వ్యాసాలు

ఖాకీల సంరక్షణలో కార్పొరేట్ల విస్తరణ, ప్రజా పోరాటాల ప్రతిఘటన

ప్రపంచవ్యాపితంగా ఆర్థిక ద్రవ్య సంక్షోభం ఎంత తీవ్రం అవుతుందో అంత వేగంగా వెనుకబడిన దేశాలలోకి ప్రపంచ పెట్టుబడి ప్రవహిస్తున్నది. వెనుకబడిన దేశాలలోని లోతట్టు ప్రాంతాలను వెతుక్కుంటూ మరీ దూకుడుగా అది పరుగులు తీస్తోంది. సామ్రాజ్యవాదం ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి అది బయటపడడానికి చేపడుతున్న ప్రక్రియ ఇది. కాబట్టి అసలు సంక్షోభాల గురించి 1848 లోనే కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ లు ఏం చెప్పారో మనం ఒకసారి చూద్దాం. ‘‘సంక్షోభాలను మరింత విస్తృతమైన, మరింత విధ్వంసకరమైన సంక్షోభాలకు బాట వేయడం ద్వారా, సంక్షోభ నివారణావకాశాలను తగ్గించడం  ద్వారా తాత్కాలికంగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా, 1. ఉత్పత్తి శక్తులలో
వ్యాసాలు

కార్పొరేట్ జగత్తు కోసం ఖాకీమయమవుతున్న అడవులు

భారతదేశంలోని మూల మూలకు ద్రవ్యపెట్టుబడి వేగంగా, దూకుడుగా విస్తరిస్తున్నఫలితమే మన దేశంలోని అడవుల కార్పొరేటీకరణ. పెట్టుబడి సంచయనం గురించి ప్రాథమిక అర్థశాస్త్ర పాఠాలు అర్థమైనవారికి ఈనాడు మన దేశంలో జరుగుతున్న అడవుల కార్పొరేటీకరణ గురించి ఆశ్చర్యమో, విచిత్రమో ఏమీ వుండదు. ఆఫ్రికా మూలవాసులు చెప్పుకునే అనుభవం జగమెరిగినదే. ఒక చేత్తో బైబిల్, మరో చేత్తో రైఫిల్తో వెళ్లిన యురోపియన్ పెట్టుబడిదారులు వారి చేతిలో బైబిల్ పెట్టి వారి భూములను కైవశం చేసుకున్నారని చెప్పుకోవడం తెలిసిందే. ఉత్పత్తి సాధనాలలో ఒకటైన భూమిని స్వంతం చేసుకోకుండా, ఆ భూమిపై ఆధారపడుతున్న రైతులను శ్రామికులుగా మార్చకుండా పెట్టుబడిదారీ విధానం వునికిలోకి వచ్చి వుండేదే
కాలమ్స్ ఆర్ధికం

కార్పొరేట్ల సేవలో మోడీ ప్రభుత్వం

''వట్టిమాటలు కట్టిపెట్టవోయ్‌ గట్టిమేలు తలపెట్టవోయ్‌'' అన్నారు మహాకవి గురజాడ. కానీ, దీనికి విరుద్ధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో గత ఎనిమిదేళ్లుగా వ్యవహారిస్తోంది. మోడీ అసత్యాలు, అర్థ సత్యాలతో ప్రజలను మాయ చేస్తున్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో సుపరిపాలన అందించానని, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకున్నానని, బయో-ఎకానమీ 8 రెట్లు వృద్ధి చెందినట్లు మోడీ స్వయంగా ప్రకటించాడు. మరోవైపు పర్యావరణ నిబంధనలు 'అభివృద్ధికి ఆటంకం' అని మోడీ చెబుతున్నారు. కార్పొరేట్లకు అనుకూలమైన పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ఇది డొంక తిరుగుడుగా మద్దతు పలుకడమే అవుతుంది. నిజానికి బయో-ఎకానమీ అంటే పర్యావరణానికి హానిచేసే శిలాజ ఇంధనాల వాడకం నుండి
వ్యాసాలు

నీటి ప్రైవేటీకరణ-పర్యావరణం పై ప్రభావం

సకల జీవరాసులకు నీరు ఎంత ప్రాణదాయినో చెప్పవలసిన పని లేదు. నీరు లేకపోతే జీవపు ఉనికే లేదు. భూమి పై అత్యంత విస్తారంగా లభించే సహజ వనరు కూడా గాలితో పాటు నీరే. అటువంటి నీరు ప్రకృతి కారణాలతో తప్ప అందరికీ, సకల జీవరాసులకు సహజంగానే లభించాలి. నీటిని తాగు, సాగు అవసరాలకై ప్రజలందరికీ లభ్యమయ్యేలా చూడటం అన్ని ప్రభుత్వాల సహజ బాధ్యత. అవి తమ బాధ్యతను ఎంత వరకు నెరవేర్చాయనే విషయం పక్కన పెడితే గత మూడు దశాబ్దాలుగా ఇంతటి సహజమైన వనరును కూడా, ఏ వనరు లేకపోతే మానవ మనుగడే ఉండదో అటువంటి వనరును కూడా