Stories

The Sword & The Shield

The encirclement of the CRPF forces by the PLGA was almost complete. A part of the enemy force that entered in their hundreds has been separated from the main contingent with ruse by the guerillas and a siege was laid. The CRPF commandant who had earlier had a taste of a PLGA attack had his doubts when the guerillas started retreating on one side. He felt it may be a
కవిత్వం

షహీద్ మంగ్లీ కోసం

గజ్జెలు లేకుండా కూడ నీ పాదాలు ఎంత భంగిమలో ఉన్నాయి ఈ పాదాల్లో కొంచెం కొంచెం దుమ్ము పట్టి ఉన్నది ధూళి అనగానే గుర్తుకొచ్చింది నువ్వు నీ ‘యోయో’ (అమ్మమ్మ) ఒళ్లోకి వట్టికాళ్లతోనే గోముతో పరుగెత్తాలనుకోవడం కూడ ప్రేమనే మట్టితో సూటిగా మాట్లాడుతూ నీ కాళ్లు పాదాలు రేలా స్వరంలోకి తర్వాత ఎగుస్తాయి మొదట నీ పాదాలను ఈ మట్టి రమ్మని పిలుస్తుంది నువ్వూ నీ పాదాలు రెండూ ఎంత శాంతంగా ఎంత ప్రకాశిస్తూ, ఎంత నిష్కళంకంగా కనిపిస్తున్నారు నీ గోళ్లు చాల విచారంగా కనిపిస్తున్నాయి నీ అమ్మ దగ్గర నెయిల్కట్టర్ లేదు నువ్వీ పాదాలతో కొంచెం దూరం
పత్రికా ప్రకటనలు

పోరాడుతున్న రైతులకు అండగా నిలబడదాం!!

2022లో ఏడాదిపాటు సాగిన రైతుల సమ్మె యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చింది. అన్ని దురభిమానాలను, అధికార దురహంకారాలను ఓడించి ఆ పోరాటం విజయవంతంగా ముగిసింది. రైతులు లేవనెత్తిన డిమాండ్లను అంగీకరిస్తూ ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించింది. 1) తుది విశ్లేషణలో దేశానికే హాని కలిగించే మూడు రైతు చట్టాల ఉపసంహరణ 2) ఎమ్.ఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన కనీస మద్దతు ధర అమలు 3) సమ్మె సంబంధిత కేసులు ఉపసంహరణ 4) సమ్మెలో మరణించిన వారి కుటుంబాలకు తగిన పరిహారం 5) వ్యవసాయ రుణాల మాఫీ 6) విద్యుత్ బిల్లులను తగ్గింపు - అమలు చేస్తామని ప్రభుత్వం హామీ
కవిత్వం

రైతు దృశ్యమే నాకు కనబడుతుంది

వాడు దేశాన్ని ఒక మూసలో నెట్టుతుంటే కావడి పట్టుకొని అన్నదాత ఆందోళన చేస్తున్నాడు మద్దత్తు ధర కోసమో, పంటల రక్షణ కోసం మాత్రమే కాదు ఫాసిజం ఎంత వెర్రి తలలు వేసిందో దేశ రాజధాని నలుదిక్కుల చుట్టూ ముట్టిన రైతు చాటి చెపుతున్నాడు వాడు అయ్యోధ్యా రామమందిరం అంటూ దేశ ప్రజల మేదల్లో మూడవిశ్వాసాన్ని నింపి దేశాన్ని మతం పేర ముక్కలు చెయ్య చూస్తున్న చోట దేశమే తమ ఇల్లు అంటూ అన్నదాతల ఆందోళన చూడమంటాను వాడు ప్రశ్నను ఎదుర్కోనలేక ధర్నాలను, రాస్తారోకాలను అడ్డుకొనడానికి అక్రమంగా కుట్ర కేసులు,NIA దాడులను ఉసిగొల్పుతున్న కాడా నిటారుగా నిలబడి నాగలి కర్రును
పత్రికా ప్రకటనలు

తొలి తరం విప్లవ రచయితశ్రీపతికి నివాళి

ప్రముఖ కథా రచయిత శ్రీపతి(పుల్లట చలపతి) ఫిబ్రవరి 7వ తేదీ హైదరాబాదులో మరణించారు. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం భైరిపురం. హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత ఢల్లీిలో ఆలిండియా రేడియో న్యూస్‌ రీడర్‌గా పని చేసి తిరిగి హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు. ఆయన కథా రచనలోకి ప్రవేశించాక కొద్ది కాలానికి శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం ఆరంభమైంది. ఆ పోరాటానికి ప్రతిస్పందించిన తొలి తరం విప్లవ రచయితల్లో, బుద్ధిజీవుల్లో శ్రీపతి ఒకరు. శ్రీకాకుళ పోరాట నాయకులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంతో, సుబ్బారావు పాణిగ్రాహితో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఉండేది. అందువల్ల కూడా ఆ పోరాట
వ్యాసాలు

రాజ్యాంగం – హక్కులు

(రాజ్యాంగవాదం గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో పాఠకుల అవగాహన కోసం ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం. పౌరహక్కుల ఉద్యమ నాయకుడు, న్యాయశాస్త్ర ఆచార్యుడు ప్రొ. శేషయ్య 2008వ సంవత్సరంలో ప్రొద్దుటూరులో ప్రైవేట్‌ టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ మిత్రుల కోసం చెప్పిన పాఠం ఇది. ఈ వ్యాసం ఆయన మరణానంతరం పౌరహక్కుల సంఘం ప్రచురిస్తున్న ప్రొ. శేషయ్య రచనా సర్వస్వం-1లో అచ్చయింది) రాజ్యాంగం ప్రాథమికంగా అధికారం గురించి మాట్లాడుతుంది. మన భారతదేశంలో అధ్యక్ష తరహా పాలన కాకుండా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పార్లమెంటులోని రెండు సభలు, రాష్ట్రపతి కలిపి ఒక నిర్మాణం వుంటుంది. అది పని చేయాలంటే
పత్రికా ప్రకటనలు

కేంద్రంలోని బిజెపి కార్పొరేట్‌ విధానాలను ప్రశ్నిస్తున్న రైతాంగ ఉద్యమానికి జేజేలు, ఢల్లీ రైతాంగ ఉద్యమంపై ఫాసిస్టు నిర్బంధాన్ని ఖండిద్దాం

భారతదేశ చరిత్రలో ఎన్నదగిన ఢిల్లీ రైతాంగ పోరాటం మరోసారి ప్రజ్వరిల్లింది. రెండేళ్ల కింద ప్రధానంగా పంజాబ్‌, హర్యాణా ప్రాంతాల నుంచి ఢిల్లీని చుట్టుముట్టి ఏడాది పాటు  పోరాడినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ పరిష్కారం కాలేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ  చట్టాలను రద్దు చేయాలని ఆ రోజు ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమ ఒత్తిడికి నరేంద్రమోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ ఉద్యమంలో వచ్చిన ఇతర ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇంత వరకు వాటి ఊసే లేకుండా సాధారణ ఎన్నికలకు ప్రభుత్వం
పత్రికా ప్రకటనలు

నాస్తికోద్యమ నేత జయగోపాల్‌కు నివాళి

ప్రముఖ నాస్తికోద్యమ నేత డాక్టర్‌ జయగోపాల్‌ ఫిబ్రవరి 7న విశాఖపట్నంలో మరణించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా నాస్తికోద్యమ నిర్మాణానికి ఆయన జీవితమంతా కృషి చేశారు. 1972లో ఆయన భారత నాస్తిక సమాజాన్ని స్థాపించి దాన్ని నిర్మాణాన్ని దేశమంతా విస్తరింపజేశారు. భానాసను ఒక ఉద్యమ సంస్థగా, ప్రజా చైతన్య వేదికగా మలచడానికి జయగోపాల్‌ భావజాల, సాంస్కృతిక రంగాల్లో తీవ్రమైన కృషి చేశారు. నాస్తికవాదాన్ని ఒక సామాజికవాదంగా, హక్కుల వాదంగా కూడా ఆయన తీర్చిదిద్దారు. ఆస్తికత్వాన్ని భారతీయ సామాజిక, సాంస్కృతికరంగాల్లో ఆధిపత్యశక్తిగా గుర్తించిన ఉద్యమకారుడు ఆయన.             భారత నాగరికతలో కులం, మతం, మూఢాచారాలు ప్రజల చైతన్యాన్ని ఆడ్డుకొని
పత్రికా ప్రకటనలు

కవి, కార్యకర్త, విప్లవాభిమాని నల్లెల రాజయ్యకు నివాళి

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ కవి, ఉపాధ్యాయుడు నల్లెల రాజయ్య ఫిబ్రవరి 15 గురువారం ఉదయం హైదరాబాదులోని కిమ్స్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రలో ఉన్నారు. గుండెపోటుతో తుదిశ్వాస వదిలారు. వరంగల్‌కు చెందిన నల్లెల రాజయ్య కవిగా, పలు సాహిత్య సంస్థల బాధ్యుడిగా సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో వరంగల్‌ రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక ప్రధాన బాధ్యుడిగా పని చేశారు.   తెలంగాణ రచయితల వేదిక గౌరవాధ్యక్షుడిగా ఆయన అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. కేవలం రచనకే పరిమితం కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా రాజయ్య పాల్గొన్నారు. కొన్నిటికి