్ని కేవలం భ్రమ అని ఈ విశ్వం అనాది-అనంతం
సాహిత్యం సంభాషణ

‘భగ్నమైన స్వేచ్ఛ’: ఒక భగ్న భావజాలం

('Fractured Freedom': One Fractured Ideology ) (కోబ‌డ్‌గాంధీ జైలు ర‌చ‌న ఫ్రాక్చ‌ర్డ్ ఫ్రీడం. దీనిపై  మ‌నీష్ ఆజాద్  *ది కోర‌స్‌*లో స‌మీక్ష రాశారు. కోబ‌డ్ గాంధీ దానికి స్పందించారు. ఆయ‌న అభిప్రాయాల‌పై తిరిగి మ‌నీష్ ఆజాద్ రాశారు. ఈ మూడు ర‌చ‌న‌ల‌ను తెలుగు పాఠ‌కుల కోసం వ‌రుస‌గా ఇస్తున్నాం... వ‌సంత‌మేఘం టీం) కోబాడ్ గాంధీ జైలు డైరీ చదువుతున్నంతసేపూ,  ఆయన జీవన సహచరి అనురాధ గాంధీ ఈ పుస్తకాన్ని చదివి వుంటే కనక ఆమె  స్పందన ఎలా ఉండేది అనే భావన వెంటాడింది. ‘బీహార్-జార్ఖండ్‌లోని నక్సలైట్ ఉద్యమం ఈ రోజు మాఫియా ఉద్యమంగా మారిపోయింది, [ఆమె 12
సాహిత్యం కథలు

కవుడు అనునొక కాపటి

"దుర్గాకుమార్ హఠాన్మరణం" లెక్చరర్ ఫోరమ్ వాట్సాప్ గ్రూప్ మెసేజ్. "మా వాడేనా" ... లోపల....ఆందోళన.... అవునంటూ అరనిముషంలో .. మరో మెసేజ్ "మాథమాటిక్స్ లెక్చరర్ దుర్గాకుమార్ ఆర్.ఐ.పి"  ఉదయపు నిద్ర మత్తువదిలింది. ఏమై వుంటుంది? నెమ్మదిగా వాడి ఆలోచనలు కుప్పగూడుతున్నాయి నాకంటే పదిహేనేళ్లు చిన్నవాడు. యిప్పుడు నలభైఏళ్లు దాటివుండవు. ఫోటో...లు ..కూడా పెట్టారు లెక్చరర్స్ అసోసియేషన్ గ్రూపులో పిక్చర్ జూమ్ చేసి దగ్గరగా చూసాను.... అంబులెన్స్ లోపల నోరుతెరుచుకుని...పడుకున్న శవం… శరీరాన్ని కప్పుతూ స్ట్రేచర్ పై సగం వరకు దుప్పటి నా కంటి కొలకుల్లో దాగిన రెండే రెండు… బొట్లు టప్... టప్ ... మొబైల్ స్క్రీన్ పై
కాలమ్స్ ఆర్ధికం

సంప‌ద ఒక వైపు – ఆక‌లి మ‌రో వైపు

ఒకవైపు కరోనా విపత్తు, మరోవైపు ఆర్థిక సంక్షోభం... కారణాలేమైనా దేశంలో సగటు జీవుల‌ బతుకు ఆగమైంది. ఉపాధికి దూరమై, ఆదాయం లేక పస్తులుంటున్నారు. ఆకలి అనేది ప్రభుత్వాల దుష్టత్వానికి నిదర్శనం. ఆకలి సమస్యను పరిష్కరించే చర్యలకు పాలకులు పూనుకోకపోవడం విషాదం. ఆకలితోనో, పోషకాహార లోపంతోనో మరణించడానికి కారణం తగినన్ని ఆహారధాన్యాలు లేకపోవడం కాదు. ఏప్రిల్‌ 2021 నాటికి దేశంలో 564.22 లక్షల టన్నుల ఆహార నిల్వలున్నాయి. ఆకలితో ఉన్నవారికి ఆహార పదార్థాల్ని అందించలేని పాలకుల వైఫల్యం. సమాజ మనుగడకు  విరామ మెరుగక పరిశ్రమిస్తూ మానవజాతి పురోగమనానికి దారులు వేస్తున్న ప్ర‌జ‌ల  ఆకలి చావు కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం
కవిత్వం

ఎన్నెల కల

నడుస్తూ మాటాడుకుందాం నడకాగితే మాటాడలేను ఈ రాతి పలకల మీద  చెంగున దూకి జారే ఆ పిల్లల లేత పాదాలను తాకి మాటాడుకుందాం ఎన్నెన్ని ఎన్నెల రాత్రులలో వెలిగిన ఈ నెగడు చుట్టూ కలబోసుకున్న కథలలో ఎంత దుఃఖం దాగి వుందో మరొకసారి మాటాడుకుందాం ఎత్తైన ఈ పచ్చని కొండలపై పహరా కాస్తున్న మేఘాల నడుమ సెంట్రీ కాస్తున్న ఈ పిలగాళ్ళ చూపులను దొంగిలించే  ఆ తోడేళ్ళ ద్రోన్లను కూల్చే  వడిసెల కథ చెప్పుకుందాం  ఒకసారి సూరీడా సూరీడా  త్వరగా రారమ్మని  పిలిచే ఆ తల్లి  ప్రసవ వేదన  అరణ్యమంతా వినిపించే  గాధ కదా  రా అలా లేలేత
సాహిత్యం వ్యాసాలు

సృజనాత్మకత‌ను నిషేధించగలరా?

యాభై సంవత్స‌రాల నుండి విరసం వైభవంగా వెలుగుతోంది. ఐతే ఆ ప్రయాణం సాఫీగా లేదు.చాల కష్టాలొచ్చాయి.నిర్బంధాలు  పెరిగాయి. కాని విరసం స్థిరంగా నిలిచింది. ఈ నిషేధం మొదటిదీ చివరిదీ కాదు. అసలు సృజనాత్మక‌త‌ని ఎవరైనా నిషేధించగలరా? అసలు నిషేధించాల్సిన అవసరం ఉందా..? చరిత్రలోకి పొతే సాహిత్యం మీద నిషేధం రకరకాల రూపాల్లో అమలుపరిచారు. సెక్స్ గురించి, రాజ్యం గురించి వ్యతిరేకంగా గొంతు విప్పితే నిర్బంధం అమలు చేసారు. చార్వాక సాహిత్యాన్ని నాశనం చేసారు. దీనిలో బ్రాహ్మణిజం ముఖ్య పాత్ర వహించింది. దేశంలో ఫాసిజం ప్రజల గొంతుల మీద ఉక్కుపాదం మోపుతున్నది. అన్ని ప్రజాస్వామిక సంస్థలని నాశనం చేస్తున్నది. ఇది