కవిత్వం

షహీద్ మంగ్లీ కోసం

గజ్జెలు లేకుండా కూడ నీ పాదాలు ఎంత భంగిమలో ఉన్నాయి ఈ పాదాల్లో కొంచెం కొంచెం దుమ్ము పట్టి ఉన్నది ధూళి అనగానే గుర్తుకొచ్చింది నువ్వు నీ ‘యోయో’ (అమ్మమ్మ) ఒళ్లోకి వట్టికాళ్లతోనే గోముతో పరుగెత్తాలనుకోవడం కూడ ప్రేమనే మట్టితో సూటిగా మాట్లాడుతూ నీ కాళ్లు పాదాలు రేలా స్వరంలోకి తర్వాత ఎగుస్తాయి మొదట నీ పాదాలను ఈ మట్టి రమ్మని పిలుస్తుంది నువ్వూ నీ పాదాలు రెండూ ఎంత శాంతంగా ఎంత ప్రకాశిస్తూ, ఎంత నిష్కళంకంగా కనిపిస్తున్నారు నీ గోళ్లు చాల విచారంగా కనిపిస్తున్నాయి నీ అమ్మ దగ్గర నెయిల్కట్టర్ లేదు నువ్వీ పాదాలతో కొంచెం దూరం
పత్రికా ప్రకటనలు

పోరాడుతున్న రైతులకు అండగా నిలబడదాం!!

2022లో ఏడాదిపాటు సాగిన రైతుల సమ్మె యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చింది. అన్ని దురభిమానాలను, అధికార దురహంకారాలను ఓడించి ఆ పోరాటం విజయవంతంగా ముగిసింది. రైతులు లేవనెత్తిన డిమాండ్లను అంగీకరిస్తూ ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించింది. 1) తుది విశ్లేషణలో దేశానికే హాని కలిగించే మూడు రైతు చట్టాల ఉపసంహరణ 2) ఎమ్.ఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన కనీస మద్దతు ధర అమలు 3) సమ్మె సంబంధిత కేసులు ఉపసంహరణ 4) సమ్మెలో మరణించిన వారి కుటుంబాలకు తగిన పరిహారం 5) వ్యవసాయ రుణాల మాఫీ 6) విద్యుత్ బిల్లులను తగ్గింపు - అమలు చేస్తామని ప్రభుత్వం హామీ
పత్రికా ప్రకటనలు

నాస్తికోద్యమ నేత జయగోపాల్‌కు నివాళి

ప్రముఖ నాస్తికోద్యమ నేత డాక్టర్‌ జయగోపాల్‌ ఫిబ్రవరి 7న విశాఖపట్నంలో మరణించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా నాస్తికోద్యమ నిర్మాణానికి ఆయన జీవితమంతా కృషి చేశారు. 1972లో ఆయన భారత నాస్తిక సమాజాన్ని స్థాపించి దాన్ని నిర్మాణాన్ని దేశమంతా విస్తరింపజేశారు. భానాసను ఒక ఉద్యమ సంస్థగా, ప్రజా చైతన్య వేదికగా మలచడానికి జయగోపాల్‌ భావజాల, సాంస్కృతిక రంగాల్లో తీవ్రమైన కృషి చేశారు. నాస్తికవాదాన్ని ఒక సామాజికవాదంగా, హక్కుల వాదంగా కూడా ఆయన తీర్చిదిద్దారు. ఆస్తికత్వాన్ని భారతీయ సామాజిక, సాంస్కృతికరంగాల్లో ఆధిపత్యశక్తిగా గుర్తించిన ఉద్యమకారుడు ఆయన.             భారత నాగరికతలో కులం, మతం, మూఢాచారాలు ప్రజల చైతన్యాన్ని ఆడ్డుకొని
పత్రికా ప్రకటనలు

తొలి తరం విప్లవ రచయిత శ్రీపతికి నివాళి

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ కవి, ఉపాధ్యాయుడు నల్లెల రాజయ్య ఫిబ్రవరి 15 గురువారం ఉదయం హైదరాబాదులోని కిమ్స్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రలో ఉన్నారు. గుండెపోటుతో తుదిశ్వాస వదిలారు. వరంగల్‌కు చెందిన నల్లెల రాజయ్య కవిగా, పలు సాహిత్య సంస్థల బాధ్యుడిగా సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో వరంగల్‌ రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక ప్రధాన బాధ్యుడిగా పని చేశారు.   తెలంగాణ రచయితల వేదిక గౌరవాధ్యక్షుడిగా ఆయన అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు.             కేవలం రచనకే పరిమితం కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా రాజయ్య పాల్గొన్నారు.
వ్యాసాలు

మన రాజ్యాంగం – మనం

విరసం 29 వ మహా సభల ప్రారంభోపన్యాసం స్నేహితులారా! మనం ఇక్కడ రాజ్యాంగవాద సారాంశాన్ని గురించి మాట్లాడుకోవడానికి కలిశాం. ఈ రోజు మన జాతి చరిత్రలో ఒక ముఖ్యమైన సందర్భం. మన రాజ్యాంగం కేవలం ఒక న్యాయసంబంధమైన డాక్యుమెంట్‌ మాత్రమే కాదు. అది మన ప్రజాస్వామిక స్ఫూర్తికి ఆత్మ లాంటిది. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛల వైపుగా మనం చేసే ప్రయాణాన్ని సుగమం చేసే ఒక శక్తి. మనం ఒక నూతన యుగం ముంగిట్లో నిలబడి వున్నాం. ఈ సందర్భంగా, మన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలపట్ల మన నిబద్దతను మరోసారి ప్రకటిద్దాం. భారతదేశపు రాజ్యాంగ ప్రయాణం పరిణామక్రమంతో కూడుకున్నది. మనలాంటి
వ్యాసాలు

తెలుగు ప్రజల రాజకీయ, సాంస్కృతిక వికాసంలో ‘నిషేధిత’సంఘాలు

‘ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం తేలిక. ప్రజాస్వామికీకరణ చాలా కష్టం’ అని ప్రొ. శేషయ్యగారు తరచూ అనేవారు. మనలాంటి సమాజాల్లో పౌరహక్కులు   ప్రజల అనుభవంలోకి రాగల రాజకీయ, సాంస్కృతిక వాతావరణం ఏర్పడ్డం ఎంత కష్టమో చెప్తూ ఈ మాట అనేవారు. భూస్వామ్యం సాంస్కృతికంగా కూడా బలంగా ఉన్న చోట ప్రజా స్వామికీకరణకు చాలా అడ్డంకులు ఉంటాయి. ఎవరో కొంతమంది ఉదాత్త ఆశయాలతో  ప్రజాస్వామ్యం కోసం పని చేసినంత మాత్రాన అది ఎన్నటికీ ఒక భౌతిక వాస్తవంగా మారదు. వాళ్ల కృషి దోహదకారి కావచ్చు. అంత వరకే. ఆధిపత్య సంబంధాల్లో అణగారిపోతున్న జనం మూకుమ్మడిగా లేచి పోరాటాల్లోకి వచ్చినప్పుడే   ప్రజాస్వామ్యానికి కుదురు
వ్యాసాలు

త‌పాలా ఉద్యోగులంటే మోదీకి ఎందుకింత కక్ష ? 

చెడ్డ‌ పోస్టుమ్యాన్ ఉండ‌డు.. , మంచి పోలీస్ క‌నిపించ‌డు.. అనేది ఓ నానుడి. అంటే..  పోస్ట్ మ్యాన్ పని విధానం ఎంత‌  నిస్వా ర్థంగా త్యాగ‌పూరితంగా ఉంటుందో ఈ సామెత తెలియ‌జేస్తున్న‌ది. నేటికీ మారుమూల గ్రామం మొద‌లు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల దాకా త్యాగ‌పూరితంగా సేవ‌లు అందిస్తున్న ప్ర‌భుత్వ విభాగం ఏదైనా ఉన్న‌ది అంటే అది తంతి త‌పాలా శాఖ (పోస్ట‌ల్ డిపార్ట్ మెంటు) మాత్ర‌మేన‌ని చెప్పుకోవాలి. వృత్తి నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్న గ్రామీణ త‌పాలా ఉద్యోగులు త‌మ స‌మ‌స్య ల ప‌రిష్కారం కోసం  కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతూ స‌మ్మె చేస్తే, వారిని కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ బీజేపీ ప్ర‌భుత్వం
కవిత్వం

నేనొక ప్రపంచాన్ని కలగంటున్నాను

ఎక్కడా మనిషి మరో మనిషిని హీనపరచలేని ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ ప్రేమ భూమిని ఆశీర్వదిస్తుందో దాని దారులను శాంతితో అలంకరిస్తుందో ఆ ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ అందరూ తీయని స్వేచ్ఛా మార్గాన్ని తెలుసుకోగలరో ఎక్కడ ఆత్మ దురాశ రసి కారదో లేదా మన రోజు ధనాశ మడతలో చిక్కదో నేనా ప్రపంచాన్ని కలగంటున్నాను ఎక్కడ నలుపో తెలుపో మీది ఏ జాతైనా అవ్వొచ్చు భూమి వరాలు అందరికీ పంచబడాల ప్రతి మనిషీ స్వేచ్ఛాజీవి కావాల ఆ ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ దౌర్భాగ్యం తల వేలాడేయగలదో సంతోషం ముత్యంలా మెరవగలదో అందరి అవసరాలూ చూసే మానవత్వం