కామ్రేడ్ కె. ముత్యం గారికి విప్లవ జోహార్లు
పోరాటాల సాహిత్య చరిత్ర పరిశోధకుడు, విలువైన రచనలు తెలుగు సమాజానికి అందించిన ప్రజాపక్ష రచయిత కె. ముత్యం గారికి జోహార్లు. అట్టడుగు ప్రజలు నిర్మించే చరిత్ర, సాహిత్య చరిత్ర మౌఖిక రూపాల్లోనే ఎక్కువగా నిక్షిప్తమై ఉంటుంది. ప్రజల నాల్కల మీద ఆడుతుంటుంది. అటువంటి గాథలను, మౌఖిక కళా రూపాలను అన్వేషిస్తూ పోతే మహోన్నత పోరాటం కొత్త అర్ధాలతో కళ్ల ముందు నిలుస్తుంది. ఆ పోరాటాలు చేసిన మట్టి మనుషుల సాహసం దృశ్యం కడుతుంది. పై నుంచి కాకుండా కింది నుంచి చరిత్రను లఖితబద్ధం చేసే శాస్త్రీయ విధానమిది. ముత్యం గారు పరిశోధక విద్యార్థిగా శ్రీకాకుళ ఉద్యమం, సాహిత్యం గురించి