నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం
విరసం తదితర 16 ప్రజా సంఘాలపై తెలంగాణ ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను వ్యతిరేకించండి 26.4.2021 విప్లవ రచయితల సంఘం సహా 16 ప్రజా సంఘాలను చట్టవ్యతరేక సంస్థలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛకు, రాజకీయ స్వేచ్ఛకు, సంఘం పెట్టుకొనే హక్కుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ జీవో ప్రభుత్వ పాలనా పద్ధతులకు కూడా పూర్తి వ్యతిరేకంగా వెలుగులోకి వచ్చింది. జీవో ఎంఎస్ 73 పేరుతో మార్చి 30న ఈ ఉత్తర్వులను తయారు చేశారు. ఏప్రిల్ 28న పత్రికలకు విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో జీవోలు