1998లో అనుకుంటాను గోదావరిఖనిలో కథల వర్కు షాప్ జరిగింది. అల్లంరాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, వారాల ఆనంద్ గార్ల పూనికతో. వర్క్ షాపు అయ్యాక బొగ్గుబాయిలు చూడటానికి పోయాము అందరమూ. పాత అండర్‌గ్రౌండ్ మైనింగ్‌తో పాటు అప్పుడప్పుడే ఓపెన్ కాస్ట్ తవ్వకాలూ మొదలయిన కాలం అది. ఒక కొండను మించివున్న పేద్ద పేద్ద యంత్రభూతాలు నిజంగానే భయపెట్టాయి. నేను, రాప్తాడు గోపాలకృష్ణ, పాణీ బొగ్గు బాయిలను చూడటం అదే మొదటిసారి. లోపల భరించలేని వేడి, ఉక్కపోత, పేద్ద ఫ్యాన్లు పెట్టి గాలి లోపలికి తోలుతున్నా అది సగదూరం కూడా పోదు. ఆకు అల్లాడిన గాలికూడా రాదు. అతి తక్కువ ఆక్సిజనే