అలనాటి రచన సాహిత్యం కాలమ్స్

చెదిరినసమాజం

మూలం: చినువా అచ్ బె                        తెలుగు అనువాదం: కొలసాని సాంబశివరావు                                                             “చెదిరిన సమాజం” ఇది నైజీరియన్ నవల. దీని ఇంగ్లీష్ పేరు “థింగ్స్ ఫాల్ అపార్ట్”[Things fall apart]  దక్షిణ ఆఫ్రికాలో ఒక దేశం నైజీరియా. ఆ దేశంలో ఒక మారు మూల గ్రామం ”వుమ్యోఫియా”. నాగరికతకూ, సాంకేతికతకూ దూరంగా వున్న గ్రామం. వ్యవసాయపు పనులూ, వర్షం కోసం ఎదురు చూపులూ, కట్టుబాట్లూ, రచ్చబండ తీర్పులూ, నమ్మకాలూ, ముర్ఖత్వాలూ, అన్నీ కలసి దూరంగా బ్రతుకుతున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ‘యామ్’ పంటల పండుగ.ఆరోజు అందరూ ఒకచోట చేరి సమిష్టి వంటలూ, ఒకవైపు సంగీతవాయిద్యాలూ, మరోవైపు మల్ల యుద్దాలూ, ఆడా, మగా,
కాలమ్స్ అలనాటి రచన

రాజూ-పేదా

మార్క్ ట్వైన్ రాసిన “ప్రిన్స్ అండ్ పాపర్” ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఇది. సాహిత్యంలో కధలూ, నవలలనూ ఫిక్షన్ అంటారు. అంటే, కల్పన అని అర్ధం. కధలు యెంత సహజంగా రాసినా, యెంత సమాజాన్ని ప్రతిబింబించినా అవి కల్పనలే. ఆ పాత్రలు బయట ఎక్కడా కనిపించవు కదా! అయితే, కొన్ని కధలు ఒక కాలం నాటి చారిత్రక పరిస్థితులను చూపిస్తాయి. ఆనాటి ప్రజల జీవన స్థితిగతులు ఎలా వున్నాయో చెబుతాయి. ఈ “రాజూ-పేదా“ అలాంటి నవలే. 1535 నాటి లండన్ నగరం. దుర్భర దారిద్ర్యం, ఆకలీ, భిక్షాటనా, దొంగతనాలూ. ఒకవైపు అంతులేని దుఃఖం, కన్నీళ్ళూ. హద్దులు లేని 
కాలమ్స్ అలనాటి రచన

ఒక బానిస ఆత్మకథ

ఇంగ్లీష్ : ఫ్రెడరిక్ డగ్లస్ తెలుగు అనువాదం: ముక్త వరపు పార్థ‌సార‌ధి  మానవ జాతి చరిత్రలో బానిస వ్యవస్థ అనేది ఒక దశ. అలాంటి దశ ఒకటి గత కాలంలో జరిగిందనీ, బానిసలు యెంత నికృష్ట, దయనీయమైన జీవితాల్ని అనుభవించారో కొంచెంగానైనా గ్రంధస్తం కాకపొతే, వాళ్ళ కన్నీళ్లు ఆనాటి శిథిలాల  కిందే ఇంకిపోయి ఉండేవి. “యెంత ప్రతిభా వంతులైన రచయితలైనా అసలు వాస్తవాలను అణుమాత్రంగా చెప్పలేకపోయారు”  అనేవాడట బానిస యోధుడు స్పార్టకస్. అంటే, వాస్తవ పరిస్థితులు ఎంత భయంకరమైనవో మనం ఊహించుకోవచ్చు. తెలుగులో ‘స్పార్టకస్, ఏడుతరాలూ, అంకుల్ టామ్స్ కేబిన్’ లాంటి పుస్తకాలు వున్నాయి. కానీ, ఒక బానిస
కాలమ్స్ అలనాటి రచన

యుద్ధ కాల‌పు మాన‌వీయ క‌థ‌నం

రష్యన్ మూలం: చింగీజ్ ఐత్ మాతోవ్,  తెలుగు అనువాదం: ఉప్పల లక్ష్మణరావు యుద్ధం....అది  సృషించే విలయం, విధ్వంసం వర్ణనాతీతం. జయాపజయాలు ఏ దేశానివైనా ఓడిపోయేది నిస్సందేహంగా పేద, మధ్యతరగతి వాళ్ళే. బిడ్డలను కోల్పోయిన తల్లులు, భర్తలను కోల్పోయిన భార్యలు. ఎవరి పాపం? ఎవరి స్వార్ధం? నిర్మలంగా, ప్రశాంతంగా సాగిపోతున్న ఒక మామూలు సంసారంలో యుద్ధం సృష్టిచే భీభత్సమే ఈ కథ‌.  భర్తనూ, ముగ్గురు పిల్లలనూ కోల్పోయి, నిస్సహాయంగా బ్రతుకుతున్న తొల్గొనాయ్ కధే ఈ “తల్లీ-భూదేవి”  “ఒక్క గింజను నాకివ్వు. పది కంకులు నీకిస్తాను.” అని భూదేవిని కూడా ఒక పాత్రను చేసి, భూమిని సద్వినియోగం చేసుకోండి అని రచయత
కాలమ్స్ అలనాటి రచన

ఓ బాలిక డైరీ

మూలం: ఆన్ ఫ్రాంక్                                           తెలుగు అనువాదం: బీనా దేవి ప్రపంచంలోనే మహా నియంత. ఎటువంటి నేరమూ చేయని లక్షలాది యూదు జాతీయులను కేవలం ‘యూదులుగా పుట్టడమే వాళ్ళ నేరమని’ భావించి, మారణహోమం చేయించిన నర రూప రాక్షసుడు అడాల్ఫ్ హిట్లర్. అతను పరిపాలిస్తున్న కాలంలో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఒక ఇంట్లో అటక లాంటి భాగంలో తన కుటుంబంతో సహా  గడిపిన  ఒక యూదు బాలిక ఆన్ ఫ్రాంక్.  జర్మన్ లో ఫ్రాంక్ ఫర్డ్ నగరంలో 1929 జూన్ 12 వ తేదీన పుట్టింది ఆన్ ఫ్రాంక్. తండ్రి ఒట్టో ఫ్రాంక్. తల్లి