ఫాసిస్టు ధిక్కారంగా విరసం సాహిత్య పాఠశాల
ఎన్ఐఏ దాడులు, విచారణల మధ్యనే ఎగిరిన విరసం జెండా విరసం 22 వ సాహిత్య పాఠశాల ఏప్రిల్ 12 న విజయవాడలో జరిగింది. ఒక వైపు కరోనా భయం మరో వైపు ఎన్ఐఏ సోదాలు, విచారణలు . యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న విరసం మరో యాభైల్లోకి.. ఫాసిస్టు కల్లోలంలో రూపొందుతున్న కొత్త పోరాటాల ప్రపంచంతో పనిచేస్తానని కలిసి నడుస్తానని బాస చేసింది. ఈ సాహిత్యపాఠశాలలో ఉండాల్సిన కవులు, కళాకారులు, ప్రజా సంఘాల బాధ్యులు కొందరు జెయిళ్లలో ఉన్నారు. చాలామంది ఎన్‌ఐఏ విచారణలో ఇరుక్కుపోయారు. ఆ వెలితి ఉన్నప్పటికీ ఎప్పటిలాగే ఉత్తేజభరితంగా పాఠశాల జరిగింది. ఫాసిస్టు కల్లోలంలో రూపొందుతున్న