ఎక్కడా 
మనిషి మరో మనిషిని హీనపరచలేని
ప్రపంచాన్ని నేను కలగంటున్నాను

ఎక్కడ
ప్రేమ భూమిని ఆశీర్వదిస్తుందో
దాని దారులను శాంతితో అలంకరిస్తుందో
ఆ ప్రపంచాన్ని నేను కలగంటున్నాను

ఎక్కడ
అందరూ తీయని స్వేచ్ఛా మార్గాన్ని తెలుసుకోగలరో
ఎక్కడ ఆత్మ దురాశ రసి కారదో
లేదా మన రోజు ధనాశ మడతలో చిక్కదో
నేనా ప్రపంచాన్ని కలగంటున్నాను

ఎక్కడ
నలుపో తెలుపో 
మీది ఏ జాతైనా అవ్వొచ్చు
భూమి వరాలు అందరికీ పంచబడాల
ప్రతి మనిషీ స్వేచ్ఛాజీవి కావాల
ఆ ప్రపంచాన్ని నేను కలగంటున్నాను

ఎక్కడ
దౌర్భాగ్యం తల వేలాడేయగలదో
సంతోషం ముత్యంలా మెరవగలదో
అందరి అవసరాలూ చూసే
మానవత్వం వంటిదే నా కల,
నా ప్రపంచం!

(అమెరికా నల్లజాతి సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో,నాయకుడు, కవి, లాంగ్స్టన్ హ్యూజ్ I Dream ఆ world  అనే  యీ కవిత ను 1941లో రాశారు)

Leave a Reply