కవిత్వం

యు ఏ పి ఏ కాదు ఆజాదీ

తొంభై ఏడేళ్లే కాదుడెబ్భై తొమ్మిది ఏళ్ల క్రితం దాకా కూడజైలు కటకటాలు అడుగుతున్నాయిస్వాతంత్ర్యం ఎవరికి వచ్చింది? లాహోర్ చీకటి కొట్లలోజతిన్ దాస్ ఆకలిఇవ్వాళ కూడ జీవించే ఉన్నది ఆ ఆకలి లాదో సికాకా కళ్ళలో ఉన్నదిసురేంద్ర గాడ్లింగ్ ఎల్గార్‌లో ఉన్నదిరెజాజ్-షర్జీల్- ఉమర్ మౌనంలో ఉన్నదిఅబూబకర్ రాత్రుళ్ళలో ఉన్నదిహైసెక్యూరిటీ జైళ్లలోముస్లిం ఖైదీల అభద్రతలో ఉన్నది.సునీతా పొట్టమ్ స్వప్నాల్లో ఉన్నదిలింగరాజ్ ఆజాద్ పిలుపులో ఉన్నది జైలు ద్వారాల వెనుక బందీలైవిచారణ పేరిట శిక్ష అనుభవిస్తున్నవేలాది ఆదివాసీ గుండె చప్పుళ్లలో ఉన్నది అధికారం అనుకుంటుందిజైలులో స్వరం నిశ్శబ్దమౌతుందనిజైలు గోడలు శబ్దాన్ని ఆపజాలవుమరింతదూరం వరకు చేరవేస్తాయని శాసనానికెవరు చెప్పాలి ఈ షహీద్ (అమరత్వ) దినం
కవిత్వం

నీళ్ళు, అడవి, భూమి…

(జల్, జంగల్, జమీన్) సర్కార్ చుట్టరికం ఇప్పుడు నదులతో లేదు, నక్శా లతో ఉన్నదిఅక్కడ నీళ్ళు ప్రవహించవుసత్యమని నమ్మించే పటం మీద గీసిన రేఖలతో ఉన్నది పర్వతాలు ఔన్నత్యంతో కాదుఖనిజాల నిధులుగా మారినవి ఆరావళీ ఛాతీ మీద నడుస్తున్న యంత్రం ఏదో ప్రాచీన శోక గీతం వలెధ్వనిస్తున్నది.కానిప్రజల బాంధవ్యం ఇంకా తెగిపోలేదు ఇప్పుడు కూడ ప్రజలునదిని అమ్మా అంటారు వృక్షాలతో సంభాషిస్తారు మట్టిని తమ నుదుటిమీదఅలంకారంగా దిద్దుకుంటారుప్రకృతిపై వాళ్ళ విశ్వాసం మూఢ విశ్వాసం కాదుఅది ఇతిహాసం అది ప్రతి ఎండాకాలం తర్వాత ఒక పత్రహరితమై తిరిగి వస్తుందినగరం మనల్ని నాగరీకుల్ని చేస్తుందని అంటారు ఎప్పటిదాకా మా ఊపిరితిత్తుల్లో అడవి