గాథలు కావివి.. జీవితాలు
ఇటీవలకాలంలో ప్రగతిశీల ఉద్యమాల్లో ఉన్న కొంతమంది కవులు పద్యకావ్యాలతో అభ్యుదయకవిత్వాన్ని రాస్తున్నారు. ప్రజా సమస్యల్ని, ప్రజల బాధల్ని గాథల్ని కవిత్వంగా రాయడం ఈ మధ్య తెలుగుకవిత్వంలో సహజంగా చూస్తుంటాం. కానీ పద్యంలోనూ ఉద్యమాలను రాయడం ఆరదు. అయితే ఈ పద్యకావ్యాలు ప్రాచుర్యంలోకి పెద్దగా రావడం లేదు. వారు ఎక్కడికక్కడే రాసి పుస్తకాలను ముద్రించుకుంటున్నారు. ఏ జిల్లాకాజిల్లాకే వాళ్ళు పరిమితమవుతున్నా, ప్రపంచాన్నంతా కవిత్వంగా రాస్తున్నారు. ఆ కోవలోకి చెందిన కవి కర్నూలులో కనిపించారు. ఆయన రాసేవన్నీ పద్యాలే. అవి కారల్ మార్క్స్, లెనిన్, చెగువేరా..ఇలా మహనీయుల గూర్చి, ప్రజా ఉద్యమాల గూర్చి, సమస్యలగూర్చి రాస్తుంటారు. వాటిని పద్యాల్లో పరిచయం చేస్తుంటారు.