అన్వేషకుడు
దాన్ని "పరిశోధన "అన్నాడు
ఓజెండా, ఓ శిలువ, ఓ కిరీటం
అకస్మాత్తుగ బందిపోటు
పవిత్రుడైపోతాడు
ప్రజలను తరిమేశాక
అదంతా "ఖాళీ నేల" అవుతుంది
మూలవాసులు
చరిత్రను పూడ్చిపెట్టిందెవరోచూపెడతారు
మీ మ్యాపులకన్న ముందు
ఇక్కడొక భాష ఉండేది
మీ సరిహద్దులకు ముందు
ఇక్కడ జ్నాపకాలుండేవి
మీ లెక్కల పుస్తకాలముందు
ఇక్కడ జీవిత ముండేది
వలసవాదులు
అడవిని కనుగొనలేదు
దాన్ని "సృష్టించారు"
పేర్లను, మనుషుల్ని, భవిష్యత్తును తుడిచేసి
దాని పేరు నిశ్శబ్ద నాగరికతగా నామకరణం చేశారు
వాళ్లుతెచ్చింది నాగరికత గాదు
రోగాలు, సంకెళ్లు, కట్టు కథలు
మేధావులకో "ప్రశ్న "
పరిశోధన అంటే నిజాయితేనా
లేక తన అధికారం
సుస్థిరం చేసుకోవడానికి
చెప్పే మొదటి అబద్ధమా
**
థింక్ అండ్ ఎగ్జిస్ట్...నుండి
స్వేచ్ఛానువాదం.. ఉదయమిత్ర




