పత్రికా ప్రకటనలు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిబండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ మైనర్బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్నిమహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

తేదీ: 12.05.2026 కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ రోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలిక తనపై బండి సాయి భగీరథ్ లైంగిక అత్యాచారం చేశాడని, గత నాలుగు నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వస్తే, గంటల తరబడి స్టేషన్లో నిలబెట్టి దోషులకు సమాచారం ఇవ్వడాన్ని తప్పుబట్టారు. మైనర్ బాలికపై అత్యాచారం పోక్సో చట్టం ప్రకారం వెంటనే చర్య తీసుకోవాల్సింది పోయి,
పత్రికా ప్రకటనలు

రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం

ఐఎమ్‌టి మనేసర్‌లో హర్యానా పోలీసులు అమలుచేసిన క్రూరమైన,  సమన్వయంతో కూడిన ప్రభుత్వ అణచివేతను  తీవ్రంగా ఖండిస్తున్నాం. 2026 ఏప్రిల్ ప్రారంభంలో, భారతదేశం అంతటా, ముఖ్యంగా ఇంధన రంగంలోనూ,  పారిశ్రామిక కేంద్రమైన ఐఎమ్‌టి మనేసర్ (హర్యానా) లోనూ ఆకస్మిక సమ్మెల వెల్లువ వ్యాపించింది. ఈ అశాంతికి ఐఎమ్‌టి మనేసర్‌లోని పరిస్థితి కేంద్ర బిందువుగా మారింది. హోండా, ముంజల్ షోవా, సత్యం ఆటో, రూప్ పాలిమర్స్, రిచికో గ్లోబల్, మోడలమా ఎక్స్‌పోర్ట్స్, రికో, సుప్రజిత్ ఇంజనీరింగ్, లాల్ సిర్మా ఎస్‌జిఎస్ వంటి అనేక ఫ్యాక్టరీలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు ఏప్రిల్ 2వ తేదీ నుండి సమన్వయంతో, వరుస సమ్మెలను ప్రారంభించారు. కార్మికుల
పత్రికా ప్రకటనలు

ప్ర‌జా క‌ళాకారుడు జ‌హంగీర్‌కు జోహార్లు

ప్ర‌జా క‌ళాకారుడు, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య సభ్యుడు తుర్క‌ప‌ల్లి జ‌హంగీర్ ఏప్రిల్ 2, 2026న గుండెపోటుతో మ‌ర‌ణించారు. పీడిత ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడును సుదీర్ఘ‌కాలం త‌న గొంతులో ఆయ‌న ప‌లికించారు. జ‌హంగీర్ తెలంగాణ‌లోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి ప్రాంతంలో పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. బాల్యంలో పేదరికం వలన ప్రాథమిక దశలోనే చదువుకు దూరమయ్యారు. జీవిక కోసం వివిధ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచారు. తెలుగు నేలను ఆవరించిన ప్రపంచీకరణతో పేద ప్రజల జీవితాలను 90ల ద‌శ‌కంలో మ‌రింత‌గా సంక్షోభంలోకి నెట్టడం మొద‌లైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ‌లో పతనమవుతున్న జీవితాలను కళ్ళారా చూసిన జహంగీర్
పత్రికా ప్రకటనలు

దళిత ఎక్స్ ఎంపీపీ లింగప్ప పై దాడి చేసినా సంజీవరెడ్డి గౌడ,బసవరాజప్ప గౌడ లను వెంటనే అరెస్టు చేయాలి.

ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో చేగుంట గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ లింగప్ప పై కులం పేరుతో దూషిస్తూ రాళ్లతో కొట్టి తల పగలగొట్టి, అడ్డువచ్చిన ఆయన భార్య పెద్ద శాంతమ్మను కాళ్లతో తన్ని, కొడుకు మోహన్ కుమార్ ను దాడి చేసి రక్త గాయాల పాలు చేసిన అదే గ్రామానికి చెందిన సంజీవరెడ్డి గౌడ, బసవరాజప్ప గౌడ లను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లింగప్ప ఇంటి ముందు గ్రామ సర్పంచ్  కొడుకు   సంజీవరెడ్డి గౌడ ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడంలో భాగంగా గుంతలు తవ్వుతున్న
పత్రికా ప్రకటనలు

ఇరాన్ పై అమెరికా జియోనిస్ట్ కూటమి చేస్తున్న అన్యాయమైన యుద్ధాన్ని ఆపండి

సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం - లెనిన్విప్లవం యుద్ధాన్ని అంతం చేస్తుంది లేదా యుద్ధమే విప్లవానికి దారి తీస్తుంది - మావో జెడాంగ్ ఇజ్రాయిల్ తో పొత్తు పెట్టుకుని అమెరికా ఇరాన్ పై చేస్తున్న యుద్ధం ప్రపంచ ఆధిపత్యం కోసం కొన‌సాగిస్తున్న యుద్ధంలో భాగం. కాబట్టి ఇది అన్యాయమైన యుద్ధం. దీనికి ప్రతిఘటనగా ఇరాన్ చేస్తున్నా ఆత్మరక్షణ యుద్దం న్యాయమైనది. అన్యాయమైన యుద్ధానికి వ్యతిరేకంగా మనం నిరసన తెలపాలి. మనం ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి. శాంతి కోసం అమెరికా ఇరాన్ తో మూడు రౌండ్ల చర్చలు జరిపింది. నాలుగో సారి చర్చలు జరగాల్సి ఉంది. ఈ లోపలే, ప్రపంచ ప్రజల
పత్రికా ప్రకటనలు

కుమ్మెర జాతరలో పసిపాప మరణానికి కారకులైన దోషులను శిక్షించాలి

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ మల్లన్న జాతరలో ఫిబ్రవరి 18న  ఆలయ దర్శన టికెట్ కోసం తలెత్తిన వివాదంలో అగ్ర కుల భూస్వామ్య శక్తులు జరిపిన దాడిలో రెండు నెలల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవడం అత్యంత హేయమైన చర్య. ఈ ఘటనను విప్లవ రచయితల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కేవలం ఒక జాతరలో జరిగిన ఘర్షణ కాదు. శతాబ్దాలుగా వేళ్లూనుకున్న ఆధిపత్య  కుల దురహంకార దాడి. జాతరలో ప్రవేశానికి ఫీజు చెల్లించలేదనే నెపంతో చాకలి గణేష్ కుటుంబంపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూస్వామ్య శక్తులు దాడి చేయడం, పసిబిడ్డను తన్నడం, మహిళలను వివస్త్రలను చేసేలా ఈడ్చుకెళ్లడం
పత్రికా ప్రకటనలు

త్వరలో.. ఈ తరం సాహిత్య విమర్శ ప్రారంభం

తెలుగు సాహిత్యంలోకి  అనేక జీవ‌న మూలాల నుంచి కొత్త త‌రం ర‌చ‌యిత‌లు వ‌స్తున్నారు. కొత్త అనుభ‌వాలను ప‌రిచ‌యం చేస్తున్నారు.  అద్భుత నిర్మాణ ప‌ద్ధ‌తుల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. చాలా ప్ర‌శంస‌నీయ‌మైన ఈ కృషిలో   ఈ కాలపు జీవ‌న సంఘ‌ర్ష‌ణ ఎంత ఉన్న‌ది?  యువ ర‌చ‌యిత‌లు దాన్ని ఎంత మేర‌కు ఒడిసిపట్టుకోగ‌ల‌గుతున్నారు?  జీవితంలోని మార్పు క్ర‌మాల‌ను ఎంత లోతుగా, సంక్లిస్టంగా, తార్కికంగా చిత్రించ‌గ‌లుగుతున్నారు?  అనే ప్ర‌శ్నలు కూడా ఉన్నాయి. ఇలాంటివి  అన్ని త‌రాలు ఎదుర్కొన్న‌వే. సాహిత్య విమ‌ర్శ ఈ స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చ‌నీయాంశం చేయాలి. ప‌రిష్కారం చూపాలి.  తెలుగు  సాహిత్య రంగంలోకి కూడా సంఖ్యాప‌రంగా త‌క్కువే కావ‌చ్చుగాని,   కొత్త తరం ప్రవేశించింది.  ర‌చ‌యిత‌లైనా, విమ‌ర్శ‌కులైనా,
పత్రికా ప్రకటనలు

  హిడ్మా హ‌త్య చ‌ట్టాతీతం

2025 నవంబరు 18నాడు స్థానిక ఆదివాసీ కార్యకర్త, నక్సలైట్ నాయకుడు మడావి హిడ్మా, అతని కామ్రేడ్, జీవన సహచరి మడకాం రాజేని మరో 11 మందిని చంపినట్లు భారత రాజ్యం విజయవంతంగా ప్రకటించింది. ఈ సైనిక 'విజయం'తో, భారతదేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని అంతం చేయడానికి హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన 2026 మార్చి 31 గడువును విజయవంతంగా చేరుకుంటున్నట్లు బిజెపి ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, క్రైస్తవులు తదితర అట్టడుగు వర్గాలను లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న పెట్టుబడిదారులు భూమిని, సహజ వనరులను స్వాధీనం చేసుకోవడాన్ని సులభతరం చేయడానికి బిజెపి ప్రభుత్వ అణచివేత విధానాలలో
పత్రికా ప్రకటనలు

ఆయనకు ఆ శిక్ష చాలదు

యాసిన్‌మాలిక్‌ను ఉరితీయాలన్న ఎన్‌ఐఏ వాదనలను ఖండించండి  యావజ్జీవ ఖైదీగా ఉన్న కశ్మీర్‌ పోరాట నాయకుడు యాసిన్‌మాలిక్‌ను ఉరి తీయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మే 29న ఢల్లీి కోర్టులో వాదించింది. ఇటీవల ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటీషన్‌ మీద తుషార్‌మెహతా కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి అత్యంత ప్రమాదకరమైన, అరుదైన నేరానికి పాల్పడినందు వల్ల యాసిన్‌ మాలిక్‌కు ఇప్పుడు విధించిన శిక్ష సరిపోదని, ఉరిశిక్ష విధించాలని కోరాడు. ఆయన చేసిన నేరాల తీవ్రతను చాటడానికి ఒసామాబిన్‌ లాడెన్‌ పేరు కూడా ప్రస్తావించాడు. ఇలాంటి కఠినమైన శిక్షలు విధించకపోతే నిరంతరం ఎవరో ఒకరు సాయుధ
పత్రికా ప్రకటనలు

రాజ దండం పాలనలో క్రీడాకారులపై దాడి

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బట్టబయలు చేస్తూ, రాజ్యాంగ ఆదర్శాలను అవహేళన చేస్తూ, ఇది అధికారికంగా కూడా హిందుత్వ రాజ్యమని ప్రకటిస్తూ మే 28న కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అనేక రాజకీయ పార్టీలు బహిష్కరించాయి. అట్లాగే  మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై   చర్యలు తీసుకోవాలని కోరుతూ చాలా కాలంగా  పోరాడుతున్న క్రీడాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశ ప్రతిష్టను క్రీడాకారులు దశ దిశలా వ్యాపింపజేస్తారని పొగిడే పాలకులు న్యాయమైన డిమాండ్‌ మీద రాజీపడకుండా పోరాడుతోంటే తమ సహజమైన అణచివేత చర్యలకు