కాలమ్స్ కథా తెలంగాణ

‘ఎర్రదుక్కి’లో పాలమూరు వలస దు:ఖం

సమాజంతో సంబంధం కలిగిన రచయితలు మాత్రమే తమ సాహిత్య సృజనలోకి సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా ఎంపిక చేసుకొని ప్రజల్ని ఆలోచింపచేస్తారు. సామాజిక బాధ్యత, నిబద్దత కలిగిన రచయిత అట్టడుగు శ్రామిక వర్గాలవైపు నిలబడి అక్షరీకరిస్తాడు. ఇలాంటి కోవకు చెందినవారే  నాగర్‍కర్నూల్‍ జిల్లా అచ్చంపేటకు చెందిన రచయిత మడుమనుకల నారాయణ. పాలమూరు అధ్యయన వేదికలో సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న నారాయణ వేదిక ద్వారా పొందిన సామాజిక జ్ఞానంతో కవిత్వం, పాటలు, కథల ద్వారా సాహిత్య సృజనతో సామాజిక చలనాలను ఆవిష్కరించారు. రచయితగా తన అనుభవాలను, తన చుట్టు జరుగుతున్న పరిణామాలను సమాజంతో పంచుకోవడానికి నారాయణ కథా పక్రియను ఎంచుకున్నారు. ‘ఎర్రదుక్కి’
కాలమ్స్ కథా తెలంగాణ

*ఊడలమర్రి*లో విధ్వంస మూలాలు

సాహిత్యం ద్వారా సరికొత్త ప్రభావవంతమైన ఆలోచనల్ని పోగుచేసుకోవ‌డం ఇలాంటి  కథల ద్వారనే సాధ్యం అవుతుంది.పాఠకులను ఎదురుగా కూర్చొబెట్టుకుని ఉపాధ్యాయుని మాదిరిగా అద్బుతమైన ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తోంది. ప్రత్యక్షంగా తీర్పులు, పంచాయతీలు, పరిష్కారాలు పాఠకుడికి అవసరం అనిపించడంలేదు. కథను చదువుతున్న పాఠకుడి మనో అంతరంగంలో ఒక చిన్న అలజడిని, అల్లకల్లోల్లాన్ని సృష్టించినా రచయిత లక్ష్యం నెరవేర్చినట్లుగానే భావించాలి. ఈ దృక్పథంలో పరిశీలించినపుడు పి. చిన్నయ్య గారి కథలు అదే బలమైన ప్రభావాలను పాఠకుడి మనుసుపై తనదైన ముద్రను వేయడంలో 'ఊడలమర్రి' కథలకు ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. రచయిత, పాఠకుడికి ఏ మాత్రం విసుగు కల్పించకుండా