మందగమనంలో భారత ఆర్థిక వ్యవస్థ
కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం, స్థూల జాతీయోత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించడం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడం..వంటి లక్ష్యాలు చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ కేవలం మాటల గారడీతో అభివృద్ధి సాధ్యం కాదని గత పదేళ్ల కాలంలో ప్రత్యక్షంగా చూశాం. మరోవైపు మోడీ ప్రచారానికి భిన్నమైన వాస్తవ దృశ్యాలు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతున్నాయి. వర్తమాన కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను దట్టమైన చీకట్లు కమ్ముకొన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా క్షీణించిందనేదీ చేదు నిజం. వాస్తవానికి ‘ఆర్థిక వినాశనం’ అని చెప్పవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటుంది.