తేదీ: 12.05.2026

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ఈ రోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలిక తనపై బండి సాయి భగీరథ్ లైంగిక అత్యాచారం చేశాడని, గత నాలుగు నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వస్తే, గంటల తరబడి స్టేషన్లో నిలబెట్టి దోషులకు సమాచారం ఇవ్వడాన్ని తప్పుబట్టారు.

మైనర్ బాలికపై అత్యాచారం పోక్సో చట్టం ప్రకారం వెంటనే చర్య తీసుకోవాల్సింది పోయి, దోషులకు సమాచారం ఇచ్చి బాధితురాలిపైనే కేసులు పెట్టడం పోలీసు అధికారులు బాధితుల పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నారో తెలియజేస్తున్నది. ఇది పోలీస్ అధికారులు రాజకీయ నాయకులకు, బడా బాబులకు గులాంగిరి చేయడమే అన్నారు.

అసలు ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఏమాత్రం ముందుకు రాలేదన్నారు. నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరిపించాల్సింది వదిలి, బాధితురాలి తల్లి ప్రధానమంత్రి మోడీ మీటింగులో ఆత్మహత్య చేసుకుంటావని బెదిరిస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం. నిందితుడిని అరెస్టు చేయడంలో అలసత్వం కేసును నీరుగార్చడంలో భాగమేనని అన్నారు.

17 సంవత్సరాల అమ్మాయిపైన హనీ ట్రాప్ కేసు పెట్టడం చట్ట విరుద్ధమని అన్నారు. మేజర్ అయిన నిందితుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం. తానే యాభై వేలు ఇచ్చానని చెప్పుకోవడం ఇవన్నీ తనకున్న రాజకీయ పలుకుండితో పెద్ద అండదండలతో అధికార దుర్వినియోగమేనని, ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించి ‘మహిళా రక్షణ’, ‘బేటీ బచావో’ వంటివి ఆచరణలో చూపించాలని మహిళా నాయకులు డిమాండ్ చేశారు.

ఈ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దోషులను శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. నిందితులు రాజకీయ పలుకుబడి కలిగినవారు అయినప్పుడు, బాధితురాలికి ఆమె కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, తక్షణమే వారికి రక్షణ కల్పించాలని కోరాడు.

ఈ కార్యక్రమంలో POW జాతీయ నాయకులు వి. సంధ్య, జి. ఝాన్సీ పాల్గొని మాట్లాPOW అధ్యక్షులు స్వరూప, అనసూయ, AIDWA నాయకులు మల్లు లక్ష్మి, MW కార్యదర్శి జ్యోతి, CMS అధ్యక్షురాలు జ్యోతి తదితరులు మాట్లాడారు.

Leave a Reply