ఎల్ నినో అంటే సహజంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం, చల్లబడడం. ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి లేదా ఏడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ. దీని వలన 2020- 24 సంవత్సరంలో భారతదేశ ప్రజలు ఉష్ణోగ్రతలతో ఎప్పుడూ లేనంతగా బాధపడ్డారు. దీని ప్రభావం కొన్ని నెలలు ఎక్కువగా ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో వ్యాపార పవనాలు ఇవి, భూమధ్యరేఖ వైపు ఏడాది పొడవునా ఒకే దిశలో క్రమం తప్పకుండా వీచే శాశ్వతమైన గాలులు. ఇవి బలహీన పడినప్పుడు లేదా వ్యతిరేక దిశలో వీచినప్పుడు సముద్ర ఉపరితలం వేడెక్కి, మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రం వైపు వీస్తాయి. దీనివలన సముద్ర వాతావరణంలో తీవ్రమైన మార్పులు ఏర్పడి భూమిపై వాతావరణంలోనూ మార్పులు వస్తాయి.
మనకు సహజంగా కలిగే అనుమానం ఏంటంటే, ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం వేడెక్కితే మనకు ఎందుకు రుతుపవనాలు సరైన సమయంలో రావు? ఉష్ణోగ్రతలు పెరుగుతాయి? అని అనిపించవచ్చు. పసిఫిక్ మహాసముద్రం భూమి ఉపరితలంలో మూడింట ఒక వంతును ఆక్రమించి ఉంది . ఇది ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ ను నడిపిస్తుంది. ఇది ప్రతి ఖండంలో వర్షపాతం ఉష్ణోగ్రత తుఫానుల సరళిని ప్రభావితం చేస్తుంది. పసిఫిక్ జలాలు అసాధారణంగా వేడెక్కినప్పుడు భారతదేశం, సహారా, ఆడ్రికాను పట్టివేధిస్తుంది. ఇదే సమయంలో పెరు, ఈక్విడార్ లను వరదలు నాశనం చేస్తాయి. అవి చల్లబడినప్పుడు రుతుపవనాలు తీవ్రమై తరచుగా దక్షిణ, ఆగ్నేయాసియా అంతటా వినాశకరమైన వరదలను తెస్తాయి.
సముద్ర వడగాలులు ఎక్కువ కాలం కొనసాగుతున్నాయి. కారణం గ్లోబల్ వార్మింగ్. దీని వలన పవనాలు మరింత తీవ్రంగా దిశను మార్చుకుంటున్నాయి. ఈ పసిఫిక్ మహాసముద్రం ఒడ్డుని అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. ఈ దేశాల నుంచి వచ్చే గ్రీన్ హౌస్ వాయువుల వల్లనే భూమి ఉపరితల వేడికి సముద్ర ఉపరితలంలో వేడి పెరుగుతుంది. భారతదేశం తాగు సాగు అవసరాలకు ప్రధాన జీవనాధారం నైరుతి రుతుపవనాలు. 80 శాతం వర్షపాతం ఈ రుతుపవనాల ద్వారానే వస్తుంది. జూన్ నుండి సెప్టెంబరు నెలలలో కేరళలో ప్రవేశించి దేశమంతటా ఇవి విస్తరిస్తాయి.
ఎల్ నినో వలన ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగి దాని వలన వడగాలులు భారతదేశం మొత్తం వీస్తాయి. ఈ ఉష్ణోగ్రత వలన వడదెబ్బలు మరణాలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఒకవైపు, మరొకవైపు కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం తగ్గుతుంది. ఉదాహరణకు అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ ఉంటే, అత్యల్ప ఉష్ణోగ్రత రాత్రివేళలో 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. దీనివలన పల్లెల్లో పని చేసే వ్యవసాయ కార్మికులు, పనికి ఆహార పథకంలో పనిచేసే కార్మికులు, నగరాలలో చిన్న చిన్న తోపుడుబండ్ల వ్యాపారులు, గృహ నిర్మాణ కార్మికులు, గిగ్ వర్కర్స్ వీరంతా హాట్ స్ట్రెస్ బాధితులు అవుతారు. గ్రామీణ ప్రాంతాలలో బలహీనమైన , అసందర్భమైన రుతుపవనాలు సెప్టెంబర్ వరకు కొనసాగే ప్రమాదం ఉంది. అత్యల్ప వర్షపాతం వలన నేల తేమ దెబ్బతింటుంది. పొడి వాతావరణం ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్. 1.55°c బలమైన ఎల్ నినో. 2027 లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ప్రమాదం ఉంది.
జూన్ నెలలో 40 శాతం బిలో నార్మల్ వర్షపాతం. ఇది 1901 నుంచి గమనిస్తే ఈ జూన్ 26, 5వ సారి పొడి వాతావరణపు నెల. జూలై మొదటి వారంలో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. వాతావరణ మార్పు ఒకరోజులో జరగలేదు. పర్యావరణానికి అనుకూలంగా లేని వ్యవసాయం 50 ఏళ్లుగాIMD చేసిన రీసెర్చ్ 1°సెంటీగ్రేడ్. ఉష్ణోగ్రత పెరిగితే 8 శాతం పంట దిగుబడి తగ్గుతుంది. ఎల్ నినో ప్రభావం అధిక ఉష్ణోగ్రతల వలన ఆహార ఉత్పత్తి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. Icrisat 50 ఏళ్ల డాటా తీసుకొని శాస్త్రీయంగా విశ్లేషించారు. 1°సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే జొన్న 14%, వేరుశెనగ 9%, సజ్జలు 10%, పత్తి, వరి 11 శాతం, దిగుబడి తగ్గింది. భారతదేశ వరిలో పోషకాలు లేవు.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వలన సముద్రంలో సమతుల్యత సముద్ర జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు చల్లటి ప్రాంతాలకు వలసలు పోతాయి. వాటిపై ఆధారపడిన వారి జీవనం దెబ్బతింటుంది. సముద్ర వాతావరణ మార్పుల వలన తుఫానులు వరదలు వస్తాయి.
ఎల్ నినో సహజ పరిణామం. మానవజాతి దీనిని కంట్రోల్ చేయలేదు కానీ ప్రివెంట్ చేయొచ్చు. దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు. ముందస్తు సమాచారంతో , సరియైన సంసిద్ధత ప్రణాళికలతో, అభివృద్ధి చెందిన వాతావరణ శాస్త్ర సహాయంతో, పాలకుల నిబద్ధతతో నీటి యాజమాన్యం, విపత్తుల నివారణ వ్యవస్థ, మొక్కలు చెట్లు పెంచడం, పునర్ వనీకరణ, అడవుల పెంపకం కర్బన ఉద్గారాలను తగ్గించడం వంటి చర్యలతో కొంత గ్లోబల్ వాతావరణ పరిస్థితిని నియంత్రించవచ్చు. విస్తృతంగా చెట్ల పెంపకంతో స్థానిక వాతావరణాన్ని బ్యాలెన్స్ చేయవచ్చు. ఉష్ణోగ్రత పెరగకుండా కాపాడవచ్చు. చెట్లు వర్షపు నీరు భూమిలో ఇంక దానికి సహకరిస్తాయి. భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. వృక్షాల వేర్లు నేలకోతను అరికడుతాయి. భూసారం కాపాడు బడుతుంది ఇది చాలా ముఖ్యం.
అధిక వర్షపాత సమయంలో గత పది సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు రిపోర్టు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తెలుగు రాష్ట్రాలు పట్టించుకోవడం లేదు. ఒక అంచనా ప్రకారం ఎల్ నినో వచ్చినప్పుడు మనిషి ఆయువులో 0.5 సంవత్సరాలు తగ్గుతుంది. ఇది 1982 -83ఎల్ నినో లో, 97 -98 లో 0.4 సంవత్సరాలు, 2100 వరకు వచ్చే ఎల్ నినో లతో రెండు సంవత్సరాల 8 నెలలు సగటు మనిషి ఆయుష్షు తగ్గుతుంది. ఈ ప్రభావం మధ్య వయస్సు వారి పైన ఎక్కువగా ఉంటుంది.
ప్రభుత్వాల విధానాలు:
కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల లో అంటే 2014 నుండి 2026 వరకు 2,15,943 హెక్టార్ల అటవీ భూములను మైనింగ్ హైడ్రోపవర్ ఇరిగేషన్, రోడ్డు ప్రాజెక్టులకు అడవులను ధ్వంసం చేసింది.
2014-15 నుండి 18-19… 74705.68 హెక్టార్లు,
2019-20 నుండి 23 -24… 96,112.90 హెక్టార్లు,
2024-25 నుండి 25-26… 45124.64 హెక్టార్లు ,
ఇది స్వయానా కీర్తి వర్ధన్ సింగ్ కేంద్రమంత్రి , (స్టేట్ ర్యాక్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్) జూలై 26 లో పార్లమెంటులో చెప్పిన విషయం.
భూతాపం 0.2°¢ ఉష్ణోగ్రత దశాబ్దానికి పెరిగేది 1970 నుండి 2015 వరకు భూతాపం గత దశాబ్దంలో 0. 27 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. ప్రధానంగా భారతదేశంలో అడవులను ధ్వంసం చేయడం వలన మహాబలేశ్వర్ లో 1000 మిల్లీమీటర్ల వర్షం 48 గంటలలో కురిసింది. గుజరాత్ ఉమర్గాంలో 1064 మిల్లీమీటర్ల వర్షం 24 గంటలలో నమోదయింది.
రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వస్తే చేతులు కాలినాక ఆకులు పట్టుకునే చందంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పశుసంపద ప్రధానమైంది. కానీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి ముందస్తు చర్యలు లేవు. సూపర్ ఎల్ నినో రాబోతున్నది. ప్రస్తుతం రసాయన ఎరువుల వలన పండే పంటలకు సబ్సిడీ ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ గురించి కేంద్రం రాష్ట్రాలు ఎన్నో ప్రణాళికలు చేస్తున్నవి. క్షేత్రస్థాయిలో ఎవరైనా స్పందించినా ఆదుకునే దిక్కు లేదు. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు లేవు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా రాష్ట్రాలలో వరి అత్యధికంగా పండుతుంది అని గొప్పలు చెప్పుకుంటారు. ఇదీ పరిస్థితి. ఈ సంవత్సరం 35% దిగుబడి తగ్గిపోతుంది. ఆహార కొరత ఏర్పడే పరిస్థితి ఉంది.
ప్రభుత్వాలు తీసుకోవలసిన ముందస్తు చర్యలు:
వేడిని తట్టుకునే విత్తనాలను రైతులకు అందజేయాలి. రైతుకు పెట్టుబడి సహాయం చేయాలి. పంటల మార్పిడిని ప్రోత్సహించాలి. పండించిన పంటను కాపాడుకోవడానికి గోదాములను ఏర్పాటు చేయాలి. వచ్చే ఎండలను తట్టుకోవడానికి రాగులు జొన్నలు సద్దలు పండించాలి. ఈ పంటలను ప్రోత్సహించాలి. సరైన సమయంలో విత్తనాలు నాటడానికి రైతులను అప్రమత్తం చేయాలి. తక్కువ కాలంలో వచ్చే పంటలను ప్రోత్సహించాలి.
రిజర్వాయర్లను సమర్థవంతంగా పర్యవేక్షించాలి నీటి కొరతను కాపాడాలి అనుకోకుండా వచ్చే భారీ వర్షాల వలన వచ్చే నీటిని నిలువ చేసుకోవాలి. ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయాలి. అలాగే హీట్ యాక్షన్ ప్లాన్ , విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా, వేసవికి ముందే డిమాండ్ కూలింగ్ అవసరాలను తీర్చే విధంగా ఉండాలి.
పారామెట్రిక్ ఇన్సూరెన్స్:
పేదవాళ్లకు, వ్యవసాయ కార్మికులకు, తోపుడు బండి వ్యాపారులకు, వీధి వ్యాపారులకు, 40°¢ పెరిగితే బయటకు వెళ్లి పని చేసుకోలేని పరిస్థితిలో కోల్పోయిన పనికి కాంపెన్సేషన్ వస్తుంది. దీనిని తక్షణమే రెండు తెలుగు రాష్ట్రాలలో అమలు చేయాలి. బస్ స్టాప్ లలో మిస్ట్ వ్యవస్థ పెట్టాలి. ఈ వ్యవస్థ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలలో ఉంది.
ఖరగ్ పూర్ ఐఐటి వారు కూలింగ్ తోపుడు బండిని తయారు చేశారు. కరెంటు అవసరం లేకుండా సోలార్ బ్యాటరీ తో నడుస్తుంది. కూల్ జాకెట్ వేసుకుంటే 7°నుండి 10°వరకు తక్కువ ఫీల్ అవుతారు. ఈ జాకెట్లలో చిప్ పెట్టారు. శరీరంలో మార్పుల ద్వారా మెసేజ్ పెట్టడం ఇలాంటివన్నీ తెలుగు రాష్ట్రాలు ప్రారంభించాలి. దీనివలన రేపటి తరాన్ని కాపాడుకోగలం.




