సిర్పూర్ (టి) గురుకుల పాఠశాల పునర్నిర్మాణం కోసం పూర్వ విద్యార్థుల పోరాటం
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతమైన సిర్పూర్ నియోజకవర్గంలో 90 వ దశకంలో నెలకొల్పిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ద్వారా వేలాదిమంది పేద దళిత విద్యార్థులు చదువుకున్నారు. నాగార్జునసాగర్ లో ఉన్న సర్వేల్ గురుకుల పాఠశాలతో సమానమైన సిర్పూర్ గురుకుల పాఠశాలలో ఫౌండేషన్ విద్య వేలాదిమంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో చదివేందుకు తోడ్పడింది. సివిల్ సర్వీసుల్లో, ఐఐటీ,ఎన్ ఐటి, వర్సిటీలలో చేరేలా ఉపయోగపడింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలలో పుట్టిన పేద దళిత విద్యార్థులు ఇక్కడ పాఠశాలలో సీటు పొంది భోజనం, వసతి, చదువు అన్ని ఉచితంగా పొందుతూ










