ఆర్ధికం

టారిఫ్‌ ఉత్పాతానికి షేర్‌మార్కెట్‌ పతనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టించనున్నారని అంతర్జాతీయ సంస్థలు గగ్గోలు పెడుతోన్నాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలు వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందన్న భయం ఇప్పుడు అమెరికా సహా ప్రపంచమంతటా నెలకొంది. వాణిజ్య యుద్ధానికి తెర లేపి ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లను కుప్పకులేలా చేసిన ట్రంప్‌ విధానాలు మరిన్ని ప్రమాదాలను సృష్టించనుందని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వర్తమాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికాను తలకిందులు చేయాలన్న (డీ డాలకైజేషన్‌) సంకల్పం... అందువల్ల ట్రంప్‌ చర్యలతో అమెరికా భారీగా లాభపడుతుందన్న గుడ్డి విశ్వాసం ఆవరించినట్టుంది. పర్యవసానంగా ఏప్రిల్‌ 3 నుంచి అంతర్జాతీయ
విశ్లేషణ

స్పష్టత కొరవడిన‘శతర’

‘శతర’ ఆదివాసీ కవిత్వం పేరుతో కళింగాంధ్ర కవి సిరికి స్వామినాయుడు అతని కొత్త కవిత్వసంపుటిని ప్రకటించాడు. ఈ సంపుటిలోకి అతని తొలి రెండు సంపుటాలు 'మంటిదివ్వ', 'మట్టి రంగు బొమ్మలు' నుంచితీసుకున్న ఆదివాసీ నేపథ్య కవితలనూ చేర్చాడు. మొత్తానికి ఈ సంపుటి ఆదివాసీ జీవితాన్ని-జీవన సౌందర్యాన్ని-సాంస్కృతిక విశేషాలను,ఆదివాసీ జీవిత కుదుపులను-ఆ కుదుపులకు కారణమైన ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలను అతనికున్నచైతన్యపరిధిలో అతను రాయడం జరిగింది. ఆదివాసీలు పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను చెప్పే కవితలనూ స్వామినాయుడు రాయడం మెచ్చదగినది. ఏ కవికైనా కొన్ని పరిధులుంటాయి. ఆ పరిధులు మూలంగానో లేదా ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనకి తక్షణం
మీరీ పుస్తకం చదివారా ?

ఎవడ్రా ఈ నేల నాది కాదన్నది..?

‘మనఓట్లు తీసుకుని గెలిచిన ప్రభుత్వం మన పునాది బతుకులను దెబ్బతీసేందుకు చట్టాలను నియమాలను తెచ్చిందా? దేశ రక్షణ పేరుతో, ఇస్లాం టెర్రరిస్టుల బూచి చూపి ముస్లిం చొరబాటుదారులను ఏరివేయడానికి అని చెప్పి, మొత్తం జన వర్గానికి ప్రతి వ్యక్తికీ తన ఉనికిని రుజువుచేసుకునే దుర్మార్గమైన పరిస్థితిని కల్పించింది.అధర్మం. అన్యాయం.’ ‘మనఓట్లు తీసుకుని గెలిచిన ప్రభుత్వం మన పునాది బతుకులను దెబ్బతీసేందుకు చట్టాలను నియమాలను తెచ్చిందా? దేశ రక్షణ పేరుతో, ఇస్లాం టెర్రరిస్టుల బూచి చూపి ముస్లిం చొరబాటుదారులను ఏరివేయడానికి అని చెప్పి, మొత్తం జన వర్గానికి ప్రతి వ్యక్తికీ తన ఉనికిని రుజువుచేసుకునే దుర్మార్గమైన పరిస్థితిని కల్పించింది.’ ఈ
కవిత్వం

యుద్ధం మధ్యలో

నెత్తుటి కన్నీరుతో ఇంద్రావతి ఎరుపెక్కిందిచావులను అంకెలతో లెక్క కడుతున్నాడు దేహాలను కుప్పలుగా పోసిఅంతిమ యుద్దమనిహెచ్చరిస్తున్నాడుముఖాలను గుర్తుపట్టక ముందే తలలకు కట్టిన వెలలు ప్రకటిస్తాడుపాలబుగ్గల పసివాళ్ళనుమెషీన్ గన్లతోచంపుతున్నాడునిరాయుధుల చెంత తుపాకులు పరిచి ఎదురుకాల్పుల కట్టు కథలు చెప్తాడుద్రోన్లతో విష వాయువులు చిమ్మి అడవి బిడ్డలప్రాణాలు హరిస్తాడు ఆకుపచ్చనిఅరణ్యమంతాసైనిక క్యాంపులు నింపుతున్నాడునేలకింది బంగారం వాడికి అమ్మకపుసరుకుగా కావాలి వాడిది కార్పొరేట్ యుద్ధంమనది జనతన పోరాటం.
వ్యాసాలు

జీవించే హక్కు కోసం శాంతి చర్చలు

మధ్యభారత ప్రాంతం ఆదివాసీల హననానికి కేంద్రంగా మారేలా భారత ప్రభుత్వం చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు లక్షల సంఖ్యలో సాయుధ బలగాలను దింపి ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో వేటాడి చంపేస్తున్నారు. ఆపరేషన్ కగార్ 15 నెలలుగా మధ్యభారతంలో నిరంతరాయంగా కొనసాగుతూ వందల సంఖ్యలో ఆదివాసీల ప్రాణాల్ని హరిస్తున్నారు. మావోయిస్టు పార్టీ భారత ప్రభుత్వం మావోయిస్టు పార్టీకి మధ్య యుద్ధం సమ ఉజ్జీవుల మధ్య యుద్ధం కాకపోయినప్పటికి దశాబ్దాలుగా త్యాగాలతోనే విప్లవోద్యమాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలోని అశేష ప్రజానీకం మద్దతు సానుభూతి కూడాగట్టడంలో విజయం సాధించారు. అది విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, రైతాంగ శ్రేణుల నుంచి బలం వచ్చి చేకూరింది.
కరపత్రాలు

మానవ హననం ఆపాలి…. శాంతి చర్చలు జరపాలి

*మధ్యభారతంలో ఆదివాసీల హననాన్ని ఆపివేయాలి*శాంతి, ప్రజాస్వామ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మావోయిస్టులు వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలి ప్రియమైన ప్రజలారా, గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని ఆదివాసులు, ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, గడ్చిరోలి, ఒడిషా, ఆంధ్ర, తెలం గాణ, ఝార్ఖండ్, బెంగాల్, కేరళ  రాష్ట్రాలలోని ఆదివాసులు మావోయిస్టుల నాయకత్వంలోనూ, విడిగా తమ తమ ఆదివాసీ సంఘాల నాయకత్వంలోనూ జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల న్నింటా ఉన్న అపారమైన ఖనిజాలను అదానీ, అంబానీ, వేదాంత, టాటా, బిర్లా తదితర కార్పొరేట్ సంస్థ లకు అప్పజెప్పడం కోసం అక్కడి ఆదివాసీలను తమ స్వంత గడ్డపై నుండి బేదఖలు
వ్యాసాలు

 స్త్రీల కవిత్వంలో ప్రపంచ దర్శనం

(ఇటీవల విడుదలైన  ‘ప్రపంచ స్త్రీల కవిత్వం – స్వేచ్ఛానువాదం: దియా విఘ్నేష్’ పుస్తకానికి రాసిన ముందు మాట-వసంత మేఘం టీం ) ప్రపంచం నాలుగు మూలల నుండి ఒకేసారి అరవై మంది కవయిత్రులతో సంభాషణ ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఎలా వచ్చిందో కాని దానికదే ఎంత అపురూపమైనది కదా అనిపించింది ఈ పుస్తకం గురించి విన్న వెంటనే. వైవిధ్యభరితమైన సాంస్కృతిక వ్యక్తీకరణలు, ప్రాకృతిక విశేషాలు, చారిత్రక నేపథ్యాలు ఒక్క చోటికి రావడం దానంతటదే ఒక ప్రత్యేకత. అయితే ఈ కవిత్వమంతా సౌందర్యారాధన కాదు. ఒట్టి నగిషీలు చెక్కిన కళ కాదు. అలా అయితే రంగుల పుష్పగుచ్ఛంలా మన
వ్యాసాలు

సమాధి వెనుక దాగిన చరిత్ర

ఔరాంగజేబు చిన్ననాటి తరగతి గది చరిత్ర పాఠంలో విన్నపేరు. 1705 చనిపోయిన వ్యక్తి తదనంతర కాలంలో జీవిస్తున్నాడు. మరణాంతర , ఒకనాటి  పాలకుని గురించి అంచనా ఏమిటి? నిరంకుశ, దయామయుడైన పాలకుడా , లేదా, అనేది ఇవాల చర్చ ఎందుకు?  చరిత్రలో అనేక పరిశీలనలు సహజం. ఔరాంగజేబు మరణించి మూడు వందలఏళ్ల కాలం గడిచింది. 'ఒక రాణి ప్రేమ పురాణం ఇది కాదోయ్ చరిత్ర' అన్నాడు శ్రీశ్రీ.1705 కి ముందు ఏమి జరిగింది. ఔరంగ జేబు  ఇవాళ్టి భారతదేశానికి పాలకుడు కాదు. అతని రాజ్యవిస్తరణకు పరిమితి వుంది. హిందూ దేవాలయాల నేలమట్టం చేయడం, హిందుత్వ సంస్కృతిని అణిచి వేయడం
కథలు

అంటరాని బతుకమ్మ

అనగనగా ఒక కథ కొత్త కాలం ఈ సంచిక నుంచి మొదలవుతోంది . నిన్న చదివిన కథ ఇవాళ మరోసారి  చదివితే  కొత్తగా ఉంటుంది. నిన్న గ్రహించలేని అర్థాలు వినిపిస్తాయి . కవి నాగేశ్వర్ తాను మరో  సారి చదువుతున్న కథలను మనకు పరిచయం చేసే శీర్షిక ఇది - వసంత మేఘం టీం కథలో జీవితం కనిపిస్తుంది . ఆ జీవితాన్ని కథ   మన అనుభవంలోకి తెస్తుంది .  ఆ అనుభవం మనల్ని ఆలోచనల్లోకి నెట్టి ఆచరణ వైపు నడిపిస్తుంది . కథ జీవితం లాంటిది. కథ లాంటిది  జీవితం. అదే విప్లవ కథ. అట్లాంటి విప్లవ
సమకాలీనం

శాంతి చర్చల పూర్వాపరాలు

(రంగులు మారుతున్న నక్సలిజం - సదస్సుకు ప్రతిస్పందన) కమ్యూనిస్టులు కానివారు, అశేష ప్రజాదరణ ఉన్నవారు విప్లవకారులను పీడిత ప్రజలలో పని చేస్తున్నట్లు గుర్తించి నక్సల్బరీ కాలం నుంచీ సంభాషణ జరుపుతున్నారు . అప్పటి  నుంచీ  దానికి  గుండెలు బాదుకుంటున్నవారు  కూడా ఉన్నారు. వీళ్లు భావజాల రీత్యా బ్రాహ్మణీయ, మార్కెట్ శక్తుల ప్రతినిధులు.  శంకరన్, పొత్తూరి విప్లవకారులతో సంభాషణ జరిపి, ప్రభుత్వంతో చర్చల దాకా తీసుకువచ్చి చర్చల వైఫల్యానికి, తర్వాత హింసా విధ్వంసాలకు ప్రభుత్వమే కారణమనడం ఇప్పటికీ వీళ్లకు మింగుడు పడడం లేదు. పుబ్బలో పుట్టి మఖలో మాయమయే ఇటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. హరగోపాల్ పోరాట రూపాలు ప్రజలు