జూలై 4: చీకటి రోజుల వెలుగు గానం
తెలంగాణలో నిషేధాన్ని మోస్తూ ఈ జులై 4లోకి విరసం ప్రయాణిస్తోంది. గత కొన్నేళ్లుగా తీవ్రమవుతున్న నిర్బంధం గత ఏడాది జులై నాటికే పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం మార్చి 30 నుంచి ఇప్పుడది మరోసారి నిషేధంగా మారింది. ఇదేమీ కొత్త కాదు. కానీ ప్రతిసారీ అనుభవం కొత్తదే. కొత్త ధిక్కారమే.ప్రతి అణచివేతా కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుంది, సృజనాత్మక వెల్లువలకు దారి తీస్తుంది. ఈ విషయం చెప్పడానికి సుదీర్ఘ గతంలోకి వెళ్లనవసరం లేదు. ఈ ఒక్క ఏడాది ప్రజలు, సృజనజీవులు గడించిన అనుభవాలే చాలు. మహా మానవ విషాదంగా మారిన కొవిడ్ మధ్య ఈ ఏడాది గడిచిపోయింది. అది