వ్యాసాలు

జ్యోతిరావు పూలే, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ల పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం

మన దేశంలోని బ్రాహ్మణీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాలకు పునాదులు వేసిన సామాజిక విప్లవ కారుడు జ్యోతిరావు పూలే, పునాలోని గోవింద రావు- చిమ్నా బాయ్ దంపతులకు ఏప్రిల్ 11,1827 న జన్మించాడు. పూల ఉత్పత్తి, అమ్మకం చేయడం వల్ల ఆయన కుటుంబంలోని వారందరి పేరు చివర పూలే అని స్థిరపడింది. పూలే ఆనాటి బ్రిటిష్ ఇండియాలోని కుల భూస్వామ్య వ్యవస్థలో అమలు జరుగుతున్న అంటరానితనం, కుల మరియు లింగ వివక్ష, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థ నిర్మూలన కావాలని పోరాడారు. బాలికలు, మహిళల విద్యా హక్కుల కోసం, వితంతుల పునర్వివాహ హక్కు కోసం పోరాడారు.
కవిత్వం

నీళ్ళు, అడవి, భూమి…

(జల్, జంగల్, జమీన్) సర్కార్ చుట్టరికం ఇప్పుడు నదులతో లేదు, నక్శా లతో ఉన్నదిఅక్కడ నీళ్ళు ప్రవహించవుసత్యమని నమ్మించే పటం మీద గీసిన రేఖలతో ఉన్నది పర్వతాలు ఔన్నత్యంతో కాదుఖనిజాల నిధులుగా మారినవి ఆరావళీ ఛాతీ మీద నడుస్తున్న యంత్రం ఏదో ప్రాచీన శోక గీతం వలెధ్వనిస్తున్నది.కానిప్రజల బాంధవ్యం ఇంకా తెగిపోలేదు ఇప్పుడు కూడ ప్రజలునదిని అమ్మా అంటారు వృక్షాలతో సంభాషిస్తారు మట్టిని తమ నుదుటిమీదఅలంకారంగా దిద్దుకుంటారుప్రకృతిపై వాళ్ళ విశ్వాసం మూఢ విశ్వాసం కాదుఅది ఇతిహాసం అది ప్రతి ఎండాకాలం తర్వాత ఒక పత్రహరితమై తిరిగి వస్తుందినగరం మనల్ని నాగరీకుల్ని చేస్తుందని అంటారు ఎప్పటిదాకా మా ఊపిరితిత్తుల్లో అడవి
సంభాషణ

అరెస్టు చేస్తారనే భయంతో ఆసుపత్రికి వెళ్లని బాధిత సిజిమాలి ఆదివాసులు

2026 ఏప్రిల్ 12 కాశీపూర్ బ్లాక్‌లోని సిజిమాలి బాక్సైట్ గని కోసం వేదాంత అల్యూమినియం లిమిటెడ్ చేపట్టిన రోడ్డు నిర్మాణ కార్యక్రమం భారీ సంఖ్యలో పోలీసులు,  పరిపాలనా యంత్రాంగ అధికారుల సమక్షంలో జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగి వివాదం చెలరేగింది. మంగళవారం భారీ పోలీసు, పరిపాలనా యంత్రాంగ సిబ్బంది సమక్షంలో ప్రారంభమైన ఈ రోడ్డు నిర్మాణ పనులను గ్రామస్థులు వ్యతిరేకించడంతో పోలీసులకూ, వారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామస్థులు పోలీసుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారని ఆరోపణలు రావడంతో, పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని, కలెక్టర్ ప్రభావిత ప్రాంతానికి వెళ్లాడని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే, అధికారులు
తొలికెరటాలు

అంటరానితనమే ఓ కేస్

కులం భారతదేశంలో క్రీస్తు పూర్వం ఉంది క్రీస్తు తర్వాత కూడా ఉంది. అది ఇప్పటికీ సజీవంగానే ఉంది అయితే ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికనుగుణంగా రూపం మారుతూ ఉంది. ఒకప్పుడు బహిరంగంగానే చూపేవారు ఇప్పుడు చూపించకనే చూపిస్తున్నారు. వర్షం కురవని నేల ఉంది ఎండ పడని భూమి ఉంది కాకులు దూరని కారడవి ఉంది కానీ కులం లేని సమాజం లేదు. ప్రతి దగ్గర ఏదో విధంగా ఏదో రకంగా ఆధిపత్యం చూపిస్తూనే ఉంటారు. అగ్ర కులాలకు లోకులాలు, దళితులంటే గిట్టదు లోకులాలకు వారి కింద కులాలంటే పడదు. ఒకరి కింద ఒకరు అంటూ బాయిలో కప్పల్లా ఉంటున్నారు. కులాలు
ఇంటర్వ్యూ

From Armed Struggle in the forests to Struggle for Survival in a city

He spent ten and a half years in a Chhattisgarh jail! She spent twelve years! 38 unproven cases against him, 159 against her! Raghava Some people's lives are a source of wonder. They are filled with endless sorrow. They do not think about what tomorrow will bring. They do not live for themselves. They do not even fear for their lives. They simply do not care about the police, cases,
ఆర్థికం

ఆర్థిక సంక్షోభ దిశగా భారత్

భారత్ భయంకరమైన ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేస్తోందని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థలు బెర్న్‌స్టెయిన్, యుబిఎస్‌లు హెచ్చరిస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా సృష్టించిన యుద్ధం భారత్‌పై తీవ్ర ప్రతికూలతల‌ను చూపనున్నాయని వెల్లడించాయి. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే భారత్ 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తదనుగుణంగానే ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో దురాక్రమణ యుద్ధా లు, ఆర్థిక అస్థిరతలు, ఇంధన సంక్షోభాలు పెరుగుతున్న ఈ కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొం టున్న సవాళ్లు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా దేశ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్
కవిత్వం

చివరి వారెవరు?

అతడొక్కడేమిగిలి వున్నాడాఇంకెవరూ లేరనినీ ప్రకటన చూసిసముద్రం నవ్వుకుంటుందిజీవితం నీకు ఆగిపోవచ్చుఅక్కడనుండే మరలమేము మొదలవుతాంచరిత్ర నువ్వుతలకిందులుగా చదువుతావునీ చరిత్ర మట్టిలో కూరుకుపోయేకుళ్ళిన శవం మాత్రమేమేము చరిత్ర నిర్మాతలంమా పేజీలన్నీ నెత్తుటిరేఖలతో లిఖింప పడుతూచిరస్మరణీయమవుతాయిజనం ప్రభంజనమయ్యేరోజు మరల మొదలవుతోందిఅరణ్యం పచ్చగాచిగురిస్తోందినదులన్నీ ప్రవహిస్తూనే వున్నాయిపర్వత సానువలన్నీనిటారుగా నిలబడే వున్నాయిసూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడువెన్నెలా విరగబూస్తోందినువ్వనుకుంటావుఓడిపోయింది తల్లి పేగానిఆ చివరి విలుకాడు నుండిపెల్లుబికి వెళ్లువెత్తేయుద్ధ భేరీ నాదంనీ గుండెలను చీల్చుతుందికాలం మరల మరలతిరిగి తిరిగిముందుకే నడుస్తుందిఇదిసత్యం చెప్పిన మాటఅతడు తిరిగి కొండబారిడివరి కంకులలో గింజ కడుతున్నాడుచీకటి కొండల్లో దాచినబర్మారులో గంధకందట్టించి వస్తున్నాడుమహేంద్ర గిరులలోనుంచినియాంగిరి పర్వత సానువులనుండినలుదిక్కులా ప్రవహిస్తున్నారుఅతడుచివరి వాడూ కాదుఆమెచివరిదీ కాదుఇది ఓటమీ కాదునీది గెలుపూ
కవిత్వం

చీమలు

వాళ్లకు చీమలు సంఘటితంగావడం ఇష్టముండదు అవి రాజకీయాలమీద,సమాజం మీద మాట్లాడడమూ ఇష్టముండదు చీమలు పుట్టేది రాణిగారి గుడ్లనూ , ఆహారాన్నీమోయడానికేనని వాళ్ళ నిశ్చితాభిప్రాయం నిస్సందేహంగా చీమల ధిక్కార భాష అంటే వాళ్లకు పరమద్వేషం కాబట్టి చీమలు చేయి దాటి పోతున్నట్టనిపిస్తే వాళ్లు కాళ్ళ కింద తొక్కేస్తారు
కవిత్వం

నా పేరు ప్రతిఘటన!

విను! నాకు చదవడం వచ్చు! నేను రాస్తాను కూడా! నేను ఏ దుస్తులు ధరించాలో నాకు నేనుగా నిర్ణయించుకుంటాను! మీ అపహాస్యం , అరుపులు ,వెక్కిరింతల మధ్య నేను దృఢమైన సింధూర వృక్షంలా నిలబడతాను అదిగో స్కూలు బెల్లు మోగుతుంది వెళ్ళాలి!*నువ్వు ద్వేషాన్ని కక్కుతావు ! నేను బలాన్ని నాటుతాను ! నువ్వు గేట్లు మూసేస్తావు! నేను నా హక్కుల్ని గుంజుకుంటాను! చూడబోతే నీకు నా స్నేహితులు ఎవరో కూడా తెలియదులా ఉంది! *. నేను కళ్ళు మిరుమిట్లు గోలిపే కాంతిని! రక్తాలు కారుతున్నా నేను లేచి మళ్ళీ నిలబడతాను!నేను మరణించాక మళ్ళీ పుట్టే ఫీనిక్స్ పక్షిని కాదు
పత్రికా ప్రకటనలు

రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం

ఐఎమ్‌టి మనేసర్‌లో హర్యానా పోలీసులు అమలుచేసిన క్రూరమైన,  సమన్వయంతో కూడిన ప్రభుత్వ అణచివేతను  తీవ్రంగా ఖండిస్తున్నాం. 2026 ఏప్రిల్ ప్రారంభంలో, భారతదేశం అంతటా, ముఖ్యంగా ఇంధన రంగంలోనూ,  పారిశ్రామిక కేంద్రమైన ఐఎమ్‌టి మనేసర్ (హర్యానా) లోనూ ఆకస్మిక సమ్మెల వెల్లువ వ్యాపించింది. ఈ అశాంతికి ఐఎమ్‌టి మనేసర్‌లోని పరిస్థితి కేంద్ర బిందువుగా మారింది. హోండా, ముంజల్ షోవా, సత్యం ఆటో, రూప్ పాలిమర్స్, రిచికో గ్లోబల్, మోడలమా ఎక్స్‌పోర్ట్స్, రికో, సుప్రజిత్ ఇంజనీరింగ్, లాల్ సిర్మా ఎస్‌జిఎస్ వంటి అనేక ఫ్యాక్టరీలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు ఏప్రిల్ 2వ తేదీ నుండి సమన్వయంతో, వరుస సమ్మెలను ప్రారంభించారు. కార్మికుల